newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

ఎన్టీఆర్‌ను లాగేశారు..తారక్ ఫోటోపై రచ్చ

11-10-201911-10-2019 15:16:10 IST
Updated On 11-10-2019 18:19:17 ISTUpdated On 11-10-20192019-10-11T09:46:10.908Z11-10-2019 2019-10-11T09:46:07.548Z - 2019-10-11T12:49:17.424Z - 11-10-2019

ఎన్టీఆర్‌ను లాగేశారు..తారక్ ఫోటోపై రచ్చ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ హాట్ టాపిక్. తారక్ మళ్ళీ రాజకీయాల్లోకి రావాలంటూ అప్పుడప్పుడూ సోషల్ మీడియా వేదికగా ఆయన్ని దువ్వుతుంటారు. తాజాగా ఏపీ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కృష్ణాజిల్లాలో తారక్ ఫోటో వివాదం రేపుతోంది. 

ప్రభుత్వాలు మారితే కార్యాలయాలు, గ్రామాల్లో డివైడర్ల రంగులు కూడా మారతాయి. కానీ అధికారం మారాక కూడా పాత ప్రభుత్వ విధానాలు కొనసాగిస్తే అధికారపార్టీ నేతలకు మండుతుంది. 

గతంలో ఏపీలో టీడీపీ సర్కార్ అధికారంలో ఉన్నపుడు చాలా చోట్ల గ్రామ సచివాలయాలకు పసుపు రంగు వేసినట్లు వైసీపీ నేతలు ఆరోపించారు. ఇప్పుడు వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ తనకు ఇష్టమైన రంగులు వేస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

కృష్ణా జిల్లా గంపలగూడెం మండలంలోని దుందిరాలపాడు గ్రామంలో ఇది మండల కేంద్రమైన గంపలగూడెం నుండి 14 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తిరువూరు నుండి 36 కి. మీ. దూరంలోనూ ఉంది. తాజాగా దుందిరాలపాడు గ్రామంలో సచివాలయానికి తెలుపు, ఆకుపచ్చ రంగులు వేశారు. అంతకుముందు గ్రామానికి చెందిన కొందరు టీడీపీ కార్యకర్తలు ఆ భవనానికి పసుపు రంగు వేశారని అంటున్నారు. 

భవనంపై సీఎం జగన్ ఫోటో స్థానంలో నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్‌ను అతికించారు. దీంతో ఆ ఘటన రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో 17మంది కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించడమే కాకుండా సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటం స్థానంలో సినీ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ చిత్రాన్ని పెట్టడంతో వివాదాస్పదం అవుతోంది.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle