newssting
BITING NEWS :
*దిశ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృదం.. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో విచారణ కమిటీ *హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేలకు అనుమతి * ఎన్‌ఆర్‌సీ బిల్లుకిమంత్రివర్గం ఆమోదం*కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్*రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక గత మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు*చిత్తూరుజిల్లాలో దారుణం... కాలేజి నుండి వస్తుండగా బాలిక కిడ్నాప్*విజయవాడలో అజిత్ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు*నేడు పోలీస్‌ కస్టడీకి దిశ నిందితులు..నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు..వారం రోజుల పాటు విచారణ*నేడు ఆర్బీఐ విధాన సమీక్ష.. వడ్డీరేట్ల పై కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ *శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్... స్వామి గర్భగుడి పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేదించిన ట్రావెన్ కోర్ బోర్డు *తెలంగాణ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లైట్ అథారిటీని ఈ నెల 27వ తేదీలోగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం*వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. రోజుకు నలుగురిని విచారించిన సిట్ బృందం.. రేపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించనున్న సిట్

ఉమ్మడి అప్పుల నుండి ఏపీకి విముక్తి ఎప్పుడు?

11-11-201911-11-2019 00:12:50 IST
2019-11-10T18:42:50.665Z11-11-2019 2019-11-10T18:42:42.715Z - - 06-12-2019

ఉమ్మడి అప్పుల నుండి ఏపీకి విముక్తి ఎప్పుడు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. గత కొన్ని నెలలుగా ఈ మాట వింటూనే ఉన్నాం.. చెప్పుకుంటూనే ఉన్నాం. ఆ మాటకొస్తే మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ పరిస్థితి కూడా అదే. కారణాలేమైనా సాక్షాత్తు సీఎం కెసిఆర్ కోర్టు సాక్షిగా ఈ మాట ఒప్పుకున్నారు. తెలంగాణ సంగతెలా ఉన్న ఏపీ మాత్రం నెలవారీ ఖర్చులకు కూడా కేంద్రంవైపో మరో బ్యాంకు వైపో చూడాల్సిన పరిస్థితి.

ఏపీలో వచ్చే ఆదాయానికి ప్రభుత్వం చేసే ఖర్చుకు ఏ మాత్రం పొంతనలేదు. అందుకే నెలనెలా అప్పులు పెరిగిపోతూనే ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో అప్పులు, గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కూడా కట్టాల్సి ఉండడం ఇప్పుడు ప్రభుత్వానికి అదనపు భారం. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టాల్సిందే. అది కూడా ప్రభుత్వమే చేసింది కనుక తప్పదు.

ఇప్పుడున్న పరిస్థితిలో తప్పించుకోవడానికి ఇప్పటి ప్రభుత్వం గత ప్రభుత్వ అప్పులకు కుంటిసాకులు చెప్తున్నా అవి ఎప్పటికైనా కట్టాల్సిందే. ఇక ఉమ్మడి రాష్ట్రంలో చేసిన అప్పులకు కేవలం ఏపీ మాత్రమే వడ్డీలు కట్టాల్సి రావడం మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ సామెతలా మారింది. అసలు సంగతెలా ఉన్నా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఆ అప్పులకు కనీసం వడ్డీలు కట్టాల్సి వస్తున్నదన్నది ఆందోళన కలిగించేదే.

2014 జూన్‌2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగే సమయానికి ప్రభుత్వానికి రూ2,00,171 కోట్ల అప్పు ఉన్నట్లు తెలుస్తుంది. విభజన తర్వాత కొంత కాలానికి కేంద్రం జనాభా-ప్రాంతాల ప్రాతిపదికన కొంతమేర అప్పులను రెండు రాష్ట్రాలకు విభజించింది. కేంద్రం ప్రాతిపదికల లెక్కల ప్రకారం ఏపీపై రూ97,177 కోట్ల భారం పడింది. ఇక కేంద్రం అసలు పంపకాలు చేయనివి రూ33,478 కోట్ల అప్పు అలానే ఉమ్మడి రాష్ట్రం మీద ఉండగా పాత రాష్ట్రంగా హక్కు ఉన్న ఏపీనే ఆ భారాన్ని మోస్తుంది.

ఈ భారాన్ని కూడా విడదీసి భారం తగ్గించాలని గత ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు పలుమార్లు కేంద్రాన్ని కోరుతూ లేఖలు కూడా రాశారు. కానీ అప్పుడు విభజన జరగలేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ప్రతి పైసా లెక్కించాల్సిన పరిస్థితిలో ఈ భారం మీద చర్చించాల్సి వస్తుంది. ఈ మధ్యనే అన్ని అకౌంట్స్ చెక్ చేసిన అధికారులు సీఎంకు ఈ ఉమ్మడి భారం ఎఫ్‌ఆర్‌బీఎంపై పడుతుందని సూచించారట.

పద్నాల్గవ ఆర్ధిక సంఘం కొన్ని ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనలను ఖరారు చేసింది. ఈ నిబంధనలలో కీలకమైన నిబంధన ఏంటంటే.. జాతీయ స్థూల ఉత్పత్తిలో మూడు శాతం కన్నా తక్కువగా మాత్రమే రుణాలు కలిగి ఉండాలి. ప్రస్తుత జిఎస్‌డిపి మేరకు రాష్ట్ర ప్రభుత్వం 25.16 శాతం కన్నా ఎక్కువ ఋణం కలిగి ఉండరాదు. కానీ ప్రస్తుతం ఏపీ జిఎస్‌డిపిలో 28.18 శాతం రుణం ఉన్నట్లు కేంద్రం వద్ద లెక్కల్లో తేలింది.

ఉమ్మడిరాష్ట్రంలో అప్పులను కనుక విభజిస్తే ఏపీ మీద రుణభారం కొద్దిగా తగ్గి ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనలలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నది ఏపీ అధికారుల మాట. అందుకే సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి కేంద్రాన్ని ఆ భారాన్ని విభజించాలని కోరుతూ లేఖ రాయనున్నారని సమాచారం. మరి గత ఐదేళ్లలో ఈ పంపకాలకు ముందుకురాని కేంద్రం ఇప్పుడు జగన్ కోరితే ముందుకు వస్తుందా? ఉమ్మడి భారం నుండి ఏపీకి విముక్తి కలిగిస్తుందా? అన్నది చూడాల్సి ఉంది.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle