newssting
BITING NEWS :
*కాకినాడలో ముగిసిన జనసేన రైతు సౌభాగ్యదీక్ష*మహిళలకు అండగా చరిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం *ఆఖరి టీ 20లో ఉతికి ఆరేసిన టీమిండియా...సిరీస్ కైవసం *తెలంగాణ కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు..దమ్ముగూడంలో గోదావరిపై బ్యారేజ్ నిర్మించాలని నిర్ణయం*Ap రాజధాని భూ సమీకరణ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ కేబినెట్..అసైన్డ్ భూములని నిబంధనలకు విరుద్దంగా కొనుగోలు చేసి ల్యాండ్ పూలింగుకు ఇచ్చిన వ్యక్తుల రిటర్నబుల్ ప్లాట్లను రద్దు చేస్తూ నిర్ణయం *125 మంది సభ్యుల మద్దతుతో పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన పెద్దల సభ*వర్మ సినిమాకు గ్రీన్ సిగ్నల్..అమ్మరాజ్యంలో కడప బిడ్డలు మూవీ ఇవాళ విడుదల *పీఎస్ఎల్వీ సి48 రీశాట్, 2 బీఆర్-1 ప్రయోగం విజయవంతం *గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ప్రత్యేక సభ్యుడిగా గుర్తిస్తున్నట్టు అసెంబ్లీలో తెలిపిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం

ఎంపీడీవో సరళపై దాడి కేసుని నీరుగారుస్తారా?

09-10-201909-10-2019 15:14:06 IST
2019-10-09T09:44:06.108Z09-10-2019 2019-10-09T09:44:04.258Z - - 13-12-2019

ఎంపీడీవో సరళపై దాడి కేసుని నీరుగారుస్తారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ఇటు టీడీపీ, అటు వైసీపీ నేతల మధ్య సోషల్ మీడియా వార్ జోరందుకుంది. ఇది చాలదన్నట్టుగా వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దాడి చేసిన కేసు రాజుకుంటోంది.

ఈ కేసుకి సంబంధించి అధికార పార్టీ ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసినా.. ఈ కేసుని ప్రభుత్వం కావాలనే నీరుగారుస్తోందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఘాటుగా విమర్శించారు.  ఎంపీడీవో పెట్టిన క్రిమినల్‌ కేసులను నీరుగార్చడం ద్వారా వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి సందేశమిస్తోందని ఆయన ఒక ప్రకటనలో నిలదీశారు. 

‘‘మా శాసనసభ్యులు దాడులు చేస్తారు.. ప్రజలు భరించాలని చెబుతున్నారా..?’’’ అని పవన్ ప్రశ్నించారు. ప్రజాశ్రేయస్సు కోసం సమస్యలపై రోడ్డెక్కి ప్రతిపక్షాలు నిరసన గళం విప్పితే నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్లు, 307 కింద హత్యాయత్నం కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారని పవన్ విమర్శించారు. ప్రభుత్వం తీరుపై పవన్ మండిపడ్డారు.

బాధ్యతాయుతమైన మహిళా ఉద్యోగిపై దాడి చేసిన ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి బెయిలు సులువుగా ఇచ్చే సెక్షన్లను ఎందుకు నమోదు చేశారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ముసునూరు ఎంపీడీవో వనజాక్షిపై అప్పటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దాడి, ఇప్పుడు సరళ ఇంటిపై కోటంరెడ్డి దాడి ఒకేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle