newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

ఎన్నికల ముందు ఆఖరి అసెంబ్లీ...

09-02-201909-02-2019 13:07:50 IST
Updated On 09-02-2019 13:07:48 ISTUpdated On 09-02-20192019-02-09T07:37:50.672Z09-02-2019 2019-02-09T07:36:44.606Z - 2019-02-09T07:37:48.292Z - 09-02-2019

ఎన్నికల ముందు ఆఖరి అసెంబ్లీ...
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అయిదేళ్ల అసెంబ్లీ ఆఖరి రోజు భావోద్వేగాల మధ్య ముగిసింది. చంద్రబాబు ధన్యవాద తీర్మానానికి సభ్యులందరూ నిలబడి కరతాళధ్వనులు  చేశారు. 'మళ్ళీ మీరే రావాలి' అంటూ నినాదాలు చేశారు. అక్కడ ఉన్నవాళ్ళంతా తెలుగుదేశం ఎమ్మెల్యేలే కాబట్టి వేరే నినాదాలు వినిపించే ప్రసక్తులే లేవు. ఓట్ ఆన్ అకౌంట్ బిల్లుతో పాటు మరికొన్ని బిల్లుల్ని కూడా అసెంబ్లీలో పాస్ చేశారు.  

నిజానికి ఈ ఐదేళ్లలో ఇవి చివరి సమావేశాలు(పదిహేనవ సెషన్) అయినప్పటికీ ఇప్పటికే చాలా కాలం నుంచి గైర్హాజరవుతున్న విపక్ష  వైస్సార్సీపీ సభ్యుల వెలితి మాత్రం కొట్టిచ్చినట్లు కనిపిస్తుంది. అసలు విపక్షమే లేని సభ ఎంత చప్పగా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ శాసనసభను చూసి జనం తెలుసుకున్నారు. మొదట్లో వాడివేడిగా జరిగిన చర్చలు ఆ తరువాత లేవు.

ప్రభుత్వ నిర్ణయాలను సభలో వ్యతిరేకించే వ్యక్తులు లేరు. సభను బహిష్కరించాలని చాలాకాలం క్రితమే నిర్ణయం తీసుకున్న ఆ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారనిపిస్తుంది. ప్రభుత్వాన్ని నిలదీయడానికి చట్టసభలో కంటే మరెక్కడా అంత మంచి అవకాశం ఒక రాజకీయపక్షానికి దొరకదన్న నిజం ఆయనకు అర్ధం కాలేదు. అయితే కనీసం ఆఖరి సెషన్ కోసమైనా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకుంటే బావుండేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. 

Image result for AP Assembly 

ఈ చివరి సమావేశాలు ఎన్నికల వాతావరణాన్ని తలపించింది.  ప్రభుత్వపరంగా చంద్రబాబు  నిర్ణయాల హడావుడితో బాటు బడ్జెట్ సెషన్ కూడా కావడం మూలంగా ప్రజలకు ఇవ్వాల్సిన వరాలన్నింటినీ ఇందులో చేర్చే ప్రయత్నం ప్రస్ఫుటంగా కన్పించింది. ఒక పక్క మంత్రివర్గ సమావేశాలల్లో నిర్ణయాలు తీసుకోవడం, వెంటనే వాటిని అసెంబ్లీలో  ప్రవేశపెట్టుకుని బిల్లుల రూపాన్ని ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. 

ముఖ్యంగా కాపుల రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై బాబు తన రాజకీయ నిర్ణయాన్ని వెంటనే తీసుకున్నారు. కాపులకు ఈబీసీ కోటాలో అయిదు శాతం రిజర్వేషన్ కల్పించడంలో ఆయన నిర్ణయాన్ని ఎన్నికల స్టంటుగా విపక్షాలు కొట్టిపారేశాయి. నిజానికి ఈ నిర్ణయం వలన తెలుగుదేశం పార్టీకి రాజకీయ ప్రయోజనం కలుగుతుందా అన్న అంశంపై భిన్నాభిప్రాయాలున్నాయి. తమ సామాజిక వర్గానికి రిజర్వేషన్లపై చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపైన  కాపు మహానాడు అధ్యక్షుడు ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ ’’కోర్టులో ఈ విషయంపైన స్పష్టత వచ్చినపుడు మాత్రమే పూర్తి చట్టబద్దత కలుగుతుంది’’అన్నారు. 

రైతులకు శుభవార్తలు చెప్పే అసెంబ్లీ కాలం కూడా ఇదే కాబట్టి దాన్ని అధికార పార్టీ పూర్తిగా వినియోగించుకుంది. బడ్జెట్లో రైతులకు అన్నదాత సుఖీభవ పేరుతో ప్రత్యేకంగా 5వేల కోట్ల రూపాయల్ని కేటాయించడం ఒక ముఖ్యమైన పరిణామం.

ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం పంట సాయం కోసం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఎన్నికల్లో విజయం సాధించడం, ప్రధాన మంత్రితో సహా ఇతర రాష్రాలు సరిగ్గా ఇటువంటి పథకాల వైపు మొగ్గు చూపడం, ముఖ్యంగా ప్రధాన విపక్షపార్టీ నాయకుడు జగన్ కూడా రైతులకు ఎకరానికి రూ. 12500 ప్రకటించడంతో చంద్రబాబు కూడా తప్పనిసరిగా ఇటువంటి పథకంపై వ్యూహరచన చేసినట్లు కనిపిస్తుంది. అయితే రైతులకు ఎంత మొత్తమిస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

మహిళలకు ’’పసుపుకుంకుమ’’ పథకం పేరుతో  95 లక్షల లబ్దిదారులను చంద్రబాబు టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. ఈ పధకానికి ఏకంగా 21వేల కోట్ల రూపాయల్ని కేటాయించినట్లు ముఖ్యమంత్రి శాసనసభ ముగింపు సభలో ప్రస్తావించడం, ఇంటింటికీ 25 వేల రూపాయల ఆదాయం వచ్చే విధంగా ఒక పథకాన్ని రూపొందిస్తున్నట్లు ప్రకటించడం వంటివన్నీ ఎన్నికల వ్యూహంలో భాగాలే !

గత ఎన్నికల్లో ‘‘బాబొస్తే జాబొస్తుందన్న’’ నినాదంతో ప్రచారం చేసుకున్న తెలుగుదేశం కొంతకాలంగా ఉద్యోగాల ప్రస్తకి తీసుకుని రావడంలేదన్న విమర్శలు ఉన్నాయి. అటువంటి విమర్శలకు ఊతమిచ్చేవిధంగా ఈసారి యువతకు సంబంధించిన విషయాలేవీ పెద్దగా చర్చకు రాలేదు. 

ఆఖరి అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజున చంద్రబాబు తన  విజన్ డాక్యుమెంట్ విడుదల చేశారు. నా విజన్ డాక్యుమెంటే పార్టీ మేనిఫెస్టో కూడా అంటూ చెప్పడం దాని ప్రాధ్యానతను పెంచడానికేనన్నది అర్ధమవుతుంది. ఈసారి ఎన్నికల్లో చంద్రబాబుకు వ్యతిరేకత ఉందని సర్వేల ప్రచారం అధికమవ్వడంతో ఆయన అసెంబ్లీ వేదికగా చేసుకుని విపక్షంపై దాడికి దిగినట్లు కనిపిస్తుంది.   

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   11 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   13 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   16 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   17 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   18 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   19 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   19 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   19 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   20 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   20 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle