newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

‘ఉమ్మడి జల దృశ్యం’లో ప్రతిష్టంభన !-2

16-07-201916-07-2019 07:50:10 IST
Updated On 16-07-2019 07:54:31 ISTUpdated On 16-07-20192019-07-16T02:20:10.322Z16-07-2019 2019-07-16T02:20:01.094Z - 2019-07-16T02:24:31.603Z - 16-07-2019

‘ఉమ్మడి జల దృశ్యం’లో ప్రతిష్టంభన !-2
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
(మొదటి భాగం తరువాయి)

తెలంగాణా రాష్ట్ర భూభాగం నుంచే గోదావరి జలాలను తరలించి శ్రీశైలంలో ఎత్తిపోయడానికి నిర్ణయించామని సభలో ఏపీ ముఖ్యమంత్రి వెల్లడించారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి ప్రయోజనాల కోసం సోదరభావంతో మెలగి కరవు జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి పూనుకున్నాయని, ఈ విషయంలో తెలంగాణా ముఖ్యమంత్రి చొరవ చూపి ఎంతో ఔదార్యం చూపిస్తున్నారని జగన్మోహన్‌రెడ్డి కూడా చెప్పుకొచ్చారు. 

ఏపీలో కాకుండా తెలంగాణ భూభాగం నుంచే జంట జలాశయాలైన నాగార్జున సాగర్‌, శ్రీశైలంలోకి చెరో రెండు టీఎంసీల చొప్పున గోదావరి జలాలను ఎత్తిపోస్తామని ఏపీ ముఖ్యమంత్రి శాసనసభ వేదికగా చాలా స్పష్టంగా ప్రకటించడంతో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారుల సంప్రదింపులకు నిర్దిష్ట మార్గదర్శనం చేసినట్టయ్యింది. తెలంగాణ భూ భాగంలోని తుపాకులగూడెం, లేదా దుమ్ముగూడెం దగ్గర నుంచి గోదావరి జలాలను ఎత్తిపోయాలన్న ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులు మొగ్గు చూపుతున్నారు. 

గోదావరి జలాలను తెలంగాణ భూభాగం నుంచే నాగార్జున సాగర్‌, శ్రీశైలం జలాశయాల్లోకి ఎత్తిపోయడం శ్రేయస్కరమని వారు భావిస్తున్నారు. తెలంగాణ అధికారుల బృందం మాత్రం పోలవరం కుడి ప్రధాన కాలువ నుంచి వైకుంఠపురం.. పులిచింతల.. నాగార్జున సాగర్‌.. ఆ తర్వాత శ్రీశైలం జలాశయంలోకి నీటిని ఎత్తిపోయడమే మంచిదని ప్రతిపాదిస్తోంది. ఈ ప్రతిపాదన పట్ల ఏపీ ప్రభుత్వం అంత సానుకూలంగా లేదు. 

ఏపీ భూభాగం నుంచి గోదావరి నీటిని తరలించాలంటే అది ఎంతో వ్యయ ప్రయాసలతో కూడిన పని. ఎక్కడికక్కడ స్టోరేజ్ ట్యాంకులను ఏర్పాటు చేయాలి. పోలవరం కుడి ప్రధాన కాలువలను మరింత వెడల్పు చేయాలి. వైకుంఠపురం దగ్గర బ్యారేజ్ నిర్మాణాన్ని చేపట్టాలి. వీటన్నింటికీ భారీఎత్తున భూసేకరణ జరపాలి. అది అంత తేలికగా జరిగే పని కాదు. ఇంత చేశాక శ్రీశైలంలోకి గోదావరి జలాలను ఎత్తిపోసే సమయంలో ఒకవేళ భారీ వర్షాలు కనుక కురిస్తే, అప్పటిదాకా ఎత్తిపోసిన నీరంతా కిందకు వదిలివేయాల్సి వస్తుందని ఏపీ అధికారులు తలపోస్తున్నారు. 

మూడు మాసాల పాటు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఎత్తిపోసిన 360 టీఎంసీల గోదావరి జలాలు కిందకు జరజరా కిందకు పాక్కుంటూ వచ్చి పల్లపు ప్రాంతాల్ని ముంచెత్తుతూ వెళ్లి సముద్రంలో కలసిపోతాయనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. అదీగాక, తెలంగాణ చేస్తున్న ప్రతిపాదన భారీ వ్యయంతో, ప్రయాసలతో కూడుకున్నదని వారి కచ్చితమైన అభిప్రాయం.రెండు రాష్ట్రాల మధ్యన గల రెండు నదులను అనుసంధానం చేసే ఈ కార్య ప్రణాళిక వాస్తవ రూపు దాల్చాలంటే కనీసం రూ.లక్షన్నర కోట్ల వ్యయం కాగలదని ప్రాథమికంగా ఒక అంచనా.

ఐతే, గోదావరి జలాలను పొరుగు రాష్ట్ర ప్రయోజనాలకు ఇవ్వడంతో పాటు, ఉభయుల మధ్య జల వనరుల వినియోగంపై నిర్ధిష్టమైన లెక్కాపత్రం కూడా ఉండాల్సిందేనని ఏపీకి చెందిన నీటిపారుదల నిపుణులు వాదిస్తున్నారు. మన హక్కుగా దక్కాల్సిన నదీ జలాల అంశంలో ఇరుగుపొరుగు రాష్ట్ర సంబంధాల దృష్ట్యా ఉదారంగా వ్యవహరించడం ప్రస్తుతానికి సబబుగానే అనిపించినా, భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ విభేదాలు తలెత్తినా పర్యవసానాలు ఊహించరానివిగా ఉంటాయని వారంటున్నారు. 

ఇలావుంటే, ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం జూలై 15లోగా హైదరాబాద్‌లో ఇఎన్‌సీ స్థాయి సంప్రదింపులలోనే ప్రాథమికంగా ఒక కార్య ప్రణాళిక ఖరారవ్వాలి. ఆ తరువాత విజయవాడలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగే సమావేశంలో ఈ ప్రణాళికను ప్రకటించాల్సి ఉంది. ఐతే, ఆదిలోనే హంసపాదు ఎదురవ్వడంతో తదుపరి ఈ చర్చలను ఎలా ముందుకు తీసుకువెళ్తారో వేచిచూడాలి.

‘ఉమ్మడి జల దృశ్యం’లో ప్రతిష్టంభన !-1


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle