newssting
BITING NEWS :
* ఏపీ: గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 54 మందికి కరోనా పాజిటివ్‌, ఒకరు మృతి..2841కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, యాక్టివ్ కేసుల సంఖ్య 824..మొత్తం 1958 మంది డిశ్చార్జ్.. కాగా మొత్తం కరోనాతో 59 మంది మృతి *భారత్ లో 1,58,333 కరోనా పాజిటివ్ కేసులు..దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 86,110..కరోనా నుండి డిశ్చార్జ్ అయిన బాధితులు 67,692..కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,531*దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 6,566 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు..గడచిన 24 గంటలలో మొత్తం 194 మంది మృతి*ఇవాళ స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి... ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి పురంధేశ్వరి దంపతులు*బోరు బావి ఘటన విషాదాంతం..కన్నుమూసిన చిన్నారి సాయి వర్ధన్..సమాంతరంగా గొయ్యి మృతదేహం వెలికి తీత..సాయంత్రం ఆడుకుంటూ బోరుబావిలో పడ్డ బాలుడు*లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని, వైద్యశాఖ అప్రమత్తంగా ఉండాలి-సీఎం కేసీఆర్*ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఆలిండియా సర్వీసుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్లలో 25 శాతం కోతలను మే నెలలో కూడా కొనసాగించాలి-కేసీఆర్*హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. అప్పుల కిస్తీలను విధిగా చెల్లించాలి, ఆసరా పెన్షన్లను యథావిథిగా అందించాలి-సీఎం కేసీఆర్

ఉద్యోగులకు జగన్ సర్కార్ ‘ఇంటెరిమ్’ షాక్!

06-07-201906-07-2019 22:40:30 IST
2019-07-06T17:10:30.979Z06-07-2019 2019-07-06T17:09:41.262Z - - 28-05-2020

ఉద్యోగులకు జగన్ సర్కార్ ‘ఇంటెరిమ్’ షాక్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
‘రావాలి జగన్.. కావాలి జగన్..’ అని అప్పట్లో బృందగానం చేసిన వాళ్లలో ప్రభుత్వోద్యోగులు ఉన్నారన్నది నిజ్జంగా నిజం. ‘మావోడు.. మా మేలు కోరేవాడు వచ్చాడ’ని వారు సంబరంలో మునిగి తేలుతుంటే పిడుగులాంటి జీవో బయటికి రావడంతో సర్కారు ఉద్యోగులు నిర్ఘాంతపోతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27% తాత్కాలిక భృతి (ఇంటెరిమ్ రిలీఫ్) ఇస్తున్నట్టుగా ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఉత్తర్వు వారాంతంలో విశ్రాంతి తీసుకుంటున్న వేళ వారందరూ హతాశులయ్యారు.

ఒక్కొక్కరికీ రూ.30 నుంచి 90 వేల వరకు ఐఆర్ నష్టం

విషయం ఏంటంటే.. చంద్రబాబు ప్రభుత్వం ఫిబ్రవరి 18, 2019న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ 01.04.2019 నుంచి 20 శాతం జీతాలు పెంచుతూ ఒక ఉత్తర్వు (జీవో నెంబర్ 21) ఇచ్చింది. ఆ జీవో ప్రకారం ఏప్రిల్, మే, జూన్ నెలలలో పెరిగిన ఐఆర్ ఈ జూలై నెల నుంచి అందరికీ రావాల్సివుంది. ఈలోపు జగన్ మోహన్ రెడ్డి అధికార పీఠం ఎక్కడంతో సీన్ రివర్సయ్యింది. 

తాజాగా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులో 27 శాతం తాత్కాలిక భృతిని ఈ నెల నుంచి (జూలై నుంచి) మాత్రమే ఇస్తున్నట్టుగా స్పష్టంగా పేర్కొంది. చంద్రబాబు ఇస్తానన్న 20 శాతం పెరుగుదల గడచిన మూడు నెలలకు (అంటే 60 శాతం) ఇవ్వడం లేదని ఈ జీవో ద్వారా జగన్ సర్కార్ తేల్చేయడంతో ఉద్యోగులు గొల్లుమంటున్నారు. 

ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో చంద్రబాబు పెంచిన 20 శాతం ఐఆర్ ఇప్పుడు జగన్ ఎగనామం పెట్టటంతో ఒక్కొక్క ఉద్యోగికి వేలల్లో నష్టం కనిపించడంతో దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. 

ఈ మూడు మాసాల నష్టం ఒక్కొక్క ఉద్యోగికి రూ.30 వేల నుంచి రూ.90 వేల వరకు ఉంటుందని ఒక అంచనా.  జగన్ సర్కార్ ఇప్పటి నుంచి 9 నెలలు పాటు 27 శాతం ఇచ్చినా, ఈ ఏడాదికి సగటున పెరిగేది 20 శాతం మాత్రమేనని ఉద్యోగులు ఇంటి దగ్గర కూర్చుని లెక్కలేసుకుని ‘వామ్మో.. ’ అంటూ వాపోతున్నారు.

 అన్నిటికంటే అతి పెద్ద జలపండుగ  కొండపోచమ్మ రిజర్వాయర్ వేడుక

అన్నిటికంటే అతి పెద్ద జలపండుగ కొండపోచమ్మ రిజర్వాయర్ వేడుక

   2 hours ago


ప్రభుత్వాఫీసులకు రంగుల వ్యవహారంపై హైకోర్టు సీరియస్

ప్రభుత్వాఫీసులకు రంగుల వ్యవహారంపై హైకోర్టు సీరియస్

   4 hours ago


చెరో సెంచరీ దాటేసిన తెలుగురాష్ట్రాలు.. ఏపీ 134.. తెలంగాణ 107

చెరో సెంచరీ దాటేసిన తెలుగురాష్ట్రాలు.. ఏపీ 134.. తెలంగాణ 107

   4 hours ago


ఈ నెల 29న సీఎం కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ టూర్ షెడ్యూల్

ఈ నెల 29న సీఎం కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ టూర్ షెడ్యూల్

   9 hours ago


గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సులకు మినహాయింపులు

గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సులకు మినహాయింపులు

   11 hours ago


ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. ఎన్టీయార్ ఘాట్లో కుటుంబసభ్యుల శ్రద్ధాంజలి

ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. ఎన్టీయార్ ఘాట్లో కుటుంబసభ్యుల శ్రద్ధాంజలి

   11 hours ago


విద్యపై పెట్టే ఖర్చు... పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి.. జగన్ స్పష్టీకరణ

విద్యపై పెట్టే ఖర్చు... పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి.. జగన్ స్పష్టీకరణ

   11 hours ago


‘‘ఏపీలో ప్రాథమిక హక్కులు లేవు.. నడుస్తోంది ఆటవిక రాజ్యం’’

‘‘ఏపీలో ప్రాథమిక హక్కులు లేవు.. నడుస్తోంది ఆటవిక రాజ్యం’’

   12 hours ago


పాజిటివ్ కేసులు పెరుగుతాయి.. భయపడొద్దు.. కేసీఆర్ భరోసా

పాజిటివ్ కేసులు పెరుగుతాయి.. భయపడొద్దు.. కేసీఆర్ భరోసా

   12 hours ago


 పాపం పసివాడు..  ఆక్సిజన్ అందక బోరుబావిలో పడ్డ బాలుడి మృతి

పాపం పసివాడు.. ఆక్సిజన్ అందక బోరుబావిలో పడ్డ బాలుడి మృతి

   13 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle