newssting
BITING NEWS :
* తూర్పుగోదావరి జిల్లా పెనికేరులో వింత జంతువు సంచారం..రాత్రివేళ పశువులను చంపేస్తున్న వింత జంతువు..తీవ్ర భయాందోళనలో స్థానికులు *నెల్లూరు జిల్లా కావలిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..ఆర్టీసీ డిపో ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్య..ముసునూరుకి చెందిన బోయిన మాలకొండయ్య (50)గా గుర్తింపు*జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హై కోర్టు పనిచేస్తోందని, జడ్జి లను దూషిస్తూ సోషల్ మీడియా లో పలు పోస్టింగ్ లు.సుమోటోగా తీసుకొని విచారించి చర్యలు తీసుకోవాలని హై కోర్టుకు లేఖ రాసిన సీనియర్ న్యాయవాది లక్ష్మినారాయణ. *ఓయూలో ఉద్రిక్తత..ఓయూ భూముల పరిశీలన కు వచ్చిన ఉత్తమ్, భట్టి , విహెచ్, ఓయూ భూములు కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ఫైర్..కాంగ్రెస్ కు మద్దతుగా ఓయూ విద్యార్థుల ఆందోళన..రంగంలోకి పోలీసులు* భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా, 6,767 కరోనా కేసులు నమోదు.. 147 మంది మృతి, దేశవ్యాప్తంగా 1,31,868 కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్పటి వరకు 3,867 మంది మృతి..యాక్టివ్ కేసులు 73,560..కోలుకున్న వారు 54,441*తెలంగాణలో 52 కొత్త కరోనా కేసులు..1,813కు చేరిన కరోనా కేసులు సంఖ్య, ఇప్పటి వరకు 49 మంది మృతి..యాక్టివ్ కేసులు 696

ఎగ్జిట్ పోల్స్‌తో ఓటర్ల నాడి పట్టుకోగలమా?

21-05-201921-05-2019 16:24:54 IST
Updated On 21-05-2019 18:53:03 ISTUpdated On 21-05-20192019-05-21T10:54:54.816Z21-05-2019 2019-05-21T10:54:51.539Z - 2019-05-21T13:23:03.922Z - 21-05-2019

ఎగ్జిట్ పోల్స్‌తో ఓటర్ల నాడి పట్టుకోగలమా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏప్రిల్ 11న ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఆ తర్వాతి రోజునుంచి ఏపీలో ఏం జరగబోతోంది? ఎవరు గెలుస్తారు? అనే ఆసక్తికరమయిన చర్చలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు అధికారంలోకి వస్తారా? జగన్ కోరుకున్నట్టుగా అధికారం చేపడతారా? జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయనేది అందరూ చర్చించుకున్నారు. మే 23 వరకూ ఈ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది. ఈ ఎగ్జిట్ పోల్స్ వల్ల జరగబోయేది ఏంటి? ఏపీలో చంద్రబాబు పరిస్థితి ఏంటి? జగన్‌కు అవకాశం ఇస్తారా? జనసేన ఓట్లు చీలుస్తుందా? మే 23న జరగబోయేది ఏంటి?.. అనేక అంశాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు,సీనియర్ జర్నలిస్ట్  భండారు శ్రీనివాసరావు ‘న్యూస్ స్టింగ్’ కోసం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 

ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై తనదైన రీతిలో ఆయన విశ్లేషించారు. ‘‘ఏపీ జనం ఎవరిని ఎన్నుకోబోతున్నారు? జ్యోతిష్యులు చెప్పేవి నిజం అవుతాయా అనేది చెప్పలేం. సెఫాలజీ అనేది ఇప్పుడు తెరమీదకు వచ్చింది. ఓటర్ల నాడి ఎలా ఉంది. శాంపిల్స్ తీసుకుని ఓటర్ల జవాబులు,  గణాంకాల ఆధారంగా ఎవరెవరి బలబలాలు ఎలా ఉన్నాయో తెలియచేసేవారు. ఓటింగ్ జరిగే ప్రాంతాల్లో. జరగబోయే ప్రాంతాల్లో ఓటర్లను ప్రభావితం చేసే ప్రీపోల్ సర్వేలను నిషేధించింది ఎన్నికల సంఘం. అలాగే ఎగ్జిట్ పోల్స్ విషయంలోనూ ఈసారి నిషేధం విధించింది. అన్ని ఎన్నికలు ముగిశాక ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి వివిధ సర్వే సంస్థలు.

ఈ సర్వేలు ఈమధ్యకాలంలో ఎక్కువయ్యాయి. పార్టీలో చేరేముందు, పార్టీ టికెట్ తీసుకునేముందు సర్వేలు చేయిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయిన నాటినుంచి మళ్ళీ పోలింగ్ ప్రారంభం అయ్యే వరకూ తమ తమ పరిస్థితిని తెలుసుకునేందుకు సర్వేలు చేయించుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ పై పెట్టుబడి పెట్టే సంస్థలు ఉండవు. బెట్టింగ్ కి అవకాశం ఉంటుంది. ఎగ్జిట్ పోల్స్ వల్ల అనేకమంది ఆస్తులు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ విష సంస్కృతి పెరిగిపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు’’ అన్నారు భండారు శ్రీనివాసరావు.

‘‘లక్షల రూపాయలు ఖర్చుపెట్టి చేసే సర్వేలు రాజకీయ పార్టీలకు ప్రయోజనం ఎలా ఉన్నా, బెట్టింగ్ మాఫియాను ప్రోత్సహిస్తున్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్ బెట్టింగులను, సంఘ విద్రోహశక్తులను పెంచిపోషిస్తున్నారు. ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందనే అంశం రాజకీయ పరిశీలనకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రవర్తన, ప్రజలు వారిపట్ల వ్యతిరేకత, ఎమ్మెల్యేలు దురుసుగా ప్రవర్తించడం వంటి అంశాల వల్ల ప్రభుత్వాలు కూలిపోతాయి. ఎన్నికల్లో ఈ ప్రభావం బాగా కనిపిస్తుంది. సంక్షేమ పథకాలు ప్రభుత్వాలను గెలిపించవచ్చు. అయితే ప్రజలు గెలిపిస్తారని అనుకోవడం తప్పే. ప్రజలు, ఓటర్లలో ఉదారభావం ఉంది. పోనీ మరో అవకాశం ఇద్దామని భావిస్తారు’’   ‘న్యూస్ స్టింగ్’ తో అన్నారు భండారు శ్రీనివాసరావు. 

ప్రభుత్వ వ్యతిరేకతతో చంద్రబాబు ఓడిపోతారని చెప్పలేం. గెలవడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో, ఓడిపోవడానికి అవకాశం ఉంది. ఐదేళ్ళు అవకాశం ఇస్తే.. చంద్రబాబు చెప్పినవి చేయలేదనే భావన ప్రజల్లో ఉందన్నారు. కేంద్రంతో కయ్యం, పోలవరం, అమరావతి అలాగే ఉన్నాయి. కేంద్రంతో యుద్ధం కుదరదు. కేంద్రం ఇవ్వాలి. కేంద్ర రాష్ట్రాల మధ్య సయోధ్య ఉండాలి. ఇంకో అవకాశం ఇద్దామని ఓట్లు వేసేవారు కొందరైతే, చంద్రబాబు ధోరణి నచ్చనివారు వ్యతిరేక ఓటు వేస్తారు. జనసేన వల్ల ఓట్లు చీలిపోతాయి. టీడీపీ-వైసీపీల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుందనేది వాస్తవం‘‘ అని  ‘న్యూస్ స్టింగ్’ కి తన అభిప్రాయం చెప్పారు భండారు శ్రీనివాసరావు. 

మోడీ హవా కొనసాగుతుందా?

ఇటు జాతీయ స్థాయిలో వెల్లడవుతున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ భండారు శ్రీనివాసరావు తన అభిప్రాయం వ్యక్తంచేశారు. ‘‘దేశంలో ఇప్పుడు మోడీ-యాంటీ మోడీ నడుస్తోందన్నారు. ఒక వ్యక్తిపట్ల పెంచుకున్న ద్వేషం ప్రస్తుత రాజకీయపరిణామాలకు అద్దం పడుతోంది. కొన్ని పార్టీలు మోడీని వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ-మోడీ అంటే అంగీకరిస్తారు. బీజేపీతో పేచీ లేదు. మోడీనే తాము వ్యతిరేకిస్తున్నామంటున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నా సరైన ప్రత్యామ్నాయం కావాలి. అప్పుడే ప్రజలు ఓటేస్తారు.

మోడీ మళ్ళీ రావడానికి కారణం ప్రతిపక్షాల అనైక్యత. ఎగ్జిట్ పోల్స్ నిజం కావాలని లేదు. మోడీ ఈ ఎగ్జిట్ పోల్స్ ని ప్రభావితం చేశారనే వాదన వినిపిస్తోంది. అయితే అది సత్యదూరం. కాంగ్రెస్ పార్టీకి ఎన్డీయేకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఫలితాలు అలాగే ఉంటాయేమో చూడాలి. ఆస్ట్రేలియా ఎగ్జిట్ పోల్స్ కొత్త ప్రభుత్వం వస్తుందని తేల్చాయి. తీరా ఫలితాలు వచ్చాక పాత ప్రభుత్వమే మళ్లీ అధికారం నిలుపుకుంది. ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకూ నిజం అవుతాయనేది ఇదొక ఉదాహరణ మాత్రమే. మోడీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు’’ అన్నారు  భండారు శ్రీనివాసరావు. 

ఎగ్జిట్ పోల్స్‌పై భండారు శ్రీనివాసరావు కామెంట్ వీడియో 

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

   39 minutes ago


ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

   an hour ago


మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

   an hour ago


గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

   2 hours ago


భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

   2 hours ago


ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

   2 hours ago


భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

   21 hours ago


రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

   a day ago


కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

   a day ago


లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

   24-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle