newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

ఎంపీ జీవీఎల్ స్వపక్షమా?అధికారపక్షం ఏజెంటా?

01-01-202001-01-2020 13:39:35 IST
Updated On 01-01-2020 13:44:26 ISTUpdated On 01-01-20202020-01-01T08:09:35.991Z01-01-2020 2020-01-01T08:09:34.429Z - 2020-01-01T08:14:26.894Z - 01-01-2020

ఎంపీ జీవీఎల్ స్వపక్షమా?అధికారపక్షం ఏజెంటా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమరావతి రాజధానుల అంశం రచ్చరేపుతోంది. వైసీపీయేతర పక్షాలన్నీ ఈ ఆందోళనలకు తమవంతు తోడ్పాటునందిస్తూనే వున్నాయి. కానీ కేంద్రంలో అధికారంలో వుండి, ఏపీలో పాతుకపోవాలని చూస్తున్న బీజేపీలో మాత్రం భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. రాజధాని గ్రామాల్లో పర్యటించిన బీజేపీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి అమరావతి రైతులకు భరోసా ఇచ్చారు. కేంద్రం ఈ విషయంలో చూస్తూ ఊరుకోదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడి శంకుస్థాపన చేసిన అమరావతిని అంగుళం కదిలించినా బిజెపి చూస్తూ ఊరుకోదన్నారు.

ఉద్దండరాయుడి పాలెంలో పర్యటించిన సుజనా చౌదరి రైతుల నిరసనలకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బీజేపీ నేతల పర్యటనలకు, వాస్తవాలతో కూడిన పవర్ పాయింట్ ప్రజంటేషన్లకు మంచి మైలేజ్ వచ్చింది. అంతా బాగానే ఉందనకునే టైంలో పానకంలో పుడకలా, చెప్పులో రాయిలా, చెవిలో జోరిగలా యూపీకి చెందిన బీజేపీ రాజ్యసభ ఎంపీ గారు ఎంటరయ్యారు. బీజేపీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా ఆయన ప్రకటనలు చేశారు. 

ఆయన మాటలు బీజేపీలో భిన్నస్వరాలకు అద్దం పట్టాయి. రాజధాని వ్యవహారం రాష్ట్ర పరిధిలోని అంశమని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు.. నిన్న ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు.. సుజనా చౌదరి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని చెప్పారు.. అయితే, తాను కేంద్రంతో చర్చించే మాట్లాడానని సుజనా చౌదరి చెప్పగా.. తాను బీజేపీ అధికార ప్రతినిధిగా ఈ అంశంపై మాట్లాడుతున్నానని జీవీఎల్‌ అన్నారు. దీంతో సుజనా చౌదరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మిగిలిన నేతలు చేసిన ప్రయత్నాలకు గండికొట్టినట్టయింది. 

జీవీఎల్ తీరుపై రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయం చెందుతున్నారు. సోషల్ మీడియా సాక్షిగా జీవీఎల్ తీరుని తప్పుబడుతున్నారు. సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు కందుల రమేష్ జీవీఎల్ వ్యవహారశైలిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సుజనా ఇచ్చిన భరోసాతో అమరావతిలో బిజెపికి వచ్చిన గుడ్ విల్ ని మరసటి రోజే వచ్చి, ప్రెస్ మీట్ పెట్టి మరీ నీరుకార్చిన ఘనత జివిఎల్ గారిదంటూ.. Mission Accomplished! Sujana Proposes, GVL Disposes అంటూ ఒక్కముక్కలో తేల్చేశారు రమేష్ కందుల. 

Image may contain: one or more people and text

ఇటు రాజకీయ విశ్లేషకులు సువేరా  ‘‘శ్రీ జీవీఎల్ నరసింహారావు బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ, బీజేపీని అన్నిచోట్లా సర్వనాశనం చేసేవరకూ విశ్రమించనివీరుడిగా ఉన్నాడు. ఇతను పూర్తిగా బీజేపీకి శత్రుపక్షాల మనిషిగా ఉంటున్నాడు వ్యవహరిస్తున్నాడు. ఇతను ఆంధ్రాద్రోహి’’అంటూ మండిపడ్డారు.

Image may contain: text

ఏపీలో ఏం జరిగినా అంతా తన కనుసన్నల్లో జరగాలని జీవీఎల్ భావిస్తుంటారు. ఏపీ బీజేపీలో జీవీఎల్ లాంటి వారు వుంటే పార్టీ భవిష్యత్తుపై ఆశలు వదులుకోవచ్చంటున్నారు బీజేపీ నేతలు. (గమనిక: జీవీఎల్ ఏం మాట్లాడారో మహా న్యూస్ సౌజన్యంతో మీకు వీడియో క్లిప్ కూడా అందిస్తున్నాం)


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle