newssting
BITING NEWS :
*జపాన్ టీంని ఓడించిన ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం *ప్రత్యేక హోదాపై తేల్చేసిన కేంద్రం... దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం లేదన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్*బీహార్ లో మెదడువాపు వ్యాధికి బలమయిన 152 మంది చిన్నారులు *ప్రజావేదికను కూల్చేయండి.. సీఎం జగన్ ఆదేశం*కొనసాగుతున్న ఏపీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్*అఫ్గాన్‌పై బంగ్లా ఘనవిజయం

ఎన్నిక‌ల్లో గెలుస్తారా..? రాజ‌కీయాల్లో నిలుస్తారా..?-2

01-05-201901-05-2019 08:38:37 IST
Updated On 01-05-2019 08:44:10 ISTUpdated On 01-05-20192019-05-01T03:08:37.633Z01-05-2019 2019-05-01T03:08:30.401Z - 2019-05-01T03:14:10.388Z - 01-05-2019

ఎన్నిక‌ల్లో గెలుస్తారా..? రాజ‌కీయాల్లో నిలుస్తారా..?-2
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
(మొదటి భాగం తరువాయి)

వైఎస్సార్ కాంగ్రెస్ త‌ర‌పున ఈసారి ఇద్ద‌రు సివిల్ స‌ర్వీసెస్‌లో ప‌నిచేసిన అభ్య‌ర్థులు ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. రాయ‌ల‌సీమ రేంజ్ ఐజీగా ప‌నిచేసిన ఇక్బాల్ హిందూపురం ఎమ్మెల్యేగా బాల‌కృష్ణ‌పై పోటీ చేశారు. ఆయ‌న గ‌ట్టి పోటీ ఇచ్చార‌నే అంచ‌నాలు ఉన్నాయి. మ‌రో ఐపీఎస్ చంద్ర‌గిరి ఏసుర‌త్నం మొద‌టిసారిగా వైసీపీ త‌ర‌పున గుంటూరు ప‌శ్చిమ నుంచి బ‌రిలో నిలిచారు. అర్బ‌న్ ప్రాంతం కావ‌డం, విద్యావంతులు అవ్వ‌డం ఆయ‌న‌కు క‌లిసివ‌చ్చింది. ఆయ‌న కూడా గెలుపు పందెంలో ముందున్నార‌నే అంచ‌నాలు ఉన్నాయి.

ఇక‌, తెలుగుదేశం పార్టీ త‌ర‌పున మాజీ ఐఆర్ఎస్ అధికారి, సిట్టింగ్ ఎంపీ మాల్యాద్రి శ్రీరామ్ మ‌రోసారి బాప‌ట్ల ఎంపీగా బ‌రిలో ఉన్నారు. ఈసారి ఆయ‌న‌కు వైసీపీ నుంచి నందిగం సురేశ్ గ‌ట్టి పోటీ ఇచ్చారు. ఇక‌, క‌ర్నూలు జిల్లా కోడుమూరు అసెంబ్లీ నుంచి మాజీ ఐఏఎస్ అధికారి రామాంజ‌నేయులు టీడీపీ త‌ర‌పున పోటీ చేశారు. అయితే, ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి ఏకంగా 52 వేల మెజారిటీ వ‌చ్చింది. ఈసారి ఫ‌లితం ఎలా ఉంటుందో చూడాలి.

సివిల్ స‌ర్వీసెస్ అధికారి కాక‌పోయినా గోరంట్ల మాధ‌వ్ ఈసారి ఎన్నిక‌ల్లో హాట్ టాపిక్ అయ్యారు. క‌దిరి సీఐగా ప‌నిచేస్తూ అధికార పార్టీ ఎంపీపై మీసం మెలేసిన ఆయ‌న కొన్ని రోజుల‌కే వైసీపీలో చేరి హిందూపురం ఎంపీ టిక్కెట్ తెచ్చుకున్నారు. అయితే, ఆయ‌న వీఆర్ఎస్ విష‌యంలో ఆటంకాలు ఏర్ప‌డ‌టం, చివ‌రికి కోర్టుకు వెళ్లాల్పి రావ‌డం ప‌ట్ల ఆయ‌న‌పై సానుభూతి ప‌నిచేసింది.

పైగా ఆయ‌న స్వంత సామాజ‌క‌వ‌ర్గం బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఆయ‌న‌కు గెలుపు అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. మొత్తంగా ఈసారి క‌చ్చితంగా కొంద‌రు ఉన్న‌త ఉద్యోగాలు చేసిన వారు చ‌ట్ట స‌భ‌ల్లో అడుగుపెట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

మొత్తం మీద సమాజానికి సేవ  చేయాలనుకునే వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం శుభ పరిణామమే అంటున్నారు మాజీ ఎమ్మెల్యే, లోక్ సత్తా అధినేత డా.జయప్రకాష్ నారాయణ్. వివిధ హోదాల్లో పనిచేసిన ఉద్యోగులకు సమాజంపై అవగాహన ఉంటుందని, వారికి అవకాశం దొరికితే కొంతైనా మార్పువస్తుందని జేపీ చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి.. ఎన్నిక‌ల్లో గెలుస్తారా..? రాజ‌కీయాల్లో నిలుస్తారా..?-1 

https://www.newssting.in/p/5cc90b55c6df354872590983


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle