newssting
BITING NEWS :
*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి* కర్నాటక సీఎం యడియూరప్ప కేబినెట్ విస్తరణ..17మందికి ఛాన్స్ *పంచాయతీరాజ్‌లో మరో రూ.300 కోట్ల పనులు రద్దు*పోలవరం రీ టెండరింగ్ పై హైకోర్టులో నవయుగ పిటిషన్ * కృష్ణా నదీ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన* చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2*రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ *అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స *పన్ను సంస్కరణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

ఎన్నికల వేడి- రెండుపార్టీల తొలి జాబితా రెడీ

20-12-201820-12-2018 15:46:35 IST
2018-12-20T10:16:35.850Z20-12-2018 2018-12-20T10:16:33.333Z - - 21-08-2019

ఎన్నికల వేడి- రెండుపార్టీల తొలి జాబితా రెడీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికలకు ఇంకా మూడునాలుగు నెలల సమయం ఉన్నా అభ్యర్ధుల ఎంపికను ఇప్పటినుంచే ప్రారంభిస్తున్నాయి టీడీపీ, వైసీపీలు. ఫిబ్రవరిలో ఏపీ శాసనసభకు జరగనున్న ఎన్నికలకు శంఖారావం మోగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో సభలు నిర్వహించేలా టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటినుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. జనవరిలో టీడీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు చంద్రబాబునాయుడు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే సుమారు 50 మంది అభ్యర్థుల జాబితా రెడీ అయిందంటున్నాయి టీడీపీ వర్గాలు. ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే జనవరి చివరినాటికి అభ్యర్ధులను ప్రకటించి, ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారని తెలుస్తోంది. అభ్యర్థులను ముందుగా ప్రకటించడం వల్ల పార్టీ పరిస్థితులను మెరుగుపరుచుకోవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. గత ఎన్నికల సందర్భంగా ఏర్పడిన లోటుపాట్లను  దృష్టిలో ఉంచుకొని ఈ దఫా ముందుగానే అభ్యర్థులను ప్రకటించేందుకు బాబు సన్నాహాలు చేస్తున్నారు.ఎలాంటి ఇబ్బందులు లేని స్థానాల్లో అభ్యర్థుల జాబితా తొలి జాబితాలో అవకాశం కల్పించనున్నారు. వివిధ రకాల సర్వే ఆధారంగా అభ్యర్థుల జాబితాను బాబు ప్రకటించనున్నారు.

 మరోవైపు టీడీపీకి ధీటుగా వైసీపీ అధినేత జగన్ అడుగులు వేస్తున్నారు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాల‌నే ఉద్దేశంతో త‌మ ఆలోచ‌న‌ల‌కు ప‌దును పెడుతున్నారు విపక్ష నేత జగన్. అభ్యర్థుల గెలుపోటములు, అనుకూలతలు, ప్రతికూలతలపై సర్వేలు మీద సర్వేలు చేయించారు జగన్. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిషోర్ టీం నుంచి సర్వే నివేదికలు అందాయి. వీటి ఆధారంగా జగన్ ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చినవారికి జగన్ వార్నింగ్‌లు కూడా ఇచ్చారు. 2014 ఎన్నికల్లో చేసిన పొరపాట్లు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు వైఎస్ జగన్ ఆచితూచి ముందడుగు వేస్తున్నారు. పాదయాత్ర సందర్బంగా ఆయా నియోజకవర్గాల అభ్యర్ధుల పనితీరుపై ఒక అంచనాకు వచ్చారు జగన్. గెలుపు గుర్రాలనే బరిలో దింపాలనే ఉద్దేశంతో ఇతర పార్టీలనుంచి వచ్చిన నేతల గుణగణాలను పరిశీలిస్తున్నారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు చెక్ పెట్టేందుకు జ‌గ‌న్ వ్యూహం అనుసరిస్తున్నారు. వారిని రాజకీయాలనుంచి దూరం చేసేందుకు శక్తియుక్తులు వినియోగించనున్నారు. 

ఈసీ కాల్ సెంటర్ 

తెలంగాణ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఓట్ల గల్లంతు, ఓట్ల తీసివేత వంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎన్నికల సంఘం అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఓటర్ల నమోదు ప్రక్రియలో లోపాలను సరిదిద్దే లక్ష్యంతో ఏర్పాటుచేసిన కాల్ సెంటర్‌ను విజయవాడలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆర్పీ సిసోడియా ప్రారంభించారు. ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు తక్షణం తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఓట్ల నమోదులో ఏవైనా ఇబ్బందులుంటే కాల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన 1950 టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేయాలని కోరారు. ఓటర్ల జాబితాలో లోపాల్ని సరిదిద్దే ప్రక్రియ ప్రారంభమైందని సిసోడియా పేర్కొన్నారు. ఓటరు జాబితాలో పేర్లు చెక్ చేసుకునేందుకు వీలుగా త్వరలో మొబైల్ యాప్ అందుబాటులోకి తీసుకు వస్తామని సిసోడియా చెబుతున్నారు. రాష్ట్రస్ధాయి కాల్ సెంటర్ లో ఎన్నికల ప్రారంభం నాటికి పూర్తిస్థాయి సిబ్బంది అందుబాటులో ఉంటారని సిసోడియా అన్నారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle