newssting
BITING NEWS :
*దిశ కేసులో నలుగురు నిందితులను షాద్ నగర్ లో ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు*దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ *దిశ ఘటన హెచ్చరిస్తోంది - పవన్ కళ్యాణ్ * నర పీడితులకు సరైన శిక్ష పడింది - మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ *దేశంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది, మీరు నిందితులను చంపకూడదు- ఎంపీ మేనకాగాంధీ * దిశకు తగిన న్యాయం జరిగింది - అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్, నాని, పూరీజగన్నాధ్ * రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు *దిశ ఘటన తర్వాత దేశం మొత్తం ఆగ్రహంతో ఉంది - కేజ్రీవాల్*కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్*రేపిస్టులపై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.. రేపిస్టులపై దయ అవసరంలేదు.. నిందితులు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశమే ఉండకూడదన్న రాష్ట్రపతి *నిందితుల హత్యకేసుపై దిశ తల్లిదండ్రుల స్పందన.. మా బిడ్డకు తగిన న్యాయం జరిగిందని వ్యాఖ్య

ఉద్దేశం మంచిదే.. కానీ గ్రీన్ టాక్స్ నెగటివ్ అవుతోంది జగన్..

30-09-201930-09-2019 16:51:14 IST
2019-09-30T11:21:14.229Z30-09-2019 2019-09-30T11:21:12.001Z - - 06-12-2019

ఉద్దేశం మంచిదే.. కానీ గ్రీన్ టాక్స్ నెగటివ్ అవుతోంది జగన్..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ ప్రతికూల పరిస్థితుల్లో ఆ మంచి నిర్ణయం కూడా ప్రతికూల ఫలితాలను తేవడం కొన్ని సార్లు జరుగుతూ ఉంటుంది. ప్రజా శ్రేయస్సు కోసం తీసుకొచ్చిన మంచి నిర్ణయాలు కూడా బెడిసికొడుతూ ప్రభుత్వాలే వెనక్కు మళ్లుతున్న ఘటనలను అనేక సార్లు చూశాం. తీవ్రమైన ఆర్థిక వనరుల లేమితో కొట్టుమిట్టాడుతున్న ఏపీ ప్రభుత్వం కూడా కాలుష్య కారక పరిశ్రమలపై హరిత పన్ను వేయాలని తీసుకున్న నిర్ణయం ఇలాంటి ప్రతికూల ఫలితాలనే అందించనుందా? 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగిపోతున్న పారిశ్రామిక కాలుష్యాన్ని అరికట్టడానికి పరిశ్రమలపై పర్యావరణ పన్ను (గ్రీన్ టాక్స్) విధించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కొన్ని రోజుల క్రితం అదికారులకు దిశానిర్దేశం చేశారు. కాలుష్యాన్ని నియంత్రించే బాధ్యతలను నెరవేర్చడంలో పరిశ్రమలు విఫలమవుతున్నందున ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. రాష్ట్రంలోని పరిశ్రమలపై గ్రీన్ టాక్స్ విధించబోతున్నాం. పారిశ్రామిక కాలుష్యాలను తగ్గించే బాధ్యతను స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టనుంది అని వైఎస్ జగన్ ఇటీవలే అధికారులకు చెప్పారు.

కానీ ముఖ్యమంత్రి ప్రకటన మిశ్రమ స్పందనలను రేకెత్తించడం గమనార్హం. కాలుష్య నివారణకోసం అవసరమైన చర్యలన్నీ ప్రభుత్వం తీసుకోవాలని కొంతమంది సమర్థించగా, కొంతమంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సెస్ టాక్స్ వసూలు చేస్తోంనది, కాని అతి ముఖ్యమైన కర్తవ్యాలను పూరించడం పక్కనపెట్టి సెస్ టాక్స్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇతర స్కీములకు మళ్లిస్తోందని విమర్శిస్తున్నారు. 

అంతకుమించి పరిశ్రమవర్గాలు ఈ కొత్త గ్రీన్ టాక్స్ గురించి భయాందోళలకు గురవుతున్నాట్లు సమాచారం. ఇప్పటికే ఏపీలో పరిశ్రమలు పెడితే స్థానికులకై 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం విధాన ప్రకటన చేయడంతోపాటు గత ప్రభుత్వం సంతకం పెట్టిన ఒప్పందాలను గౌరవించకపోవడంతో కొత్త పరిశ్రమలు పెట్టాలంటే పారిశ్రామికులు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. 

ఈ పరిస్థితుల్లో కొత్తగా గ్రీన్ టాక్స్ పరిశ్రమలపై విధించి అమలు చేస్తే పెట్టుబడిదారులకు ప్రభుత్వంపై పూర్తిగా విశ్వాసం నశిస్తుందని విమర్శకుల వ్యాఖ్య. ముందు నుయ్యి, వెనుక గొయ్యి అంటే ఇదేనేమో మరి.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle