newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

ఉద్యోగులతో ఏపీ సచివాలయం కళకళ.. వారికోసం ప్రత్యేక శాఖ

22-05-202022-05-2020 09:57:19 IST
Updated On 22-05-2020 10:08:11 ISTUpdated On 22-05-20202020-05-22T04:27:19.983Z22-05-2020 2020-05-22T04:26:32.193Z - 2020-05-22T04:38:11.840Z - 22-05-2020

ఉద్యోగులతో ఏపీ సచివాలయం కళకళ.. వారికోసం ప్రత్యేక శాఖ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లాక్ డౌన్ తర్వాత చాలా రోజులకు ఏపీ సచివాలయం ఉద్యోగులతో కళకళలాడింది.  లాక్‌డౌన్‌ సడలింపులు, ఉద్యోగులందరూ విధులకు హాజరవ్వాలంటూ సీఎస్‌ ఇచ్చిన ఆదేశాలతో రెండు నెలల తర్వాత ఉద్యోగులు తమ విభాగాలకు చేరుకున్నారు. విజయవాడ, గుంటూరు నుంచి ప్రత్యేక బస్సుల్లో కొందరు ఉద్యోగులు సచివాలయానికి చేరుకోగా.. మరికొందరు సొంత వాహనాల్లో వచ్చారు. దాదాపు 70 శాతం మంది విధులకు హాజరయ్యారు. 

కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి ప్రతి ఉద్యోగీ మాస్క్‌ ధరించి వచ్చారు. ప్రతి బ్లాక్‌ వద్ద థర్మల్‌ స్కానర్లతో అందరి శరీర ఉష్ణోగ్రత పరీక్షించాకే లోపలికి అనుమతించారు. ఉద్యోగుల పని ప్రదేశాల్లో భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా సుమారు 400 మంది ఉద్యోగులు హైదరాబాద్‌లో ఉండిపోయారని, వారిని ఏపీకి తీసుకురావడానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని సీఎ్‌సను కోరనున్నట్లు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చెప్పారు.

మరోవైపు క్షేత్ర స్థాయిలో కొత్తగా ఏర్పాటుచేసిన గ్రామ, వార్డు సచివాలయాలు, గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ కోసం ప్రత్యేకంగా ఒక శాఖను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఇటీవలే ఒక విభాగాన్ని ఏర్పాటుచేయగా, తాజాగా దానిని పూర్తిస్థాయి శాఖగా మార్చేరదుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇతర శాఖల మాదిరిగానే కొత్త శాఖకు కూడా రాష్ట్ర సచివాలయంలో కార్యదర్శి, ఇతర సిబ్బందితోపాటు ప్రత్యేకంగా శాఖాధిపతి కార్యాలయం కూడా ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. 

ఈ కొత్త శాఖలోకి ప్రస్తుతం ఉన్న పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌), మిషన్‌ ఫర్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ పావర్టి ఇన్‌ మున్సిపాలిటీస్‌ (మెప్మా), ఇఎస్‌డి (మీసేవలో), రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎస్‌ఐఆర్‌డి)లను తీసుకురావాలని ప్రతిపాదించారు. ఇటు సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలను ఏర్పాటుచేసిన అనంతరం వాటిలో కొత్తగా 85 పోస్టులను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. 

కార్యదర్శి స్థాయిలో ఐఏఎస్‌ను నియమించాలని, మరో ఐదు కిరద స్థాయి పోస్టులను కూడా కేటాయించాలని నిర్ణయించారు. అలాగే శాఖాధిపతిగా ఐఏఎస్‌ను, ఇతర పోస్టుల్లో మరో 79 మందిని నియమించనున్నారు. గత ఏడాది11,158 గ్రామ సచివాలయాలు, 3, 842 వార్డు సచివాలయాల్లో 1.18 లక్షల మందిని శాశ్వత ప్రాతిపదికన నియమించారు. వీరికి అదనంగా 1.95 లక్షల మంది గ్రామ వాలంటీర్లు, 71 వేల మంది వార్డు వాలంటీర్లను కూడా తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. భారీగా ఉద్యోగులు ఉండడంతో వీరి కోసం కొత్త శాఖను ఏర్పాటుచేయడమే మేలని ప్రభుత్వం భావిస్తోంది.

 

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

   6 hours ago


తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

   11 hours ago


భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

   14 hours ago


మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

   14 hours ago


నిమ్మగడ్డ  ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

నిమ్మగడ్డ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

   15 hours ago


మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

   17 hours ago


యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

   17 hours ago


‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

   17 hours ago


తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

   18 hours ago


డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

   30-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle