newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

ఉత్తరాంధ్రలో సెంటిమెంట్ రగిల్చే పనిలో స్పీకర్ తమ్మినేని!

11-01-202011-01-2020 12:43:09 IST
2020-01-11T07:13:09.760Z11-01-2020 2020-01-11T07:13:04.322Z - - 15-08-2020

ఉత్తరాంధ్రలో సెంటిమెంట్ రగిల్చే పనిలో స్పీకర్ తమ్మినేని!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స్పీకర్ అంటే రాజ్యాంగబద్ధ పదవిఅని.. ఆ స్థానంలో కూర్చున్న వాళ్ళు రాష్ట్రంలో ప్రభుత్వం-ప్రతిపక్షం అన్న తేడా లేకుండా అందరినీ సమానంగా చూడాలన్న కొలమానం ఎప్పుడో పోయింది. ఇప్పుడొచ్చే స్పీకర్లంతా ఏ ఎండకి ఆ గొడుగులు పట్టే వాళ్లేనని ప్రజలు కూడా ఫిక్స్ అయిపోయారు. అయితే ఏపీ ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాం మాత్రం తానూ స్పీకర్నే కానీ అందరిలా కాదు డిఫరెంట్ అని చెప్పేశారు.

ఇంకా సూటిగా చెప్పాలంటే నేను స్పీకర్నే కానీ ముందు వైసీపీ ఎమ్మెల్యేని.. ఆ పార్టీ మనిషిని అని.. అవసరమైతే ఫక్తు రాజకీయమే చేస్తానని చెప్పేశారు. ఇక ఆయన నోటికి అప్పుడప్పుడు వచ్చే బూతు పురాణాలు కూడా ఏపీ ప్రజలు ఈమధ్యనే వినేశారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఇంకాస్త దగ్గరగా ఆయన బూతు పంచాంగాన్ని విని ఈయనెక్కడి స్పీకర్ అండి బాబు గొణుక్కున్నారు.

ఇక ఇప్పుడు రాజధాని విషయానికి వస్తే విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుకి ఏర్పాట్లు జరిగిపోతున్నాయని సచివాలయ పరిసరాలలో హడావుడిని చూస్తేనే అర్ధమైపోతుంది. అక్కడకి వెళ్లేందుకు ఉద్యోగులు ఇష్టంగా లేకపోవడంతో ప్రభుత్వం వారికీ ఇళ్ల స్థలాలు, పాతిక లక్షల ఋణం వంటి బంపర్ ఆఫర్లు కూడా ప్రకటించేసింది. జనవరి నెలాఖరుకి తరలింపు పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

మరోపక్క రాజధాని ప్రాంతంలో నిరసనలు, ఆందోళనలు రోజురోజుకూ ఉదృతంగా మారిపోతున్నాయి. పోలీసులు ఎక్కడిక్కడ అణచివేసే క్రమంలో నీచంగా ప్రవర్తిస్తున్నా అక్కడి ప్రజలు ఇంకా రెచ్చిపోతున్నారు. అమరావతిలో ఇంతగా పరిస్థితులు ఆందోళనకరంగా మారినా ఉత్తరాంధ్రలో రాజధాని తమదే అనే భావన కానీ.. రాజధాని తమకి రావాలనే డిమాండ్లు కూడా అక్కడి నుండి వినిపించడం లేదు.

ఈక్రమంలో వైసీపీ ఉత్తరాంధ్ర ప్రజలలో సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నాలను మొదలుపెట్టినట్లుగా చెప్పుకుంటున్నారు. అయితే అక్కడ నేతలుగా ఉన్న వాళ్లలో మంత్రి బొత్స లాంటి వాళ్ళు రాజధానిలో ప్రజలను అణచివేసి కార్యక్రమంలో బిజీగా ఉండడంతో ఉత్తరాంధ్ర ప్రజలను ఉద్ధరించే నేతలు కరువయ్యారు. ఆ బాధ్యతను స్పీకర్ స్వయంగా తీసుకొని రంగంలోకి దిగారని చెప్తున్నారు.

ఈక్రమంలో తమ్మినేని ఉత్తరాంధ్రలో రోజుకో చోట మాజీ సీఎం చంద్రబాబుని విలన్ను చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ఆకలితో అలమటిస్తుందని జగన్ అన్నం పెట్టాలని చూస్తూంటే.. చంద్రబాబు తన్నేస్తున్నాడని.. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలవి ఒక బతుకులేనా.. చంద్రబాబు ఓ మనిషా అంటూ అక్కడ రెచ్చగొట్టి చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే విశాఖ ఎప్పుడో అభివృద్ధి చెందిన నగరం కాగా తమ్మినేని కూడా దశాబ్దాల క్రితమే రాజకీయాలలో ఉన్నారు. మరి అప్పటి నుండి ఉత్తరాంధ్ర ప్రజల ఆకలి తెలియలేదా? విశాఖలో అభివృద్ధి లేక ఉత్తరాంధ్ర ప్రజలు ఆకలి తీరలేదా? ఇప్పుడు రాజధానితో అభివృద్ధి జరిగితే ఉత్తరాంధ్ర ప్రజల ఆకలి తీరుతుందా? నాలుగు అద్దె భవనాలలో రాజధాని ఆకలి తీరుస్తుందా? అని టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle