newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

ఎన్నికల వేళ అందరి చూపు అటు వైపు..!

29-03-201929-03-2019 07:41:46 IST
Updated On 30-03-2019 13:25:16 ISTUpdated On 30-03-20192019-03-29T02:11:46.926Z29-03-2019 2019-03-29T02:11:38.984Z - 2019-03-30T07:55:16.069Z - 30-03-2019

ఎన్నికల వేళ అందరి చూపు అటు వైపు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా 15 రోజులు కూడా సమయం లేదు. పార్టీలన్నీ విజయమే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహా అందరూ ముఖ్య నేతలూ ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ 10 రోజుల పాటు వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో తిరగాలనుకుంటున్నారు. 

అయితే, ఈ సమయంలో అందరి ఆసక్తి ప్రజల మీద ఉండాలి. ప్రజలు ఎటువైపు మొగ్గుతున్నారో చూడాలి. ఎవరి సభలకు ఎలాంటి స్పందన వస్తుందో పరిశీలించాలి. ఎవరు ఏ హామీలు ఇస్తున్నారో, ఏమి చెబుతున్నారో ఆసక్తి ఉండాలి. కానీ, ఇప్పుడు మాత్రం రణక్షేత్రంలో కంటే ఎక్కువగా హైకోర్టుపైనే పార్టీలు, ప్రజల ఆసక్తి నెలకొని ఉంది.

రాష్ట్ర రాజకీయాలను, ఎన్నికలను ప్రభావితం చేయగలిగే మూడు కేసులు హైకోర్టులో ఉండటంతో ఆ కేసుల్లో ఏ తీర్పులు వస్తాయనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. దీంతో పార్టీల ప్రచారం కంటే హైకోర్టుకే ఎక్కువ ప్రాధాన్యత ఏర్పడింది. మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారం హైకోర్టులోనే ఉంది.

తన చిన్నాన్నను టీడీపీ వాళ్లే చంపించారని జగన్, కాదు జగనే చంపించాడని చంద్రబాబు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ హత్యను చంద్రబాబు ఒక ప్రచారాస్త్రంగా వాడుకున్నారు. దీంతో రాష్ట్ర పోలీసులు విచారణ జరిపిస్తే తమకు న్యాయం జరగదని, థర్డ్ పార్టీతో విచారణ చేయించాలని వివేకా భార్య సౌభాగ్యమ్మ, జగన్ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లను కోర్టు విచారిస్తోంది.

ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఎన్నికలు ముగిసేవరకు ప్రెస్ మీట్ పెట్టొద్దని కోర్టు సిట్‌‌కు సూచించింది. దీంతో ఎన్నికల ముందే ప్రెస్ మీట్ పెట్టి హత్య నేరాన్ని కుటుంబసభ్యుల మీదకో, పార్టీ మీదకో తోస్తే ఎన్నికల్లో నష్టం జరుగుతుందనుకున్న వైసీపీకి కొంత ఊరట దక్కింది. థర్డ్ పార్టీ విచారణ కావాలనే అంశంపై కూడా ఇవాళో రేపో తీర్పు రావచ్చు. ఏ తీర్పు వచ్చినా ఎన్నికలపై కొంత ప్రభావం ఉండవచ్చు.

ఇక, ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును ఎన్నికల సంఘం బదిలీ చేయడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఇంటెలిజెన్స్ ఎన్నికల సంఘం పరిధిలోకి రాదని సర్కార్ వాధిస్తోంది. తమ పరిధిలోకే వస్తుందని ఎన్నికల సంఘం అంటోంది. ఇందులో వైసీపీ కూడా ఇంప్లీడ్ కావడంతో పూర్తిగా రాజకీయాలు ముడిపడి ఉన్నాయి. ఇందులోనూ ఏ తీర్పు వచ్చినా ఎన్నికలపై ఎంతో కొంత ప్రభావం ఉండవచ్చు.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా వ్యవహారం కూడా ఏపీ హైకోర్టులోనే ఉంది. ఈ సినిమాలో రాజకీయ దురుద్దేశ్యాలు ఉన్నందున ఎన్నికలు పూర్తయ్యే వరకు వాయిదా వేయాలని టీడీపీ కోర్టుకెక్కింది. దీంతో ఇవాళ విడుదల కావాల్సిన సినిమాపై ఏప్రిల్ 3 వరకు స్టే ఇచ్చింది. 3న ప్రివ్యూ చేశాక విడుదల చేయాలో లేదో చెప్తామని కోర్టు స్పష్టం చేసింది. ఇలా ఎన్నికలను ప్రభావితం చేసే మూడు కేసులు కోర్టులో ఉండటంతో అందరి దృష్టి హైకోర్టుపైన పడింది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle