newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

ఉసూరుమనిపించిన సీఎం జగన్ విశాఖ యాత్ర..!

30-12-201930-12-2019 09:42:33 IST
2019-12-30T04:12:33.269Z30-12-2019 2019-12-30T04:12:31.181Z - - 15-08-2020

ఉసూరుమనిపించిన సీఎం జగన్ విశాఖ యాత్ర..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం విశాఖలో పర్యటించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు ఆర్‌కే బీచ్‌లో నిర్వహించనున్న విశాఖ ఉత్సవ్ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గాను ప్రభుత్వం భారీగానే ఖర్చు చేసింది. దాదాపు నెల రోజుల ముందు నుండే ఉత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం నెంబర్ 2గా పిలవబడుతున్న విజయసాయి రెడ్డి ఈ కార్యక్రమ ఏర్పాట్ల వ్యవహారాలను చూసుకున్నారు.

పెట్టిన ఖర్చుకు తగ్గట్లే స్థానికత ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సీఎం కూడా ఉత్సవాన్ని ప్రారంభించి రెండు ముక్కలు ఆ కార్యక్రమంతో పాటు అయన తెచ్చిన నవరత్నాల గురించి మాట్లాడారు. కానీ అయన తెచ్చే మూడు రాజధానుల గురించి కానీ విశాఖకు వరంగా ఇచ్చే రాజధాని పెద్ద ముక్క గురించి కానీ నోరు విప్పలేదు. నిజానికి సీఎం విశాఖ యాత్రపై భారీ అటెన్షన్ నెలకొంది. అయన ఏం మాట్లాడనున్నారో అని రాష్ట్రమంతా ఎదురు చూసింది.

ఇంతకు ముందే విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర వాళ్ళని బాగా ట్యూన్ చేసి పెట్టారు. ఆ ప్రాంతం మీద ప్రేమతోనే సీఎం విశాఖకు రాజధాని తెస్తున్నారని ఘనంగా చెప్పుకున్నారు. ఇక సీఎం ఆ ప్రాంతానికి వస్తుండడంతో విశాఖ నగరంలో భారీ జోష్ కనిపిస్తుందని అంచనాలు వేశారు. ఆ వేదికగా సీఎం ఏదో ప్రకటన చేయనున్నారని అంచనాలు వచ్చాయి. కానీ అవేమీ నిన్న యాత్రలో కనిపించలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రభుత్వం దేనికోసం ఖర్చు చేసిందో అంతవరకే ఘనంగా జరిగింది.

అంతకుమించి రాజధాని ప్రకటించారని ప్రజలు జనసందోహంగా వచ్చి సీఎంకి కృతజ్ఞతలు కనిపించలేదు. తమని ఆదుకున్న మహానుభావుడిని చూడాలన్న ఆత్రాలు లేవు. ఉత్సవంలో భాగంగా ప్రభుత్వ ఖర్చులతో చేసిన మానవహారంలో సీఎంకి ఘనస్వాగతం లభించినా దారి పొడవునా నీరాజనాలు దక్కలేదు. ఉత్సవం కోసం చేసిన జనసమీకరణ తప్ప కనీవినీ ఎరుగని స్వాగతాలు కనబడకపోవడం వైసీపీ వర్గాలను కూడా ఆశ్చర్యపరిచినట్లుగా తెలుస్తుంది.

అయితే స్థానిక నేతలు, ఎమ్మెల్యేలు సీఎంపై చేసిన డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ఆకట్టుకోగా అందుకు సీఎం కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఆర్కే బీచ్ లో స్థానిక నేతల జనసమీకరణ కూడా స్పష్టంగా కనిపించగా బయట నగరంలో ఎలాంటి అత్యుత్సాహం కనిపించలేదు. సీఎం విశాఖ వేదికగా రాజధాని అంశంపై కూడా విశాఖకు రాజధాని వలన వచ్చే ఉపయోగాలపై కానీ నోరు విప్పలేదు.

సీఎం విశాఖ పర్యటనకు ముందు ఆ పార్టీ నేతలు భారీగా హైప్ తెచ్చారు. ఎప్పటికప్పుడు రాజధాని విషయంలో ప్రకటనలు చేస్తూ వచ్చారు. దీంతో సీఎం విశాఖ వేదిక మీద ఏం చెప్పబోతున్నారో అనే ఆసక్తి సహజంగానే మొదలైంది. కానీ కారణాలేమైనా సీఎం నోరు మెదపలేదు. కనీసం తీపి కబురు చెప్తారని ఆశించిన ఉత్తరాంధ్ర వాసులను కూడా ఉసూరుమనిపించారని కామెంట్లు వస్తున్నాయి.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle