newssting
BITING NEWS :
* గోదావరిలో పర్యాటక బోటు మునక పలువురు గల్లంతు. *వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలకెన్నో ఇబ్బందులు.. ఇక పోరాటమే:పవన్ కళ్యాణ్ *.హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ళ ...తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ అంత్యక్రియలు *బద్వేలులో భారీ అగ్నిప్రమాదం *హుజూర్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌ ...కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతి *మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించారు ..కేసీఆర్ పై భట్టి విమర్శలు *నేడు భారత్‌–దక్షిణాఫ్రికా తొలి టి20

ఎందుకీ దుష్ప్రచారం? పైడికొండల ఫైర్

28-08-201928-08-2019 18:12:28 IST
2019-08-28T12:42:28.216Z28-08-2019 2019-08-28T12:42:20.258Z - - 15-09-2019

ఎందుకీ దుష్ప్రచారం? పైడికొండల ఫైర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో రాజధాని గొడవ ఒకవైపు జరుగుతుంటే.. ఆ పార్టీనేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాత్రం తనపై తప్పుడు ప్రచారం చేయడంపై మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారంపై విలేకరుల సమావేశంలో తీవ్రంగా స్పందించారు పైడికొండల మాణిక్యాలరావు.

నిన్న సోషల్ మీడియాలో శ్రద్ధాంజలని, ప్రమాదంలో మృతి అని తనపై దుష్ప్రచారంతో పాటుగా స్క్రోలింగ్ వచ్చినట్లుగా మార్ఫింగ్ చేసిన వ్యక్తులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో, ఇప్పుడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి జగన్ హిందూ దేవాలయాల భూములు, నిధులు వారి అనుచర గణానికి పంచిపెట్టాలని చూస్తున్నారన్నారు.తిరుమల విషయంలో గందరగోళం నెలకొందని, భక్తుల మనోభిప్రాయాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. 

ప్రభుత్వ తప్పిదాలు తాను లెవనెత్తితే తన మద్దతుదారులతో వైసీపీ నేతలు సోషల్ మీడియాలో తనపై అభూతకల్పనలతో కూడిన తప్పుడు ప్రచారం చేయడం దారుణమన్నారు. హిందువుల ఆరాధ్యదైవంగా భావిస్తున్న తిరుమల తిరుపతిలో అన్యమత ప్రచారం జరుగుతుంటే ప్రభుత్వం కళ్ళుమూసుకుని ఉందన్నారు.

దేవాలయ భూములు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన నిధులు కావు అవి ప్రజలు, భక్తుల నుంచి వచ్చినవి మాత్రమే వాటిపై ప్రభుత్వాలకు హక్కు లేదన్నారు. తనకు ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ బెదిరింపులు వచ్చాయన్నారు.

పలు రకాలుగా తన ఫోన్ నంబర్ కు పలువురు వ్యక్తులు ఫోన్లో బెదిరింపులకు పాల్పడుతున్నారని వారిపై తాను పోలీసు ఉన్నతాధికారులు ఫిర్యాదుచేస్తానన్నారు. అమరావతి నిర్మాణం విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో ప్రజల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle