newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

ఎంపీలపై జగన్ ఆంక్షలు.. అసహనమా? అనుమానమా?

20-11-201920-11-2019 17:01:31 IST
2019-11-20T11:31:31.304Z20-11-2019 2019-11-20T11:31:24.782Z - - 15-08-2020

ఎంపీలపై జగన్ ఆంక్షలు.. అసహనమా? అనుమానమా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ ఎంపీలపై ఆంక్షలు విధించారట. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాలకు దేశంలోని అన్ని రాష్ట్రాల, అన్ని పార్టీల ఎంపీల మాదిరే వైసీపీ ఎంపీలు కూడా పార్లమెంటుకు హాజరయ్యారు. అయితే వైసీపీ ఎంపీలు ఎవరూ ప్రధాని నరేంద్ర మోడీతో కానీ కేంద్రమంత్రులతో కానీ సమావేశాలు, చర్చలు మాత్రం పెట్టవద్దని ఆదేశించారట.

వైసీపీకి ఉన్న 23 మంది ఎంపీలలో మిదున్ రెడ్డి మినహా మిగతా వాళ్ళెవరూ కూడా తమ సొంత నియోజకవర్గాల గురించి కానీ రాష్ట్రంలో సమస్యల గురించి కానీ ఎక్కడా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు పెట్టవద్దని, కనీసం కేంద్ర మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్లవద్దని ఆంక్షలు విధించారట. ఏదైనా ఉంటే పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి లోక్ సభ నేత మిదున్ రెడ్డిలకు మాత్రమే తెలియజేయాలని వారి అనుమతితోనే ముందుకెళ్లాలన్నారట.

దేశంలో ఏ ఎంపీకైనా తమ నియోజకవర్గంలో సమస్యలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కానీ వైసీపీ మాత్రం తమ ఎంపీలను కట్టడి చేస్తుంది. పైగా కాదు కూడదు అని గీత దాటితే వేటు పడడం ఖాయమని, షోకాజ్ నోటీసులను సైతం జారీచేసేందుకు వెనకాడబోమని అధిష్టానం తేల్చిచెప్పేసిందట.

సీఎం ఆంక్షలతో ఎంపీలలో తీవ్ర అసహనం వ్యక్తమవుతోందని తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇస్తున్న సీఎం ఎంపీలను పట్టించుకోవడం లేదని, ఇప్పుడు ఢిల్లీలో కూడా తమపై ఆంక్షలు విధించడం తమను తీవ్రంగా అవమానించడమేనని వాపోతున్నారట. కనీసం ప్రోటోకాల్ ప్రకారం వచ్చే తమ హక్కులపై కూడా ఇలా పెత్తనం చేయడం సమంజసం కాదని సీఎంకి తెలియజేయాలని ఎంపీలు విజయసాయిని కోరారట.

అయితే అసలు జగన్ ఎంపీలను కట్టడి చేయడం ఎందుకు అనే దాని మీద రాజకీయ వర్గాలలో రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఎంపీలు మంత్రులను లేదా ప్రధానిని కలిస్తే రాష్ట్రంలో పరిస్థితిలు, వ్యతిరేక విధానాలపై ఆరాతీసే అవకాశం ఉందని, సీఎంపై కేసులు, విచారణ తదితర అంశాలపై రాష్ట్రంలో పరిస్థితిలపై కూడా చర్చలు పెడితే తమకి కేంద్రం నుండి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితిలు రావచ్చని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని కొందరి అభిప్రాయం.

ఇక రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలతో ప్రజలలో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో తమ ఎంపీలు బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదని సీఎం ఆందోళనలో ఉన్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అంటే రాష్ట్రంలో ప్రతిపక్షాలకు చేరికలతో సమాధానం చెబుతున్న జగన్ కేంద్రంలో ఆ పరిస్థితి తనకు రాకూడదనే ఎంపీలపై ఆంక్షాలు విధించారని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ నిర్ణయంతో ఎంపీలలో మాత్రం తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle