newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

ఉద్యోగులకు సీఎం జగన్ వరాలు

08-06-201908-06-2019 15:14:37 IST
Updated On 24-06-2019 14:14:05 ISTUpdated On 24-06-20192019-06-08T09:44:37.506Z08-06-2019 2019-06-08T09:44:35.258Z - 2019-06-24T08:44:05.341Z - 24-06-2019

ఉద్యోగులకు సీఎం జగన్ వరాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు వరాలు ప్రకటించారు. ముఖ్యమంత్రి హోదాలో సచివాలయానికి వచ్చిన జగన్ ఉద్యోగులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘‘గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడుగారితో పనిచేసి ఉండటం వల్ల కొంతమంది ఉద్యోగుల ఆయనతో సన్నిహితంగా ఉండి ఉండవచ్చు.

ఏదైనా పనులు చేయించుకోవడం కోసం గత ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది... కాబట్టి నేను ఆ విషయాన్ని తప్పుగా భావించనని మీ అందరికీ చెబుతున్నాను. ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉండటం ద్వారానే వారితో ఉద్యోగ సంఘాలు ఏవైనా పనులు చేయించుకునే పరిస్థితి ఉంటుంది.

అందువల్ల నేను ఆయా అంశాలను పట్టించుకోనని చెబుతున్నాను. ప్రతి విభాగంలో ప్రతి సెక్రటరీ, హెచ్ వోడీ దగ్గర ఈ మేనిఫెస్టో ఉండాలని వారందరికీ చెప్పాం. మళ్లీ ఎన్నికలు వచ్చే నాటికి ఈ మేనిఫెస్టోలో ప్రతి పని.. ప్రతి అంశం చేశామని చెప్పి ప్రజల దగ్గరకు వెళ్లి ఓటు అడిగే పరిస్థితి ఉండాలి’’ అన్నారు జగన్.

ప్రజలు మంచి ప్రభుత్వాన్ని కోరి ఓటు వేస్తారు. మంచి ప్రభుత్వం అంటే నేనొక్కడినే కాదు.. మీ అందరిని కలుపుకున్నదే మంచి ప్రభుత్వం. మేనిఫెస్టోలోని అన్ని అంశాలు అమలు కావాలని సెక్రటరీలు అందరికీ చెప్పామన్నారు సీఎం జగన్. మేనిఫెస్టోలో చెప్పిన అంశాల్లో ఉద్యోగస్తులకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి.  కేబినెట్ లో ఐఆర్ 27 శాతం చేస్తూ నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎన్నికల సమయంలో ఇఛ్చిన హామీ మేరకు సీపీఎస్ ను కూడా రద్దు చేస్తాం...  కేబినెట్ లో ఇవన్నీ పూర్తి చేసి ఎలా చేయాలన్న అంశంపై ముందుకు వెళ్లేందుకు కమిటీని ఏర్పాటు చేస్తాం అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 

ప్రభుత్వంలో కాంట్రాక్టు పద్దతిలో పని చేస్తున్న వారికి సంబంధించి వారి అర్హత, అనుభవంల ఆధారంగా వీలైనంత ఎక్కువ మంది ప్రభుత్వంలోకి తీసుకుంటాం. వారి సేవలు వినియోగించుకుంటాం.

ఈ అంశం కూడా కేబినెట్ లో పెట్టి ముందుకు వెళతాం అన్నారు. ప్రజలు నమ్మకంతో తమను ఎన్నుకున్నారని, అధికారులు కూడా కలిసి రావాలన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు. ఉద్యోగులకు ఇళ్ల స్థలాలకు సంబంధించి భయపడాల్సిందేమీ లేదు. కేబినెట్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ సమస్య లేకుండా ఏం చేస్తామనేది కేబినెట్ లోచెబుతాం అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle