newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

ఉత్తరాంధ్ర ఉరుముతోంది..!

25-02-201925-02-2019 14:56:05 IST
2019-02-25T09:26:05.723Z25-02-2019 2019-02-25T09:26:03.241Z - - 25-02-2020

ఉత్తరాంధ్ర ఉరుముతోంది..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కీలకమయిన ఎన్నికల సీజన్ వచ్చేసింది. వివిధ రాజకీయ పార్టీలతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా కొంతమంది నేతలు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత రాజ‌కీయాల ట్రెండ్‌పై వారి ప్రభావం స్పష్టంగా క‌నిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్నవారు కూడా ఇప్పుడు వివిధ ఉద్యమాల పేరుతో దగ్గరవుతున్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై సమగ్ర పరిశీలన కోసం ‘ఉత్తరాంధ్ర చర్చా వేదిక’ ఉద్యమ కార్యాచరణ ప్రారంభించింది. అందులో భాగంగా మేధావులతో ఫెడరేషన్ ఏర్పాటు చేశారు కన్వీనర్, మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ. 

మాజీ వైస్ ఛాన్సరల్ ప్రొఫెసర్ కెఎస్ చలం కన్వీనర్‌గా మాజీ వీసీలు కేవీ రమణ, ముత్యాల నాయుడు, ఇరిగేషన్ నిపుణుడు సత్యనారాయణ, మాజీ ఎంపీ డాక్టర్ డీవీజీ శంకరరావు సభ్యులుగా ఈ ఆరుగురు సభ్యుల కమిటీ వివిధ అంశాలపై అధ్యయనం చేయనుంది. విద్య,వైద్యం, నిధులు, నీరు, ఉపాధి, సాగు, వసతి, యువతకు ఉపాధి తదితర అంశాల్లో కోర్ గ్రూపులతో ఈ కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటించి మార్చి 3వ తేదీ నాటికి సమగ్ర నివేదిక సిద్ధం చేస్తుంది.

నివేదికపై మరోసారి చర్చించి మార్చి 10వతేదీన ఉత్తరాంధ్ర డిక్లరేషన్ ప్రకటించనున్నట్టు కొణతాల తెలిపారు. కమిటీ నివేదికలో ప్రధానంగా అభివృద్ధి, రాజకీయ ప్రణాళికలు ఉంటాయి. కమిటీ నివేదికను అన్ని రాజకీయ పార్టీలకు అందజేసి, వారి ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచి అధికారంలోకి వచ్చిన తక్షణం అమలు పరిచేలా ఒత్తిడి తేనున్నారు. 

కొణతాల డిమాండ్ చేశారు. షెడ్యూలు కులాలు, తెగుల, గిరిజనులు, మత్స్యకారులకు ఉపాధి కల్పించడంతోపాటు వారి అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వేదిక కోరింది. వెనుకబడిన ఉత్తరాంధ్రకు బుందేల్‌ఖండ్ తరహాలో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ అమలు చేయాలని కొణతాల డిమాండ్ చేశారు. కేంద్రం అధ్యయనం చేసి దేశంలో 115 అత్యంత వెనుకబడిన జిల్లాలను గుర్తిస్తే వీటిలో రెండు ఉత్తరాంధ్ర జిల్లాలు ఉన్నాయని గుర్తు చేశారు. వీటిన్నింటినీ సాధించేందుకు ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు.

మాజీ ఎంపీ డీవీజీ శంకరరావు మాట్లాడుతూ అపార వనరులున్న ఉత్తరాంధ్ర ఉత్తమాంధ్రగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నప్పటికీ ఉత్త ఆంధ్రగానే మిగిలి పోతోందన్నారు. బుందేల్ ఖండ్‌కు ప్రత్యేక ప్యాకేజీ కింద తలసరి రూ.6,500 వెచ్చిస్తున్న కేంద్రం, ఉత్తరాంధ్ర విషయంలో రూ.413 వెచ్చిస్తూ తీరని అన్యాయం చేస్తోందన్నారు. 

ఉత్తరాంధ్ర చర్చా వేదిక ప్రధాన డిమాండ్లు: 

* దశాబ్ధాలుగా ఉత్తరాంధ్ర తీవ్ర అన్యాయానికి గురవుతోంది. 130 నుంచి 135 టీఎంసీల నీటి వాటా ఉన్నప్పటికీ కేవలం 30 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగం.

* రాష్ట బడ్జెట్లో 10 నుంచి 15 శాతం గ్రాంట్లు ఉత్తరాంధ్రకు కేటాయించాలి.

* ఉత్తరాంధ్ర పారిశ్రామిక రంగంలో స్థానికులకు తీరని అన్యాయం జరుగుతోంది. స్థానికులకు 85 శాతం ఉద్యోగావకాశాలు కల్పించాలి. 

*విశాఖపట్నంలో తక్షణం రైల్వే జోన్ ఏర్పాటుచేయాలి.

*విశాఖలోని విమ్స్ స్థాయిని ఎయిమ్స్ స్థాయికి పెంచాలి.

*గిరిజన ప్రాంతాల్లో సహజవనరుల దోపిడీని ఆపాలి. పర్యావరణాన్ని పరిరక్షించాలి.

*విశాఖలో మెట్రోరైలు పనులు వెంటనే ప్రారంభించాలి.

*ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని వేగంగా పూర్తిచేయడానికి 5వేల కోట్లు కేటాయించాలి.

*వంశధార, ఝంఝావతి, బహుదా నదులపై ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలి.

*భావనపాడు, నక్కపల్లి పోర్టులను శాటిలైట్ పోర్టులుగా అభివృద్ధి చేయాలి. 

* ప్రత్యేక హోదా అమలుచేసి వివిధ పరిశ్రమలకు పన్నుల రాయితీ ప్రకటించాలి.

*పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు తక్షణం ఎక్స్ గ్రేషియా అందచేయాలి. 

* ఉత్తరాంధ్రలో గిరిజన వర్శిటీ ఏర్పాటుచేయాలి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle