newssting
BITING NEWS :
*మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ*పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌...అరెస్ట్‌ అయిన వ్యక్తి ప్రశాంత్‌ గా గుర్తింపు* రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం.. జడ్జిమెంట్‌ కాపీ చూశాక తుది నిర్ణయం.. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది.. సడక్‌బంద్, రాస్తారోకోలు మాత్రం వాయిదా-అశ్వత్థామరెడ్డి*దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుంది-కోదండరాం*ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగించిన హైకోర్టు *హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి.. పరిధిదాటి ముందుకు వెళ్లలేం.. కార్మికశాఖ చూసుకుంటుంది.. 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని సూచిస్తాం-హైకోర్టు

ఎంపీ అవినాష్ రెడ్డిపై వైర‌ల్ అవుతున్న క‌థ‌నం..!

07-11-201907-11-2019 11:32:40 IST
Updated On 07-11-2019 14:43:52 ISTUpdated On 07-11-20192019-11-07T06:02:40.380Z07-11-2019 2019-11-07T06:02:34.690Z - 2019-11-07T09:13:52.342Z - 07-11-2019

ఎంపీ అవినాష్ రెడ్డిపై వైర‌ల్ అవుతున్న క‌థ‌నం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఈ ద‌ఫా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పులివెందుల శాస‌న స‌భ్యుడిగా భారీ మెజార్టీతో గెలుపొందిన సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన నాటి నుంచి ప్ర‌భుత్వ పాల‌న‌పై దృష్టిపెట్ట‌డంతో సొంత నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను క‌లుసుకునే అవ‌కాశం క‌ల‌గ‌డం లేదు. అయితే, ఆ కొర‌త లేకుండా జ‌గ‌న్ త‌మ్ముడు, క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి చూసుకుంటున్నారు.

సీఎం జ‌గ‌న్ నియోజ‌క‌వర్గం పులివెందుల‌లో అన్నీ తానై అవినాష్‌రెడ్డి చ‌క్క‌దిద్దుతున్నాడు. త‌న అన్న జ‌గ‌న్‌ నియోజ‌క‌వ‌ర్గానికి రావ‌డం లేద‌న్న భావ‌న ప్ర‌జ‌ల్లో రాకుండా అవినాష్‌రెడ్డి జాగ్ర‌త్త‌ప‌డుతున్నారు. అంతేకాకుండా సెకండ్ సీఎం స్థాయిలో అవినాష్‌రెడ్డి పాపులారిటీ కూడా సంపాదించారు.

దీంతో, త‌న నియోజ‌క‌వర్గ ప్ర‌జ‌లే కాకుండా రాష్ట్ర‌స్థాయిలో ఉన్న నేత‌లు సైతం అవినాష్‌రెడ్డిని క‌లిస్తే ప‌నైపోతుంద‌ని అనుకుంటున్నారు. జ‌గ‌న్ పాల‌న‌తో బిజీగా ఉండ‌టంతో చాలా వ‌ర‌కు కేడ‌ర్‌ను క‌ల‌వ‌లేక‌పోతున్నారు. దీంతో ఆయ‌న స్థానంలో అవినాష్‌రెడ్డి త‌న‌వెంట ఉన్న కార్య‌క‌ర్త‌లకు కావాల్సిన‌ ప‌నుల‌ను చ‌క్క‌బెడుతున్నార‌ని క‌డ‌ప పొలిటిక‌ల్ రింగ్‌లో వినిపిస్తోంది.

ఎవ‌రు చెప్పినా ప‌నులు అవుతాయో..? లేదో..? కానీ.. అవినాష్‌రెడ్డి నుంచి ఫోన్ వ‌చ్చిందంటే అధికారులు ఆఘ‌మేఘాల మీద ప‌నుల‌ను పూర్తి చేస్తున్నారు. దీంతో అందుబాటులో లేని జ‌గ‌న్‌ను ఇబ్బందిపెట్టడంకంటే అవినాష్‌తో అన్ని ప‌నుల‌ను చ‌క్క‌బెట్టుకుంటున్నారు.

రాజ‌శేఖ‌ర్‌రెడ్డి సీఎంగా ఉన్న‌ప్పుడు ఆయ‌న త‌మ్ముడు వివేకానంద‌రెడ్డి నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌లు మొత్తం చూసుకునేవారు. ఆయ‌న కూడా అన్న‌కు అండ‌గా నిలిచి ప్ర‌జ‌ల‌కు, అనుచ‌రుల‌కు కావాల్సిన ప‌నులు చేసిపెట్టేవారు. దీంతో అప్పుడు కూడా తమ నేత అందుబాటులో లేడ‌న్న భావ‌న ప్ర‌జ‌ల్లో క‌ల‌గ‌లేదు. ఇప్పుడు జ‌గ‌న్‌కు చేదోడుగా ఆ పాత్ర‌ను అవినాష్‌రెడ్డి పోషిస్తున్నాడ‌ని పులివెందుల వాసులు అనుకుంటున్నారు. మ‌రి అవినాష్‌రెడ్డి అన్న న‌మ్మ‌కాన్ని ఎంత‌కాలం నిల‌బెట్టుకుంటారోన‌ని ఆసక్తిగా చ‌ర్చించుకుంటున్నారు. 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle