newssting
BITING NEWS :
*జపాన్ టీంని ఓడించిన ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం *ప్రత్యేక హోదాపై తేల్చేసిన కేంద్రం... దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం లేదన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్*బీహార్ లో మెదడువాపు వ్యాధికి బలమయిన 152 మంది చిన్నారులు *ప్రజావేదికను కూల్చేయండి.. సీఎం జగన్ ఆదేశం*కొనసాగుతున్న ఏపీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్*అఫ్గాన్‌పై బంగ్లా ఘనవిజయం

ఉత్తరాంధ్ర ఎంపీ అభ్యర్ధులు వీరేనా?

07-03-201907-03-2019 07:26:03 IST
2019-03-07T01:56:03.972Z07-03-2019 2019-03-07T01:49:46.539Z - - 26-06-2019

ఉత్తరాంధ్ర ఎంపీ అభ్యర్ధులు వీరేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉత్తరాంధ్ర ఎంపీల జాబితా దాదాపుగా సిద్ధమైంది. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలు చాలా జాగ్రత్తగా అభ్యర్ధుల ఎంపిక చేశారు. ఉత్తరాంధ్రలో కీలక లోక్‌సభ స్థానం అరకు. ఎస్టీ రిజర్వుడ్ అయిన ఈ సీటులో ఈసారి టిక్కెట్ల కోసం ప్రధాన పార్టీల్లో తీవ్ర పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో ఈ అరకు లోక్‌సభ సీటు నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి కొత్తపల్లి గీత 91వేల 398 మెజార్టీతో గెలిచారు. కానీ ఆ తర్వాత చంద్రబాబు రాజకీయంతో టీడీపీలో చేరారు. అయితే కొన్నాళ్లుగా టీడీపీకి దూరంగా ఉంటున్నారు.

టీడీపీ, వైసీపీల్లో కులాల వారీగా ప్రాధాన్యత ఉందని ఆరోపించిన కొత్తపల్లి గీత... సొంతంగా ‘జన జాగృతి’ పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచే పోటీ చేస్తానని తెలిపారు. ఇక అధికార తెలుగుదేశం పార్టీకి కొద్ది రోజుల క్రితం కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కిషోర్ చంద్రదేవ్ చేరికతో టెన్షన్ తీరింది. కిషోర్ చంద్రదేవ్‌నే అరకు లోక్‌సభ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దింపాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. 

ఇక వైసీపీ విషయానికొస్తే... కురుపాం ఎంఎల్ఏ పుష్పశ్రీవాణి భర్త శత్రుచర్ల పరీక్షిత్ రాజును బరిలో దింపుతున్నారు జగన్మోహన్ రెడ్డి. అరకు పార్లమెంట్ సమన్వయకర్తగా ఉన్న పరీక్షిత్ రాజు అయితేనే కిశోర్ చంద్రదేవ్‌ని  ఢీకొట్ట గలరని జగన్ నమ్ముతున్నారు.

దీంతో శత్రుచర్ల పరీక్షిత్ రాజుకు వైసీపీ టిక్కెట్ ఖరారు అయినట్లే. ఇక శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు మరోసారి పోటీ చేస్తున్నారు. ఈయనకే టిక్కెట్ ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఇక వైసీపీ విషయానికొస్తే... గత ఎన్నికల్లో పోటీ చేసిన రెడ్డి శాంతి, ఈసారి కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే మాజీ ఎంపీ కిల్లి కృపారాణి, కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలో చేరడంతో రెడ్డి శాంతికి పోటీ ఏర్పడింది. అయితే కిల్లి కృపారాణికే టిక్కెట్ ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అటు విజయనగరం ఎంపీ సీటు విషయానికొస్తే... గత ఎన్నికల్లో ఇక్కడ పూసపాటి అశోక్ గజపతి రాజు భారీ మెజార్టీతో గెలిచారు. ఆయనే ఈసారి కూడా పోటీ చేస్తారని చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే తాను ఎంఎల్ఏగా పోటీ చేస్తాననీ... ఎంపీ టిక్కెట్ తన పెద్ద కుమార్తె అతిథి గజపతిరాజుకు ఇవ్వాల్సిందిగా అడుగుతున్నారు అశోక్ గజపతి రాజు. అంటే వీరిద్దరిలో ఒకరికి టిక్కెట్ ఖాయం. అటు వైసీపీ విషయానికొస్తే... బొత్స సత్యనారాయణను ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపాలని ఆ పార్టీ అధినేత జగన్ భావిస్తున్నారు.

అయితే తన సతీమణి బొత్స ఝాన్సీని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని సత్యనారాయణ కోరుతున్నారు. అంటే... వీరిద్దరిలో ఒకరికి టిక్కెట్ ఖాయమని తేలిపోయింది. ఇక 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా విశాఖపట్నం ఎంపీ టిక్కెట్ బీజేపీకి కేటాయించారు చంద్రబాబు. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన కంభంపాటి హరిబాబు, వైసీపీ అభ్యర్థి వై.ఎస్. విజయమ్మ మీద భారీ మెజార్టీతో గెలిచారు.

ఇప్పుడు బీజేపీతో పొత్తు బెడిసి కొట్టడంతో కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నారు చంద్రబాబు. అటు వైసీపీ నుంచి టిక్కెట్ల కోసం పోటీ నెలకొంది. మొదట్లో విశాఖలోని ప్రముఖ బిల్డర్ ఎం.వీ.వీ. సత్యనారాయణకు టిక్కెట్ ఖాయమన్న వార్తలు వచ్చాయి. అయితే విజయసాయిరెడ్డి మేనల్లుడి పేరు కూడా వినిపిస్తోంది. 

అంటే ఈ సీటు మీద వైసీపీలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇక మొన్నటి ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన అవంతి శ్రీనివాస్... వైసీపీలో చేరారు. దీంతో అక్కడ టీడీపీకి గట్టి అభ్యర్థి కావాల్సి వచ్చింది. బిగ్ బాస్ షో విజేత కౌశల్ పేరు పరిశీలనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఓ దశలో ఆయనకే టిక్కెట్ ఖరారు అయినట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే కౌశల్ మీద తాజాగా వస్తోన్న ఆరోపణలతో... చంద్రబాబు పునరాలోచనలో పడినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 

మరోవైపు అనకాపల్లి ఎంపీ టిక్కెట్ కోసం యలమంచిలి ఎంఎల్ఏ పంచకర్ల రమేష్ బాబు, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక వైసీపీ విషయానికొస్తే... అనకాపల్లి ఎంపీ సీటు నుంచి అవంతి శ్రీనివాస్ పేరు ఖరారు చేయాలని జగన్ భావించారు. అయితే అవంతి శ్రీనివాస్ భీమిలి అసెంబ్లీ సీటు కోరడంతో... అనకాపల్లి ఎంపీ సీటు విషయంలో వైసీపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ముఖ్యంగా ఈ టిక్కెట్ కోసం అనకాపల్లి పార్లమెంట్ కన్వీనర్  వరుదు కల్యాణి, శరగడం చిన్నఅప్పలనాయుడు పోటీపడుతున్నారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle