newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

ఉత్తర కుమారుడి ‘పిట్ట’కూతలు

16-07-201916-07-2019 14:29:12 IST
Updated On 16-07-2019 14:30:31 ISTUpdated On 16-07-20192019-07-16T08:59:12.031Z16-07-2019 2019-07-16T08:59:09.647Z - 2019-07-16T09:00:31.039Z - 16-07-2019

ఉత్తర కుమారుడి ‘పిట్ట’కూతలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో ఓటమి తర్వాత లోకేష్ ప్రత్యక్ష రాజకీయాలకు ఇంచుమించు దూరంగా ఉంటున్నారు. ఓడిపోయినా మీ వెంటే నేనుంటానని మంగళగిరి వాసులకు అభయం ఇచ్చినా, బయటకు రావడం మాత్రం చినబాబు బాగా తగ్గించారనే చెప్పాలి. గతంతో పోలిస్తే ఇప్పుడు ట్విట్టర్లో దూకుడు ఎక్కువగా కనిపిస్తోంది. ఆయనకు ట్యూటర్‌గా ఉన్న వ్యక్తి మారడంతో ట్వీట్లు కూడా కాస్తంత పదునెక్కాయని కామెంట్లు పడుతున్నాయి. మీడియాలో వచ్చే వైసీపీ నేతల కామెంట్లకు లోకేష్ బాగా స్పందిస్తున్నారు. 

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చినబాబు మాటలు, ట్వీట్లు మహాభారతంలో ఉత్తరకుమారుడిని గుర్తుకు తెస్తున్నాయని నెటిజన్లు వెటకారం చేస్తున్నారు. ఈ ఉత్తర కుమారుడి చేతిలో ఉన్న ఆయుధాలు ల్యాప్ ట్యాప్, ట్యాబ్, స్మార్ట్ ఫోన్ ఇవే. వీటి ద్వారానే కనిపించే శత్రువులను ...కనపడని ఆయుధాలతో ఎదుర్కొంటున్నాడని కామెంట్లు చేస్తున్నారు జనం.

రాజకీయరణ రంగంలో ఈ ‘పిట్ట’ కూతలు బాగా ఎక్కువవుతున్నాయి. తాజాగా టీడీపీ నేతలు కేశినేని నాని, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా లాంటి నేతలు ట్వీట్లకు పనిచెప్పారు. పార్టీ పరువును రచ్చకీడుస్తున్నారు. విమర్శలు, ట్వీట్ల తిట్లు సగటు నెటిజనులనే కాదు, టీడీపీ కార్యకర్తలకు కూడా విసుగు తెప్పిస్తున్నాయనడంలో అతిశయం లేదు. 

తాజాగా శాసనమండలిలో తన ప్రసంగాల్లో ఇదే వినిపించారు. తాజాగా ‘‘విలేజ్ వలంటీర్లు.. వైసీపీ ప్రవేశపెట్టిన అతిపెద్ద దోపిడీ పథకం ఇది. ఈ ఉద్యోగాలకు ఏ అర్హత అవసరంలేదు, వైకాపా కార్యకర్త అయితే చాలు. ఈ ఉద్యోగ ఎంపిక మొత్తం షో నే.. అసలు దీనికి  'వైకాపా కార్యకర్తల దోపిడీ పథకం' అని పేరు పెట్టాల్సింది సరిగ్గా సరిపోయేది’’ అన్నారు. ‘‘కియాను ఏపీకి రమ్మని 2007లోనే వైఎస్ఆర్ కోరారంట. వాళ్ళు కూడా వస్తామని మాటిచ్చారంట. మరెందుకు రాలేదో! వోక్స్ వ్యాగన్ కుంభకోణం, @ysjaganగారి క్విడ్ ప్రో కో చూసి భయపడ్డారా? ఇంకా నయం. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది వైఎస్ రాజారెడ్డి వల్లే అనలేదు’’ అంటూ ట్వీట్ చేశారు. 

‘‘మూర్ఖత్వం అనేది పుట్టుకతో రావాల్సిందే, మధ్యలో దాన్ని సంపాదించడం అసాధ్యం... @ysjagan గారిని చూసాక ఇది అక్షరాల నిజం అని తేలింది. లేని విశ్వసనీయత ఎక్కడ నుంచి వస్తుంది? పిపిఏల్లో లేని అవినీతి ఎక్కడ నుండి వెతికితీస్తారు?’’ అంటూ లోకేష్ ట్వీటారు. లోకేష్ బాబు ట్వీట్లు కూడా అచ్చమయిన తెలుగులో, నుడికారాలు, సామెతలు, వెటకారాలతో రక్తికడుతున్నాయి. అయితే, చినబాబు క్షేత్రస్థాయిలోకి వెళ్లకుండా ట్వీట్లతో సరిపెట్టడంపై టీడీపీ నేతల నుంచి, కార్యకర్తల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.

టీడీపీ భవిష్యత్తుపై ఆందోళనతో ఉన్న నేతలు, పదవుల కోసం ఐదేళ్ళు వేచి చూసిన ఆశావహులు, కార్యకర్తలు ఎన్నికల్లో ఓటమి పాలవడంతో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ వలలో పడుతున్నారు. బీజేపీ నేతలు ...టీడీపీ వారిని తమ పార్టీలో చేర్చుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈనేపథ్యంలో నేతలతో ముఖాముఖి ద్వారా వారిలో మనోస్థైర్యాన్ని నింపే పని ఏ కోశాన చేయడంలేదు. అటు చంద్రబాబునాయుడు, ఇటు లోకేష్ ఆ దిశగా ఆలోచించడంలేదు. 

ఇదిలా ఉంటే.. క్రమశిక్షణ‌కు మారుపేరుగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీ నేత‌లు ర‌చ్చకెక్కడం హాట్ టాపిక్ అవుతోంది. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శలు చేసుకుంటూ ఒక‌రి చ‌రిత్రలు ఒక‌రు ట్విట్టర్ వేదికగా బ‌య‌ట‌పెట్టుకుంటున్నారు. తిట్ల దండ‌కాన్ని ట్విట్టర్ పేజీలలో రాసుకుంటూ పార్టీ ప‌రువును కూడా బ‌జారుకీడుస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు లోలోన ఉన్న విభేదాలు ఇప్పుడు అధికారం కోల్పోగానే బ‌య‌ట‌ప‌డుతున్నాయి. మొత్తం లోకేష్ ట్విట్టర్ వార్ టీడీపీకి ఎంతవరకూ పనికొస్తుందో చూడాలి. 

ట్వీట్లతో లోకేష్ లోని లోపాలు. అచ్చుతప్పులు బయటకు రావడంలేదని, లోకేష్ కామెడీని యూట్యూబ్లో వీడియోల రూపంలో తయారుచేసేవారికి పనిలేకుండా పోతోందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. 

స్క్రిప్ట్ మారింది.. వెటకారం అదిరింది


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle