newssting
BITING NEWS :
*కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం * విశాఖ భూ కుంభకోణంపై సిట్‌ ఏర్పాటు * ఆర్టీసీ జేఏసీ సమావేశం.*ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ.. కోర్టుకు నివేదిక సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం*హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం...ప్రియురాలిని భవనం పైనుంచి కిందకు నెట్టి చంపిన ప్రియుడు*కేబినెట్ సమావేశాల నిర్వాహణలో సీఎం జగన్ కీలక నిర్ణయం..ఇకపై నెలలో రెండు సార్లు మంత్రి వర్గ సమావేశం *ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై గవర్నర్ తమిళిసై ఆరా...మంత్రి పువ్వాడ అజయ్ తో ఫోన్‌ లో మాట్లాడిన గవర్నర్ *హూజూర్‌నగర్‌లో భారీ వర్షం.. మార్గ మధ్యలో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం.. కేసీఆర్ టూర్ రద్దు

ఎమ్మెల్యేల‌ను జ‌గ‌న్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారా..?

18-07-201918-07-2019 07:43:18 IST
Updated On 18-07-2019 11:21:58 ISTUpdated On 18-07-20192019-07-18T02:13:18.809Z18-07-2019 2019-07-18T02:13:05.581Z - 2019-07-18T05:51:58.858Z - 18-07-2019

ఎమ్మెల్యేల‌ను జ‌గ‌న్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్రదేశ్‌లో అధికారం చేప‌ట్టి నెల‌న్న‌ర అవుతున్న వైఎస్ జ‌గన్మోహ‌న్ రెడ్డి పాల‌న‌లో త‌న మార్క్ చూపించాల‌ని భావిస్తున్నారు. త‌న‌పై గ‌తంలో ఉన్న ముద్ర‌ల‌ను తొల‌గించుకుంటూ వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అవినీతి ర‌హిత పాలన అందిస్తామ‌ని ప‌దేప‌దే చెబుతున్నారు. అధికారుల‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఇప్పుడు ఇదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల‌ను తెగ ఇబ్బంది పెడుతోంది.

గత ఐదేళ్లు ప్ర‌తిప‌క్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు అన్ని విధాలుగా న‌ష్ట‌పోయారు. ఐదేళ్లు స్వంత డ‌బ్బులు పెట్టుకొని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని న‌డిపించారు. ఎన్నిక‌ల్లోనూ టీడీపీ అభ్య‌ర్థుల‌కు ఎక్క‌డా త‌గ్గ‌కుండా ఖ‌ర్చు చేశారు.

కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ వారి కంటే కూడా ఎక్కువ ఖ‌ర్చు చేశారు. ఇక‌, ఎన్నిక‌ల్లో గెలిచాక త‌మ‌దే రాజ్యం అనుకోవ‌డానికి వీలు లేకుండా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అడుగులు ఉన్నాయి.

ప్ర‌మాణ‌స్వీకారం చేసిన నాటి నుంచే జ‌గ‌న్ ప‌దేప‌దే ఎమ్మెల్యేల‌ను సున్నితంగా హెచ్చ‌రిస్తూ పోతున్నారు. అవినీతికి, ఇత‌ర అక్ర‌మాల‌కు తావు లేకుండా ఉండాల‌ని చెబుతున్నారు.

మంత్రుల‌కు కూడా ఇవే విష‌యాన్ని జ‌గ‌న్ స్ప‌ష్టంగా చెప్పారు. ఎక్క‌డైనా అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు తేలితే వెంట‌నే చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని మొద‌టిరోజే వార్నింగ్ కూడా ఇచ్చారు.

ఇటీవ‌లి అధికారుల బ‌దిలీల్లో జోక్యం చేసుకున్న ఒక‌రిద్ద‌రు ఎమ్మెల్యేలు, మంత్రుల‌కు కూడా జ‌గ‌న్ క్లాస్ తీసుకున్నార‌ని అమ‌రావ‌తిలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

రెండు రోజుల పాటు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల‌తో స‌మావేశమైన జ‌గ‌న్ మంచి ప‌నుల కోసం మాత్ర‌మే త‌మ ఎమ్మెల్యేల మాట వినాల‌ని, అక్ర‌మాల కోసం ఎవ‌రు సిఫార్సు చేసినా ప‌ట్టించుకోవ‌ద్ద‌ని చెబుతూ పూర్తి స్వేచ్ఛ‌ను ఇచ్చారు.

దీంతో ఎమ్మెల్యేల పెత్త‌నం అన్ని విష‌యాల్లో చెల్ల‌డం లేదు. కేవ‌లం అభివృద్ధి, స‌మ‌స్య‌ల ప‌రిష్క‌రంలో మాత్ర‌మే ఎమ్మెల్యేల‌కు అధికారులు స‌హ‌క‌రిస్తున్నారు.

క్యాడ‌ర్‌కు సంబంధించి నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ప‌నిచేయాల‌ని ఎటువంటి సిఫార్సులు చేసినా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇది ఎమ్మెల్యేల‌కు కొంత ఇబ్బందిగానే మారింది. అయితే, ప్ర‌జ‌ల్లో మాత్రం ఇది మంచి సంకేతాల‌ను తీసుకెళుతుండ‌టంతో ఎమ్మెల్యేలు స‌ర్దుకుపోతున్నారు.

తాజాగా, ఎమ్మెల్యేలు, మంత్రులకు అటెండెన్స్ పెట్టాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు. అసెంబ్లీ స‌మావేశాల‌కు ముందు నిర్వ‌హించిన శిక్ష‌ణ త‌ర‌గ‌తుల్లో ఎమ్మెల్యేలు త‌ప్ప‌నిస‌రిగా అసెంబ్లీకి హాజ‌రుకావాల‌ని జ‌గ‌న్ ఆదేశాలు ఇచ్చారు.

అయినా, కొంద‌రు అసెంబ్లీ స‌మావేశాల‌ను తేలిగ్గా తీసుకుంటున్నార‌ని గుర్తించిన జ‌గ‌న్ ఈ మేర‌కు కొత్త నిర్ణ‌యం తీసుకున్నారు. అసెంబ్లీకి ఎమ్మెల్యేలు ఎప్పుడు వ‌స్తున్నారో, ఎప్పుడు వెళుతున్నారో త‌న‌కు ప్ర‌తీరోజూ సాయంత్రానికి రిపోర్టు ఇవ్వాల్సిందిగా చీప్‌విప్ శ్రీకాంత్ రెడ్డికి ఆయ‌న ఆదేశాలు ఇచ్చారు. ఇలా, ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్ బాగా ఇబ్బంది పెడుతున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

లెక్క తేలింది.. మద్యం దరఖాస్తుల ద్వారా రూ. 960 కోట్లు

లెక్క తేలింది.. మద్యం దరఖాస్తుల ద్వారా రూ. 960 కోట్లు

   9 hours ago


కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం

కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం

   9 hours ago


‘మహా’లో పట్టు నిలిచేనా? హర్యానాలో హవా సాగేనా?

‘మహా’లో పట్టు నిలిచేనా? హర్యానాలో హవా సాగేనా?

   10 hours ago


టీఆర్ఎస్‌లో తిరుగుబాటు.. కేసీఆర్ సర్కార్ పై నీలినీడలు

టీఆర్ఎస్‌లో తిరుగుబాటు.. కేసీఆర్ సర్కార్ పై నీలినీడలు

   10 hours ago


జర్నలిస్టు హత్య కేసు:ప్రాణహాని ఉందని చెప్పినా పట్టించుకోలేదా?

జర్నలిస్టు హత్య కేసు:ప్రాణహాని ఉందని చెప్పినా పట్టించుకోలేదా?

   11 hours ago


హుజూర్‌నగర్లో హోరాహోరీ.. గెలుపెవరిది?

హుజూర్‌నగర్లో హోరాహోరీ.. గెలుపెవరిది?

   11 hours ago


ఆ విషయంలో జగన్ కంటే వైఎస్సే బెస్ట్.. బాబు కామెంట్స్

ఆ విషయంలో జగన్ కంటే వైఎస్సే బెస్ట్.. బాబు కామెంట్స్

   13 hours ago


జేసీ బ్రదర్స్‌ప్రై ప్రతీకారం మొదలైనట్లేనా..

జేసీ బ్రదర్స్‌ప్రై ప్రతీకారం మొదలైనట్లేనా..

   13 hours ago


దేవుడు కూడా కేసీఆర్‌‌ను వ్యతిరేకిస్తున్నాడుగా.. దాసోజు ఎద్దేవా

దేవుడు కూడా కేసీఆర్‌‌ను వ్యతిరేకిస్తున్నాడుగా.. దాసోజు ఎద్దేవా

   14 hours ago


ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

   14 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle