newssting
BITING NEWS :
*టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేడు విజయనగరం జిల్లాలో పర్యటన* క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో సినీ నిర్మాతల భేటి...హాజ‌రైన దగ్గుపాటి సురేష్, శ్యాంప్రసాద్ రెడ్డి, నల్లమలుపు బుజ్జి *నేడు 72వ రోజు రాజధాని ప్రాంత రైతుల ఆందోళన *వాళ కర్నూలులో సీఎం జగన్ పర్యటన...ఎమ్మెల్మే శ్రీదేవి కుమారుడి విహహానికి హాజరు కానున్న జగన్*నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవనున్న కాంగ్రెస్ నేతలు..ఢిల్లీలో అల్లర్లపై రాష్ట్రపతికి ఫిర్యాదు *నేడు రాజధానికి సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ..హైకోర్టులో వాదనలను వినిపించనున్న ప్రభుత్వ తరపు న్యాయవాది *ఇవాళ గుంటూరు జైలు నుంచి రాజధాని రైతుల విడుదల *రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి *మహిళల టీ-20 ప్రపంచకప్...నేడు భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్

ఉప్పొంగుతున్న కృ‌ష్ణమ్మ.. శ్రీశైలం ప్రాజెక్టు రికార్డుల మోత

23-10-201923-10-2019 18:01:17 IST
Updated On 24-10-2019 14:59:42 ISTUpdated On 24-10-20192019-10-23T12:31:17.840Z23-10-2019 2019-10-23T12:30:58.480Z - 2019-10-24T09:29:42.160Z - 24-10-2019

ఉప్పొంగుతున్న కృ‌ష్ణమ్మ.. శ్రీశైలం ప్రాజెక్టు రికార్డుల మోత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
శ్రీశైలం. నాగార్జున సాగర్ ప్రాజెక్టులే తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ఆధారం. ఈ ఏడాది భారీగా వర్షాలు పడడంతో మరోసారి కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. శ్రీశైలంలో 7 గేట్లు, నాగార్జున సాగర్‌లో 18 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూలై నుంచి ఎడతెరిపి లేకుండా పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలకు మరోసారి కృష్ణానది నిండుగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయాల్సి వస్తోంది.

శ్రీశైలం జలాశయానికి సరాసరిన 3 లక్షలకు పైగా ఇన్ ఫ్లో రావడంతో ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఏడోసారి ఎత్తేశారు. ఒకసంవత్సరంలో ఏడుసార్లు గేట్లను ఎత్తడం ఇదొక రికార్డుగా చెబుతున్నారు ఇరిగేషన్ అధికారులు. గడచిన మూడు దశాబ్దాలలో ఇలా ఎప్పుడు జరగలేదని అధికారులే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలానికి ఎగువున ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండిపోయాయి. వాటినుంచి కూడా నీరు బయటకు వదులుతున్నారు. 

సాధారణంగా కర్నాటక అధికారులు ప్రాజెక్టులు నిండుగా ఉంటేనే కొద్ది మొత్తంలో నీటిని కిందికి వదులుతారు. కర్నాటక ప్రాజెక్టులకు పైనుంచి కూడా ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ఈ నీటిని శ్రీశైలం జలాశయంలోకి వదలడంతో వరద నీరు పెరిగింది. తాజాగా ఏడు క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. 885 అడుగుల నీటిమట్టం ఉండే జలాశయంలో ప్రస్తుతం 884.80 అడుగుల మేరకు నీరు చేరిది. దీంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా తొణికిసలాడుతోంది. 

Image

నాగార్జున సాగర్ కు కూడా ఇన్ ఫ్లో 2.24 లక్షల క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. దీంతో 12 గేట్లను ఎత్తి 2 లక్షల 24 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉందన్న సమాచారంతో అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్టే పులిచింతల స్టోరేజి డ్యామ్ కు పంపుతున్నారు. మరో రెండుమూడురోజులు ఎగువున వర్షాలు పడితే అవుట్ ఫ్లో ఇదే విధంగా కొనసాగుతుందని భావిస్తున్నారు. శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తడంతో అక్కడ నీరు పాలపొంగులా ఉంది. ఈ దృ‌శ్యాలను చూసేందుకు పర్యాటకులు శ్రీశైలానికి తరలివస్తున్నారు. 

 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle