newssting
BITING NEWS :
*కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం * విశాఖ భూ కుంభకోణంపై సిట్‌ ఏర్పాటు * ఆర్టీసీ జేఏసీ సమావేశం.*ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ.. కోర్టుకు నివేదిక సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం*హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం...ప్రియురాలిని భవనం పైనుంచి కిందకు నెట్టి చంపిన ప్రియుడు*కేబినెట్ సమావేశాల నిర్వాహణలో సీఎం జగన్ కీలక నిర్ణయం..ఇకపై నెలలో రెండు సార్లు మంత్రి వర్గ సమావేశం *ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై గవర్నర్ తమిళిసై ఆరా...మంత్రి పువ్వాడ అజయ్ తో ఫోన్‌ లో మాట్లాడిన గవర్నర్ *హూజూర్‌నగర్‌లో భారీ వర్షం.. మార్గ మధ్యలో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం.. కేసీఆర్ టూర్ రద్దు

ఉమ్మడి భారం మోసేదెవరు? కేసీఆర్ ‘రివర్స్ టెండరింగ్’పై ఏపీలో చర్చ!

10-07-201910-07-2019 14:50:14 IST
2019-07-10T09:20:14.810Z10-07-2019 2019-07-10T09:20:13.368Z - - 19-10-2019

ఉమ్మడి భారం మోసేదెవరు? కేసీఆర్ ‘రివర్స్ టెండరింగ్’పై ఏపీలో చర్చ!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేసీఆర్ ప్రతిపాదిత ‘నదుల అనుసంధానం’ అంత తేలికగా సాకారమయ్యే ప్రాజెక్టు కాదని ఉభయ రాష్ట్రాల నీటిపారుదల ఉన్నతాధికారుల సంయుక్త సమావేశంలో జరిగిన చర్చలను బట్టి తెలుస్తోంది. రెండు వేర్వేరు రాష్ట్రాల భూభాగాలలో చేపట్టాల్సిన ఈ భారీ ప్రాజెక్టు వ్యయమే రూ.లక్షన్నర కోట్లుగా అంచనా వేస్తున్నట్టు అధికారులు తేల్చారు. ఇంత భారీ వ్యయంతో కూడిన ప్రాజెక్టును చేపట్టాలనుకోవడం రెండు తెలుగు రాష్ట్రాల స్నేహ సంబంధాల దృష్ట్యా సమంజసమే అనుకున్నా దీని వ్యయాన్ని ఎవరు భరిస్తారన్నదే ప్రస్తుతానికి కొరుకుడు పడని ప్రశ్న.

ఉమ్మడి ప్రాజెక్టు కాబట్టి రెండు రాష్ట్రాలూ చెరి సగం ప్రాజెక్టు వ్యయాన్ని భరిస్తాయని ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చినా, పొరుగు రాష్ట్ర ప్రయోజనాల కోసం సొంత రాష్ట్రంలో భూసేకరణ, కొత్తగా రిజర్వాయర్ నిర్మాణాలు చేపట్టడం ఏపీకి తలకు మించిన భారం కానున్నదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

దానికితోడు ప్రాథమిక చర్చల్లోనే తెలంగాణా అధికారులు ఏపీ అధికారులు ప్రతిపాదించిన ఆప్షన్లను తిరస్కరించడం అసలీ ప్రాజెక్టు ఎంతవరకు ముందుకు వెళ్తుందనే సందేహాన్ని లేవనెత్తుతోంది. తమ భూభాగంలో భూసేకరణ చేపట్టాల్సి వస్తుందన్న ఆలోచనతో ఏపీ అధికారులు ప్రతిపాదించిన ఆప్షన్లను తెలంగాణా నీటిపారుదల అధికారులు తిరస్కరించినట్టు సమాచారం.  

గరిష్ఠంగా 400 టీఎంసీలు, కనిష్ఠస్థాయిలో 300 టీఎంసీలు చొప్పున గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌లో ఉన్న ప్రాజెక్టులకు మళ్లించాలని ఉభయ రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఒక అవగాహనకు వచ్చారు. రెండు ప్రభుత్వాధినేతల మధ్య జరిగిన తొలివిడత భేటీలో చేసిన సూచనల మేరకు ఉభయ రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు కొద్దిరోజులుగా చర్చలు జరిపి కొన్ని ప్రతిపాదనలు రూపొందించారు. ఉమ్మడిగా జరిగిన సమావేశంలో తమ ప్రతిపాదనలను తెలియపరచి పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నారు. 

పోలవరం నుంచి నాగార్జున సాగర్ ద్వారా శ్రీశైలం వరకు, అలాగే, దుమ్ముగూడెం నుంచి నాగార్జున సాగర్ వరకు, తుపాకులగూడెం నుంచి శ్రీశైలం వరకు నీటిని మళ్లించవచ్చునని ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అధికారుల ప్రతిపాదన. ఇది విన్న తెలంగాణా జలవనరుల శాఖ ఉన్నతాధికారులు దుమ్ముగూడెం నుంచి నాగార్జునసాగర్ చివరి భూముల వరకు నీటిని మళ్లించాలన్న ఆలోచన సరైనది  కాదని తేల్చారు.

రెండు కాలువలు తెలంగాణాలోనే నిర్మించాలంటే భూ సేకరణ, ఇతర సమస్యలు తమకు భారం అవుతాయన్నదే వారి అభ్యంతరం. అంతేగాక, రాంపూర్ దగ్గర బ్యారేజీ నిర్మిస్తే తుపాకులగూడెం ప్రాంతం ముంపునకు గురవుతుందని వారు అడ్డు చెప్పారు. తమకు కష్టం అయ్యే ఏపీ ఇంజనీర్ల ప్రతిపాదనను ఆదిలోనే వారు తిరస్కరించారు.

 రాంపూర్ నుంచి శ్రీశైలానికి, అలాగే, పోలవరం నుంచి వైకుంఠపురం రిజర్వాయర్ ద్వారా పులిచింతల, నాగార్జునసాగర్ వరకు నీటిని మళ్లించే ప్రతిపాదనను తెలంగాణా జలవనరుల శాఖ అధికారులు ఏపీ అధికారుల ముందుంచారు.

అయితే, దీనివల్ల తమ భూభాగంలో ఉన్న పోలవరం కాలువను వెడల్పు చేయాల్సివస్తుందని, దానికి మళ్లీ భూసేకరణ జరపాల్సివస్తుందని ఏపీ అధికారులు స్పష్టంచేశారు. అలాగే, వైకుంఠపురం రిజర్వాయర్ నిర్మాణం చేపట్టడం కూడా ఇప్పుడున్న పరిస్థితులలో తమకు భారం కావచ్చునని ఏపీ అధికారులు భావిస్తున్నారు.

ఇలావుంటే, కృష్ణా, గోదావరి జలాలపై మన రాష్ట్రానికి ఉన్న హక్కులకు భంగం కలగకుండా తగిన నిర్ణయాలు తీసుకోవాలని రైతు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఎలాంటి ప్రతిపాదనలతో వచ్చినా అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత వారిపై వున్నదని వారంటున్నారు.

ముఖ్యంగా ఎంతో సున్నితమైన నదీ జలాల వివాదాలను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సామరస్యంగా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని రైతు నేతలు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో 'గోదావరి, కృష్ణానది జలాల వినియోగం'పై విజయవాడలో జరిగిన చర్చాగోష్ఠిలో రైతు ప్రతినిధులు తమ వాణిని వినిపించారు.  

రెండు నదీ జలాల వినియోగం-లభ్యతపై శ్వేతపత్రం విడుదల చేయాలని, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు సాగు నీరు అందించాలని, పోలవరం ప్రాజెక్టును నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని, జలాల వినియోగంపై రాజకీయపార్టీలు, రైతు సంఘాలు, సాగునీటి నిపుణులతో ఏపీ ముఖ్యమంత్రి వెంటనే ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఈ గోష్ఠిలో తీర్మానించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు నష్టం వాటిల్లకుండా, భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సూచించారు. 

పోలవరం ప్రాజెక్టుపై న్యాయస్థానంలో వేసిన వ్యాజ్యాలను ఉపసంహరించుకోకుండా తెలంగాణా ముఖ్యమంత్రి చర్చలకు రావడంపై ఈ గోష్ఠిలో తీవ్ర అభ్యంతరం వ్యక్తమయ్యంది. ముందు ఇటువంటి వివాదాలను పరిష్కరించుకుని తరువాత ఉమ్మడి ప్రయోజనాలపై చర్చకు రావాలని ప్రతినిధులు తేల్చారు.  మొత్తం మీద రెండు వేర్వేరు రాష్ట్రాలలో ఉమ్మడిగా ఇంత భారీ ప్రాజెక్టును చేపట్టడం మాటలు చెప్పినంత తేలిక కాదని అర్ధం అవుతోంది.

లెక్క తేలింది.. మద్యం దరఖాస్తుల ద్వారా రూ. 960 కోట్లు

లెక్క తేలింది.. మద్యం దరఖాస్తుల ద్వారా రూ. 960 కోట్లు

   9 hours ago


కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం

కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం

   10 hours ago


‘మహా’లో పట్టు నిలిచేనా? హర్యానాలో హవా సాగేనా?

‘మహా’లో పట్టు నిలిచేనా? హర్యానాలో హవా సాగేనా?

   11 hours ago


టీఆర్ఎస్‌లో తిరుగుబాటు.. కేసీఆర్ సర్కార్ పై నీలినీడలు

టీఆర్ఎస్‌లో తిరుగుబాటు.. కేసీఆర్ సర్కార్ పై నీలినీడలు

   11 hours ago


జర్నలిస్టు హత్య కేసు:ప్రాణహాని ఉందని చెప్పినా పట్టించుకోలేదా?

జర్నలిస్టు హత్య కేసు:ప్రాణహాని ఉందని చెప్పినా పట్టించుకోలేదా?

   11 hours ago


హుజూర్‌నగర్లో హోరాహోరీ.. గెలుపెవరిది?

హుజూర్‌నగర్లో హోరాహోరీ.. గెలుపెవరిది?

   11 hours ago


ఆ విషయంలో జగన్ కంటే వైఎస్సే బెస్ట్.. బాబు కామెంట్స్

ఆ విషయంలో జగన్ కంటే వైఎస్సే బెస్ట్.. బాబు కామెంట్స్

   13 hours ago


జేసీ బ్రదర్స్‌ప్రై ప్రతీకారం మొదలైనట్లేనా..

జేసీ బ్రదర్స్‌ప్రై ప్రతీకారం మొదలైనట్లేనా..

   13 hours ago


దేవుడు కూడా కేసీఆర్‌‌ను వ్యతిరేకిస్తున్నాడుగా.. దాసోజు ఎద్దేవా

దేవుడు కూడా కేసీఆర్‌‌ను వ్యతిరేకిస్తున్నాడుగా.. దాసోజు ఎద్దేవా

   14 hours ago


ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

   14 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle