newssting
BITING NEWS :
*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి* కర్నాటక సీఎం యడియూరప్ప కేబినెట్ విస్తరణ..17మందికి ఛాన్స్ *పంచాయతీరాజ్‌లో మరో రూ.300 కోట్ల పనులు రద్దు*పోలవరం రీ టెండరింగ్ పై హైకోర్టులో నవయుగ పిటిషన్ * కృష్ణా నదీ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన* చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2*రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ *అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స *పన్ను సంస్కరణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

ఎంతిచ్చినా తీసుకోండి- ఓటు మాత్రం ... !

11-02-201911-02-2019 19:05:37 IST
Updated On 11-02-2019 19:05:35 ISTUpdated On 11-02-20192019-02-11T13:35:37.232Z11-02-2019 2019-02-11T13:35:25.086Z - 2019-02-11T13:35:35.658Z - 11-02-2019

ఎంతిచ్చినా తీసుకోండి- ఓటు మాత్రం ...  !
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఓట్ల పండగ కోసం జనం ఆతృతగా ఎదురు చూస్తుంటారు. రాజకీయ పార్టీలిచ్చే వరాలు,హామీలతో బాటు సీజన్లో దక్కే మందు, డబ్బు వాళ్లకు అదనపు అట్రాక్షన్. ఇక చివరి మూడు రోజులూ ముఖ్యంగా ఎన్నికల ముందు రోజు పంచే నోట్ల కోసం ఎదురుచూపులు మామూలే ! ఈ విషయంలో అన్ని పార్టీలదీ ఒకటే దారి.. ఓటుకు ఇంత అని ముట్టచెప్పడమే !  

తాజాగా అనంతపురంలో తన శంఖారావాన్ని పూరిస్తున్న జగన్ అక్కడ మాట్లాడుతూ "ఇతర పార్టీలు ఎంత డబ్బిచ్చినా తీసుకోండి...కానీ ఓటు మాత్రం వైకాపాకే వెయ్యండి " అంటూ చెప్పారు. తెలుగుదేశం అధ్యక్షుడు ప్రత్యేక హోదా గురించి  నాలుగేళ్లు ఏమీ మాట్లాడకుండా ఇప్పుడు  దీక్షలు చేస్తున్నారంటూ విమర్శించారు. 59 లక్షల దొంగ ఓట్లను నమోదు చేయించారంటూ జగన్ ఆరోపించారు. 

గతంలో జనసేన పార్టీ అధినేత కూడా ఇటువంటి ప్రకటనే చేశారు. డబ్బు తీసుకుని ఓటు మాత్రం మాకే వేయాలంటూ పిలుపు నిచ్చారు. స్థానికంగా అభ్యర్థులు ఈ మాటల్ని పార్టీ కారకర్తలు ఓటర్లతో   ప్రైవేటు  సంభాషణల్లో ఇటువంటి మాటలు చెప్పేవారు.  గత ఎన్నికలనుంచి ఇవన్నీ పార్టీ నాయకులు బహిరంగంగా చెప్పడం మొదలయింది.

నిజానికి ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఓటుకు డబ్బు తీసుకోవడం నేరం. ఇచ్చినా నేరమే ! దీన్ని విచారించదగిన నేరంగా పరిగణించాలని ఎన్నికల కమిషన్ ఎప్పుడో ప్రకటించింది. ఈ సిఫార్సుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం కూడా తెలిపింది. అయితే   ఈ విషయాన్ని నేతలు బహిరంగంగా సమర్ధించడం ఆశ్చర్యం. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle