newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

ఎంపీ మిథున్‌రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం..!

25-12-201925-12-2019 14:03:37 IST
Updated On 26-12-2019 11:33:19 ISTUpdated On 26-12-20192019-12-25T08:33:37.363Z25-12-2019 2019-12-25T08:33:32.941Z - 2019-12-26T06:03:19.662Z - 26-12-2019

ఎంపీ మిథున్‌రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. కాగా, రాయ‌చోటి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి శంకుస్థాప‌న చేసిన సంగ‌తి తెలిసిందే. అనంత‌రం ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మిథున్‌రెడ్డి మాట్లాడారు. అభివృద్ధి ప‌రంగా వెనుక‌బ‌డిన నియోజ‌క‌వ‌ర్గాల లిస్టులో రాయ‌చోటిది మొద‌టి స్థాన‌మ‌ని, ఈ ప్రాంత ప్ర‌జ‌లు ఎక్క‌డికెళ్లినా మీకు నీళ్లు లేవు.., మీదొక వెనుక‌బ‌డిన ప్రాంతం.., మిమ్మ‌ల్ని ఎప్పుడూ క‌రువు వెంటాడుతుంటుందంటూ ఇత‌ర ప్రాంతాల ప్ర‌జ‌లు అంటుంటార‌ని మిథున్‌రెడ్డి గుర్తు చేశారు. ఈ ప‌రిస్థితి నియోజ‌క‌వ‌ర్గంలో అడుగ‌డుగునా దాపురించింద‌న్నారు.

ఇదే విష‌యాన్ని నాడు ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న వైఎస్ జ‌గ‌న్‌కు ఎన్నిక‌ల‌కు ముందు తెలియ‌జేశామ్. ఆ స‌మ‌యంలో జ‌గ‌న్ ఒకే ఒక్క మాట అన్నాడు. ఇక మీద రాయ‌చోటి వెనుక‌బ‌డిన నియోజ‌క‌వ‌ర్గం కాదు. మీ వెనుక నేనున్నాను.. మిమ్మ‌ల్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపించే బాధ్య‌త నాది. మీ స‌మ‌స్య‌ల‌న్నింటిని తీరుస్తాన‌ని ప్ర‌స్తుతం సీఎంగా ఉన్న జ‌గ‌న్ నాడు నాతో అన్నారు.

జ‌గ‌న్ అలా చెప్ప‌డంతో రాయ‌చోటి ప్ర‌జ‌ల గుండెల్లో కొండంత ధైర్యం వ‌చ్చింది. నేను ఉన్నాను.. నేను విన్నాను అంటూ జ‌గ‌న్ అన‌డంతో నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లంతా ఏం చేస్తాడోన‌ని అనుకున్నారు. కానీ, నేడు ఆరు నెల‌ల స‌మ‌యం తిర‌గ‌క ముందే వేల కోట్ల అభివృద్ధి రాయ‌చోటికి వ‌చ్చి చేరింది. ఆ క్రెడిట్ అంతా కూడా సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిదే.

రాయ‌చోటి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఎన్నో చెరువులు ఉన్నా.. గ‌త ప‌ది సంవ‌త్స‌రాలుగా ఒక్క‌టంటే.. ఒక్క‌ చెరువు నిండిన ప‌రిస్థితి లేదు. ఆఖ‌ర‌కు వెయ్యి అడుగుల బోరు వేసినా నీళ్లు రాని పరిస్థితి. అటువంటి క‌రువు ప్రాంత‌మైన రాయ‌చోటి నియోజ‌క‌వ‌ర్గానికి గాలేరు.. న‌గ‌రి నుంచి హంద్రీనీవాను అనుసంధానం చేస్తూ పైప్‌లైన్ ద్వారా నీటిని తీసుకొచ్చిన ఘ‌న‌త ఒక్క జ‌గ‌న్‌కే చెందుతుంద‌న్నారు.

అదేవిధంగా రాయ‌చోటి ప‌ట్ట‌ణంలో ప్ర‌భుత్వ వైద్య‌శాల‌, అండ‌ర్‌గ్రౌండ్ డ్రైనేజీ, పోలీసు స్టేష‌న్‌, డీఎస్పీ కార్యాల‌యం, సీసీ రోడ్లు, పంచాయ‌తీ రోడ్లు, ఇలా అనేక అభివృద్ధి ప‌నుల‌ను రాయ‌చోటి నియోజ‌క‌వ‌ర్గానికి సీఎం జ‌గన్ మంజూరు చేశార‌న్నారు. ప‌నుల‌ను వేగ‌వంతంగా ప్రారంభించేందుకు శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాల‌ను కూడా త్వ‌రిత‌గ‌తిన ముగించిన‌ట్టు మిథున్‌రెడ్డి తెలిపారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్ నేను ఉన్నాను.. నేను విన్నాను అంటే కేవ‌లం ఒక్క న‌వ‌ర‌త్నాల‌కే ప‌రిమితం కాద‌ని, ప్ర‌జ‌ల‌కు ఏ అవ‌స‌రం ఉన్నా తానున్నాన‌న్న‌ భ‌రోసాను క‌ల్పించిన ప‌రిస్థితి నేడు రాష్ట్రంలో నెల‌కొంద‌న్నారు. జ‌గ‌న్ చేప‌ట్టిన బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మంతో హంద్రీనీవా ద్వారా తంబ‌ళ్ల‌ప‌ల్లి బ్రాంచ్ కెనాల్‌, అడ‌విప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్‌లు ఈ రోజు జ‌ల‌క‌ళ‌తో ఉట్టిప‌డుతున్నాయ‌ని మిథున్‌రెడ్డి అన్నారు.

మ‌రీ ముఖ్యంగా నా జీవితంలో రాయ‌చోటి వంటి వెనుక‌బ‌డిన నియోజ‌క‌వ‌ర్గానికి రాజ‌కీయంగా ఏదో ఒక రోజు నీళ్లు తెస్తే చాల‌నుకున్నా.. నా జీవిత ఆశ‌యాన్ని సీఎం జ‌గ‌న్ నెర‌వేర్చారు. ఈ రోజు రాయ‌చోటికి నీళ్లు వ‌స్తున్నాయంటే చాలా ఆనందంగా ఉంది. రాయ‌చోటికి నీళ్లు ప్ర‌సాదించి మా జీవితాలు ధ‌న్య‌మ‌య్యేలా చేశారు అంటూ ఎంపీ మిథున్‌రెడ్డి సీఎం జ‌గ‌న్‌పై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు.

 

పారిశ్రామికీకరణపై సీఎం జగన్ మార్కు నిర్ణయం.. జగన్ కి ఆ లోటు తీరినట్టేనా…!!

పారిశ్రామికీకరణపై సీఎం జగన్ మార్కు నిర్ణయం.. జగన్ కి ఆ లోటు తీరినట్టేనా…!!

   an hour ago


‘పర్ఫెక్ట్’ స్కెచ్.. 16మంది ప్రాణాలు గాల్లోకి... శానిటైజర్ కంపెనీ కథాకమామీషు

‘పర్ఫెక్ట్’ స్కెచ్.. 16మంది ప్రాణాలు గాల్లోకి... శానిటైజర్ కంపెనీ కథాకమామీషు

   an hour ago


14 నెలల్లో మీరేం చేశారు? జగన్ సర్కార్‌‌పై బాబు ప్రశ్నాస్త్రాలు

14 నెలల్లో మీరేం చేశారు? జగన్ సర్కార్‌‌పై బాబు ప్రశ్నాస్త్రాలు

   2 hours ago


సచిన్ పైలట్ పయనం ఎటువైపు? స్వంత గూటికి చేరేనా?

సచిన్ పైలట్ పయనం ఎటువైపు? స్వంత గూటికి చేరేనా?

   2 hours ago


తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు

తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు

   2 hours ago


ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

   2 hours ago


హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

   3 hours ago


పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

   3 hours ago


విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

   4 hours ago


గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

   5 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle