newssting
BITING NEWS :
*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా. 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపు *అమరావతిలో హైటెన్షన్.. అసెంబ్లీ ముట్టడికి టీడీపీ ప్లాన్*చంద్రబాబు ప్రజలకు వాస్తవాలు చెప్పడం లేదు. రాజధాని రైతులకు జగన్ కౌలు కూడా ఇచ్చారు. సామాన్యులకు రాజధానితో పనేముంది? అమరావతిలో పోలీసులకు చంద్రబాబు నీళ్లు కూడా ఇవ్వకుండా చేస్తున్నారు-హోంశాఖ మంత్రి సుచరిత *ఇవాళ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం *బెజవాడలో నేతలకు పోలీసుల నోటీసులు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు బోండా ఉమ, ఎంపీ కేశినేని నానికి నోటీసులు. ఎమ్మెల్సీలు బుద్దా, రాజేంద్రప్రసాద్, తంగిరాల సౌమ్య సహా పలువురు టీడీపీ నేతలకు నోటీసులు. వామపక్షాలు, జేఏసి నేతలకు కూడా పోలీసుల నోటీసులు *రేపటి కేబినెట్, అసెంబ్లీకి రహస్యంగా సిద్ధమవుతోన్న నోట్స్, బిల్లులు. గుంభనంగా సాగుతున్న ప్రభుత్వ చర్యలు*తెలంగాణలో ఊపందుకున్న మునిసిపల్ పోరు *తెరాస, కాంగ్రెస్ పార్టీలు ఒకేగూటి పక్షులు. తెరాస కు ఓటు వేస్తె ఎంఐఎం కు ఓటు వేసినట్టే. కేంద్రం ఇచ్చిన నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి. కేంద్రం నిధులపై కేటీఆర్ చర్చకు సిద్ధమా ? - లక్ష్మణ్ *విశాఖ: ఓట్ల కోసం గాజువాక.. రాజకీయాలకు అమరావతి కావాల్సి వచ్చిందా? గాజువాక ప్రజలకు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలి-మంత్రి అవంతి శ్రీనివాస్

ఉల్లి ధరల టీడీపీ.. హెరిటేజీతో వైసీపీ ఎదురుదాడి

10-12-201910-12-2019 14:55:26 IST
Updated On 11-12-2019 09:56:53 ISTUpdated On 11-12-20192019-12-10T09:25:26.802Z10-12-2019 2019-12-10T09:25:25.158Z - 2019-12-11T04:26:53.064Z - 11-12-2019

ఉల్లి ధరల టీడీపీ.. హెరిటేజీతో వైసీపీ ఎదురుదాడి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉల్లి ధరలు ఇప్పుడు దేశాన్ని ఊపేస్తున్నాయి. రెండు సెంచరీలకు చేరువైన ఉల్లిఘాటుకి ఇప్పుడు కేంద్రం, రాష్ట్రాలు అన్న తేడా లేకుండా ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాయి. ఇదే అదనుగా ఎక్కడిక్కడ ప్రతిపక్షాలు ప్రభుత్వాలను ఏకిపారేస్తున్నాయి. ఇది మన తెలుగు రాష్ట్రాలలో కూడా మామూలుగా మారిపోయింది. ఏపీలో అయితే ప్రతిపక్షమైన టీడీపీ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే ప్రభుత్వంపై పోరాటం మొదలుపెట్టింది.

తొలి రోజే టీడీపీ సభ్యులు ఉల్లి దండలను మెడలో వేసుకుని అసెంబ్లీలో అడుగు పెట్టగా.. సభలో నిత్యావసర వస్తువుల ధరల పెంపుపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చి చర్చకు పట్టుబట్టారు. చర్చ అయితే పెట్టలేదు కానీ సభలో ముఖ్యమంత్రి స్పందించి చెప్పాల్సిన నాలుగు ముక్కలు చెప్పారు. ఇక బయట కూడా ఒకరిద్దరు మంత్రులు టీడీపీ లేవనెత్తిన అంశంపై సమాధానం ఇచ్చారు.

అయితే వాళ్ళు చెప్పింది సమాధానం అనేబదులు ఎదురుదాడి అని చెప్పుకోవాలి. ఎందుకంటే టీడీపీ సభ్యులు అడిగింది నిత్యావసర ధరలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి చర్చ. దానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించాల్సి ఉంది. నిజానికి ఏపీ ప్రభుత్వం ఆ దిశగా కొన్ని చర్యలు చేపడుతుంది. సబ్సిడీలో ఉల్లిపాయల విక్రయం జరుపుతుంది. కానీ అవేమీ సామాన్య ప్రజలకు చేరడం లేదు.

ప్రభుత్వం విక్రయించే కొద్దిపాటి సరుకు దగ్గర కూడా పైరవీలు జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తుండగా ఈమధ్యనే ఉల్లి కోసం క్యూలో నిలబడి ఓ వృద్ధుడు ప్రాణాలను కోల్పోయిన ఘటన కూడా ఏపీలోనే చోటు చేసుకుంది. వీటన్నిటికీ ప్రభుత్వం నుండి సమాధానం రావాల్సి ఉండగా మంత్రులు, వైసీపీ నేతలు మాత్రం సూటిగా సమాధానం చెప్పకుండా హెరిటేజ్ అంశంతో ఎదురుదాడికి దిగారు.

చంద్రబాబుకు సంబంధించిన హెరిటేజ్‌ షాపులో కేజీ ఉల్లి రూ.200లకు అమ్ముతున్నారని విమర్శించిన సీఎం జగన్‌ చంద్రబాబు మళ్ళీ సభకు వచ్చి పేపర్లు పట్టుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని వెటకారంగా మాట్లాడారు. ఇక మంత్రి మోపిదేవి అయితే సభ తర్వాత ప్రెస్‌మీట్ పెట్టి మరీ రెచ్చిపోయారు. హెరిటేజ్‌లో రూ. 130కి కేజీ ఉల్లి ‌అమ్మే చంద్రబాబు ఎలా మాట్లాడుతున్నారన్నారు.

నిజంగా ప్రజలపై చంద్రబాబు నాయుడుకు అంత ప్రేమ ఉంటే హెరిటేజ్ లో పాతిక రూపాయలకే ఇవ్వవచ్చు కదా అని వైసీపీ నేతల మాటల అర్ధంగా కనిపించింది. అయితే టీడీపీ నేతలు అడిగింది ప్రభుత్వం నిత్యావసర ధరలపై తీసుకుంటున్న చర్యలు గురించి అయితే తిరిగి మీరు సబ్సిడీకి ఇవ్వండని ఎదురుదాడిగానే కనిపించింది. ప్రజలకు చేయాల్సింది ప్రభుత్వం కనుక ప్రభుత్వాలనే డిమాండ్ చేస్తారు.

చంద్రబాబు స్థాపించి డెవలప్ చేసిన రిటైల్స్ సంస్థ హెరిటేజ్ కూడా ఇప్పుడు చంద్రబాబు కుటుంబానిది కాదు. ఎప్పుడో మూడేళ్ళ క్రితమే బిగ్ బజార్, బ్రాండ్ ఫ్యాక్టరీ కంపెనీలకు చెందిన కిషోర్ బియానీ 'ప్యూచర్ రిటైల్' అనే కంపెనీకి అమ్మేశారు. ఇది సీఎంతో సహా అందరికీ తెలిసిందే. కానీ దాడికి మాత్రం హెరిటేజ్ ఉపయోగించుకుంటున్నారు.

ఒకవేళ హెరిటేజ్ చంద్రబాబుదే అయినా సబ్సిడీకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అన్న ప్రశ్నలు న్యాయమే అనిపిస్తుంది. మొన్న ఆ మధ్య ఏపీలో కరెంట్ కొరత ఉన్నప్పుడు సీఎం జగన్ ఏమైనా కర్ణాటకలో ఆయన కంపెనీల నుండి కరెంట్ తెచ్చారా? లేక ఆయన సాక్షి పేపర్ ఏమైనా ఫ్రీగా ఇస్తున్నారా? ప్రజలను పిచ్చోళ్లను చేయడం కాకపొతే!!


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle