newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

ఎమ్మెల్యేల‌కు క్లాస్ పీకిన సీఎం జ‌గ‌న్..!

30-12-201930-12-2019 12:24:17 IST
2019-12-30T06:54:17.924Z30-12-2019 2019-12-30T06:54:14.787Z - - 15-08-2020

ఎమ్మెల్యేల‌కు క్లాస్ పీకిన సీఎం జ‌గ‌న్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి త‌న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల‌కు క్లాస్ పీకారు. కాగా, అమ‌రావ‌తి నుంచి రాజ‌ధాని త‌ర‌లింపు అంశంపై తాజ‌గా, ఆ ప్రాంతం వైసీపీ ఎమ్మెల్యేలు జ‌గ‌న్‌ను క‌లిసి చ‌ర్చించారు. ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్‌, ఎమ్మెల్యేల మ‌ధ్య వాడీ వేడి చ‌ర్చ కొన‌సాగిన్ట‌టు స‌మాచారం. రాజ‌ధాని ఏర్పాటుకు అమ‌రావ‌తిలో అయ్యే ఖ‌ర్చును భ‌రించ‌డం కుద‌ర‌దు క‌నుక‌, విశాఖ‌, కర్నూలుకు త‌ర‌లించ‌క త‌ప్ప‌దు అని జ‌గ‌న్ త‌న ఎమ్మెల్యేల‌కు స్ప‌ష్టం చేశారు.

అయితే, జ‌గ‌న్ మాట‌ల‌ను విన్న ఎమ్మెల్యేలు అమ‌రావ‌తిలో మేం ఎట్లా తిర‌గాలి..? అన్న ప్ర‌శ్న‌ను ఎవ‌రూ సంధించ‌క‌పోయినా, ప్ర‌జ‌ల నుంచి మేం ఇబ్బందులు ప‌డ‌తాం. అంటూ జ‌గ‌న్ ముందు అమ‌రావ‌తి ప్రాంత ఎమ్మెల్యేలు వారి గోడును వెళ్ల‌బోసుకున్న‌ట్టు రాజ‌కీయ విశ్లేష‌కులు చెప్పుకొస్తున్నారు. వారి ప్ర‌శ్న‌ల‌కు స్పందించిన జ‌గ‌న్.. వారిలో భరోసా క‌ల్పించేలా కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశార‌ట‌.

ముందు మీరు జ‌నంలో ఉండండి. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనూ మిమ్మ‌ల్ని గెలిపించుకునే బాధ్య‌త నాది. ఎన్నిక‌ల స‌మ‌యంలో అయ్యే ఖ‌ర్చుల‌ను సైతం నేనే భ‌రిస్తా. వాస్త‌వానికి ఈ రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం వంద‌లాది సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నాం. టీడీపీ హ‌యాంలో సీఎంగా ఉన్న చంద్ర‌బాబు రెండు మూడు సంక్షేమ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించినందుకే ఆ పార్టీకి 40 శాతం ఓట్లు వ‌చ్చాయ‌ని గుర్తు చేసిన సీఎం జ‌గ‌న్‌.. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న మ‌నం గ్రామ వాలెంటీర్లను ఇంటింటికి పంపించి ప‌థ‌కాలు అందాయా..? లేవా..? అని అడిగి తెలుసుకుని, ఒక‌వేళ అంద‌క‌పోతే వెంట‌నే అందుకు గ‌ల స‌మ‌స్య‌ను తెలుసుకుని ప‌రిష్క‌రిస్తున్నామ‌న్నారు.

కానీ, మీరు మాత్రం నియోజ‌క‌వ‌ర్గాల్లో కాకుండా వేర్వేరు సిటీల‌లో నివాసం ఉంటున్నారు. ఇటువంటి వాద‌న‌ల‌ను నా ముందు వినిపించ‌డం మానేసి రాజ‌కీయాల్లో ఇన్వాల్వ్ కండి. ఎవరికి వారు వారి నియోజ‌క‌వ‌ర్గ  ప్ర‌జ‌ల‌కు నిత్యం అందుబాటులో ఉండండి. నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న‌ప్పుడే స‌మ‌స్య‌లు చెప్పుకునేందుకు ప్ర‌జ‌లు మీ వ‌ద్ద‌కు వ‌స్తారు. లేకుంటే మీ అసిస్టెంట్ ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌తారు. అత‌ను మీకు స‌మాచారాన్ని చేర‌వేయ‌వ‌చ్చు. చేర‌వేయ‌క‌పోవ‌చ్చు.  క‌నుక మీరు పూర్తిగా వ్యాపారాలు, మిగ‌తా వ్య‌వ‌హారాల‌న్నింటిని వ‌దిలేసి రాజ‌కీయాల్లో ఇన్వాల్వ్ కావాలంటూ సీఎం జ‌గ‌న్ త‌న పార్టీ ఎమ్మెల్యేల‌కు సూచించారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle