newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

ఎన్ఐఏకి బదిలీ చేస్తారా... మేమే చేయాలా?

15-12-201815-12-2018 15:44:57 IST
Updated On 15-12-2018 15:45:09 ISTUpdated On 15-12-20182018-12-15T10:14:57.303Z15-12-2018 2018-12-15T10:13:08.113Z - 2018-12-15T10:15:09.407Z - 15-12-2018

ఎన్ఐఏకి బదిలీ చేస్తారా... మేమే చేయాలా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైసీపీ అధినేత జగన్‌పై జరిగిన కోడికత్తి దాడి కేసులో కేంద్రం ప్రభుత్వ తీరుని ఉమ్మడి హైకోర్టు తప్పుపట్టింది. ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిగింది. జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటన జాతీయ దర్యాప్తు సంస్థ చట్టంలో పేర్కొన్న నేరాల కిందకు వస్తుందో రాదో తేల్చకుండా ఆ బాధ్యతను తమపైకి నెట్టేయడం ఏంటని కేంద్రంపై హైకోర్టు సీరియస్ అయింది. ఈ హత్యాయత్నం ఘటన ఎన్‌ఐఏ చట్ట పరిధిలోకి వస్తుందో రాదో స్పష్టంగా తెలియచేస్తూ సీల్డ్‌ కవర్‌లో నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తనపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటన పౌర విమానయాన భద్రత చట్టం ప్రకారం చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్వచన పరిధిలోకి వస్తుందని, ఇలాంటి ఘటనలపై దర్యాప్తు చేయాల్సింది జాతీయ దర్యాప్తు సంస్థ అని, ఆ మేర కేంద్ర హోంశాఖకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వైఎస్‌ జగన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

జగన్‌పై హత్యాయత్నం ఘటనపై స్వతంత్ర సంస్థ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్‌ సీపీ తరఫున వైవీ సుబ్బారెడ్డి మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదే ఘటనపై ఎన్‌ఐఏ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిల్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను శుక్రవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ కె.లక్ష్మణ్‌ సీల్డ్‌ కవర్‌లో ఓ నివేదికను ధర్మాసనం ముందుంచారు. ఈ నివేదికను పరిశీలించిన ధర్మాసనం, ఇందులో తాము కోరిన వివరాలు లేవంటూ అసహనం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక తెప్పించుకోవడం ఒకటి. ఇతర మార్గాల ద్వారా అందిన సమాచారం రెండోది. కేంద్ర ప్రభుత్వమే సుమోటోగా సమాచారం తెప్పించుకోవడం చేయాలని హైకోర్టు పేర్కొంది. ఈ మూడు మార్గాల్లో ఏదో ఒక దాని ద్వారా సమాచారం అందినప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే అని స్పష్టం చేసింది. కేంద్రం నిర్ణయం తీసుకోకుండా దానిని ఇతరులపైకి నెట్టడం సరికాదంది. ఎన్‌ఐఏ చట్ట ప్రకారం ఈ మొత్తం వ్యవహారంపై నిర్ణయం తీసుకుని దానిని సీల్డ్‌ కవర్‌లో తమ ముందుంచాలని ఆదేశించింది. ఈనెల 21 తర్వాత కేసులో ఏ మలుపులు ఉంటాయోనని వైసీపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle