newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

ఎన్నిక‌ల ర‌ణంలో జ‌గ‌న్ వ‌దిలిన బాణం

11-03-201911-03-2019 07:07:52 IST
Updated On 11-03-2019 07:56:05 ISTUpdated On 11-03-20192019-03-11T01:37:52.831Z11-03-2019 2019-03-11T01:37:47.927Z - 2019-03-11T02:26:05.484Z - 11-03-2019

ఎన్నిక‌ల ర‌ణంలో జ‌గ‌న్ వ‌దిలిన బాణం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
‘‘నేను జ‌గ‌న‌న్న వ‌దిలిన బాణాన్ని’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి క‌ష్ట‌కాలంలో అండ‌గా ఉన్నారు ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ సోద‌రి వైఎస్ ష‌ర్మిల‌. గ‌త ఎన్నిక‌ల ప్ర‌చారంలో చురుగ్గా పాల్గొన్న ఆమె ఎన్నిక‌ల త‌ర్వాత పార్టీ కార్య‌క్ర‌మాలకు దూరంగా ఉంటున్నారు. ఒకట్రెండు కార్య‌క్ర‌మాలు మిన‌హా ఆమె మ‌రెక్క‌డా పార్టీ వేదిక‌ల‌పై క‌నిపించ‌డం లేదు. అయితే, ఇప్పుడు ఎన్నిక‌ల వేళ మ‌రోసారి జ‌గ‌న్.. ష‌ర్మిల‌ను తెర‌పైకి తీసుకువ‌స్తున్నారు.

జ‌గ‌న్ జైలులో ఉన్న స‌మ‌యంలో ష‌ర్మిల‌ జ‌గ‌న్ స్థానంలో పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ్డారు. జ‌గ‌న్ పూర్తి చేయ‌ని జిల్లాల్లో ప‌రామ‌ర్శ యాత్ర పేరుతో ఆమె ఓదార్పు యాత్ర జ‌రిపారు. ఎన్నిక‌ల‌కు ముందు అప్ప‌టి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆమె సుదీర్ఘ పాద‌యాత్ర చేసి పార్టీని కాపాడ‌టంలో కీల‌క‌పాత్ర పోషించారు. గ‌త ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ ఆమె బాగానే క‌ష్ట‌ప‌డి ఎన్నిక‌లు పూర్త‌య్యాక పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు.

జ‌గ‌న్ రాజ‌కీయ భ‌విష్య‌త్‌కు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మ‌నుగ‌డ‌కు అత్యంత కీల‌క‌మైన‌విగా భావిస్తున్న ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేందుకు జ‌గ‌న్ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నారు. ఈ నేప‌థ్యంలో గ‌త ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను బేరీజు వేసుకొని ఈసారి ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ దెబ్బ‌తిన్న కృష్ణా, గుంటూరు, ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌తో పాటు విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌నగ‌రం, శ్రీకాకుళం జిల్లాల‌పై జ‌గ‌న్ ప్ర‌త్యేక దృష్టి పెట్టాల‌నుకుంటున్నారు.

ఆయ‌న ప్ర‌చారానికి ఎక్కువ స‌మ‌యం ఈ జిల్లాల్లోనే ప్రాధాన్య‌త ఇవ్వ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో త‌న‌కు ప‌ట్టున్న జిల్లాలుగా భావిస్తున్న క‌డ‌ప‌, చిత్తూరు, క‌ర్నూలు, ప్ర‌కాశం, నెల్లూరు జిల్లాల‌తో పాటు అనంత‌పురం జిల్లా ప్ర‌చార బాధ్య‌త‌ల‌ను పూర్తిగా సోద‌రి ష‌ర్మిల‌కు అప్ప‌గించాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. జ‌గ‌న్ కూడా ఈ జిల్లాల్లో ప్ర‌చారం నిర్వ‌హిస్తారు కానీ ష‌ర్మిల‌నే వీటి బాధ్య‌త‌లు పూర్తిగా తీసుకోనున్నారు. ఆమె ప్ర‌చారానికి ఇప్ప‌టికే ఏర్పాట్లు కూడా జ‌రుగుతున్నాయి. ఆమె కోసం ప్ర‌త్యేకంగా ఓ ప్ర‌చార వాహ‌నాన్ని కూడా సిద్ధం చేసింది పార్టీ.

ఇక‌, ఎన్నిక‌ల బ‌రిలోనూ ష‌ర్మిల‌ను దింపాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. ఇందుకోసం ఆయ‌న మూడు స్థానాల‌ను ప‌రిశీలిస్తున్నార‌ని తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో అనంత‌పురంలో వైసీపీ పూర్తిగా దెబ్బ‌తిన్నందున అనంత‌పురం ఎంపీ స్థానానికి ష‌ర్మిల‌ను బ‌రిలో నిల‌ప‌డం ద్వారా ఆ ప్ర‌భావం జిల్లా మొత్తంపై ఉంటుంద‌ని, జిల్లాలోని ఎక్కువ అసెంబ్లీ స్థానాల‌ను గెలుచుకోవ‌చ్చ‌ని జ‌గ‌న్ అంచ‌నా వేస్తున్నారు.

క‌ర్నూలు పార్ల‌మెంటు స్థానాన్ని కూడా ష‌ర్మిల కోసం ఒక ఆప్ష‌న్‌ గా చూస్తున్నారు. ఇక్క‌డ టీడీపీ నుంచి కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి బ‌రిలో ఉండ‌నున్నారు. ఆయ‌న‌కు ల‌క్ష ఓట్ల వ్య‌క్తిగ‌త ఓటు బ్యాంకు ఉంటుంద‌ని అంచ‌నా. ఆయ‌న ఇప్పుడు టీడీపీలో చేర‌డంతో క‌ర్నూలులో ఆ పార్టీకి అద‌న‌పు బ‌లం చేకూరింది. గ‌త ఎన్నిక‌ల్లో క‌ర్నూలు జిల్లాలో ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించిన వైసీపీ ఈ ఎన్నిక‌ల్లోనూ చేజార్చుకోవ‌ద్ద‌ని చూస్తుంది. అందుకే ష‌ర్మిల‌ను ఇక్క‌డి నుంచి బ‌రిలో నిలిపితే కోట్ల‌ను ఓడించ‌డంతో పాటు జిల్లాలో మెజారిటీ స్థానాల‌ను ద‌క్కించుకోవ‌చ్చ‌ని వైసీపీ భావిస్తోంది.

అయితే, ఈ స్థానాన్ని గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ బీసీల‌కు కేటాయించారు. ఈసారి కూడా బీసీ అయిన బీవై రామ‌య్య‌కు కేటాయిస్తార‌ని ఇంత‌కాలం ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు బీసీల‌కు కాకుండా ష‌ర్మిల‌కు ఇస్తే త‌ప్పుడు సంకేతాలు వెళ‌తాయ‌నే భ‌యం కూడా వైసీపీలో ఉంది. ఒకవేళ క‌ర్నూలు కాకుంటే ఒంగోలు నుంచి ష‌ర్మిల పోటీ చేస్తార‌ని తెలుస్తోంది. మొత్తానికి ఈసారి ష‌ర్మిల ఎన్నిక‌ల ప్ర‌చార బాధ్య‌త‌లు తీసుకోవ‌డంతో పాటు పోటీకి కూడా నిల‌వ‌డం మాత్రం ఖాయ‌మైంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle