newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

‘ఉమ్మడి జల దృశ్యం’లో ప్రతిష్టంభన !-1

16-07-201916-07-2019 07:45:46 IST
Updated On 16-07-2019 07:53:47 ISTUpdated On 16-07-20192019-07-16T02:15:46.444Z16-07-2019 2019-07-16T02:15:42.010Z - 2019-07-16T02:23:47.969Z - 16-07-2019

‘ఉమ్మడి జల దృశ్యం’లో ప్రతిష్టంభన !-1
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మొదట్నుంచీ సందేహాస్పదంగానే ఉన్న గోదావరి జలాల తరలింపు ప్రతిపాదన అంత తొందరగా కార్యరూపం దాల్చే అవకాశం కనిపించడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలకు స్వస్తి చెప్పి ఉమ్మడి ఎజెండాతో పనిచేయాలని ఉభయ రాష్ట్రాధినేతలు చేసుకున్న బాసలు వాస్తవంలోకి రావడం అంత తేలికపాటి వ్యవహారంగా అనిపించడం లేదు. 

గోదావరి జలాలను నాగార్జునసాగర్, శ్రీశైలం జంట జలాశయాలలోకి ఎత్తిపోయాలన్న కార్య ప్రణాళికపై రెండు రాష్ట్రాల జల వనరుల ఉన్నతాధికారుల మధ్య మలివిడతగా జరగాల్సిన చర్చలు ప్రస్తుతానికి వాయిదాపడ్డాయి. ‘ఇప్పుడు మేము ఇంతకంటే ప్రాధాన్యమైన అంశాలపై తీరుబాటు లేకుండా ఉన్నాం.. మనం అనుకున్నట్టుగా రెండవ విడత సంప్రదింపులకు హాజరవ్వడం మాకు ప్రస్తుతానికి వీలుపడదు’ అని తెలంగాణ అధికారుల నుంచి కబురు అందడంతో చర్చలు అనివార్యంగా వాయిదా పడ్డాయి. 

రెండు రాష్ట్రాలలో నదీ జలాలను సద్వినియోగం చేసుకుని రాయలసీమ, తెలంగాణా జిల్లాల్లోని బీడు భూములను మాగాణంగా మారుస్తామని ఇటీవల హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో జరిగిన సంయుక్త సమావేశంలో ముఖ్యమంత్రులు ఇద్దరూ ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు. గోదావరి జలాలను ఎలా  మళ్లించాలనే అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేశారు. 

ఇరు రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల రంగ నిపుణులు వెంటనే సంప్రదింపులు మొదలుపెట్టి గోదావరి జలాలను కృష్ణానదీ పరివాహక ప్రాంతంలోని జంట జలాశయాలకు తరలించే అంశంపై ఒక సంయుక్త ప్రణాళికను రూపొందిస్తారని ఆ సమావేశంలో ముఖ్యమంత్రులు ప్రకటించారు. దరిమిలా రెండు రాష్ట్రాల ఇఎన్‌సీ స్థాయి ఉన్నతాధికారులు ఇప్పటికి ఒక దఫా సంప్రదింపులు జరిపి తమ తమ ప్రణాళికలపై ఆలోచనలను పంచుకున్నారు. 

తొలి సమావేశంలోనే ఒకరు చేసిన ప్రతిపాదనలను మరొకరు తిరస్కరించారు. దీనిపై మరో పర్యాయం సమావేశమై మరింత లోతుగా చర్చించాలని భావించారు. ఆ ప్రకారం ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ స్థాయి అధికారులతో హైదరాబాద్‌లో మలి విడత సంప్రదింపులు జరగాల్సి వుండగా అదిప్పుడు వాయిదా పడింది.

పైకి చెబుతున్న కారణాలు ఏమైనప్పటికీ, రెండు రాష్ట్రాల మధ్య ప్రాథమిక స్థాయిలోనే చర్చల ప్రతిష్టంభన ఏర్పడటానికి అసలు కారణం వేరే వుంది. తొలి సమావేశంలోనే ఏపీ అధికారులు చేసిన ప్రతిపాదనను తెలంగాణా అధికారులు తీవ్రంగా వ్యతిరేకించారు. దాని తరువాత శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఒక కీలక ప్రకటన చేశారు. 

(ఇంకా ఉంది)

‘ఉమ్మడి జల దృశ్యం’లో ప్రతిష్టంభన !-2


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle