newssting
BITING NEWS :
*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

ఉండ‌వ‌ల్లి హెచ్చ‌రిక‌లు సీరియ‌స్‌గా తీసుకుంటారా..?

02-10-201902-10-2019 09:09:38 IST
2019-10-02T03:39:38.547Z02-10-2019 2019-10-02T03:39:29.815Z - - 15-12-2019

ఉండ‌వ‌ల్లి హెచ్చ‌రిక‌లు సీరియ‌స్‌గా తీసుకుంటారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌రిపాల‌న‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ పాల‌నపై మొద‌టిసారి స్పందించిన ఆయ‌న జ‌గ‌న్‌కు సునిశిత హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

జాగ్ర‌త్త‌గా ఉండ‌క‌పోతే ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని స్ప‌ష్టం చేశారు. జ‌గ‌న్ పాల‌న బాగుంద‌ని, విమ‌ర్శించేంత త‌ప్పులు పాల‌న‌లో లేవ‌ని చెబుతూనే కొన్ని జాగ్ర‌త్త‌లు చెప్పారు.

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ అత్యంత స‌న్నిహితంగా ఉండే వ్య‌క్తి. ఇప్ప‌టికే వైఎస్ కుటుంబంపై ఆయ‌న అభిమానంతో ఉంటారు. అయితే, రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు.

చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడు బాబు పాల‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పించేవారు. ఇన్‌డైరెక్ట్‌గా జ‌గ‌న్‌కు మేలు చేసేలా ఆయ‌న మాట‌లు ఉండేవి.

ఇక‌, జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఆయ‌న పాల‌న‌పై ఉండ‌వ‌ల్లి ఎటువంటి కామెంట్స్ చేయ‌లేదు. దీంతో టీడీపీ నేత‌లు ఆయ‌న వైఖ‌రిని విమ‌ర్శిస్తుండ‌గా ఎట్ట‌కేల‌కు మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాముందుకొచ్చారు. ముఖ్యంగా ఆయ‌న రెండు విష‌యాల్లో జ‌గ‌న్‌కు హెచ్చ‌రిక చేశారు. అందులో ఒక‌టి విద్యుత్ కోత‌లు కాగా, రెండోది ఎమ్మెల్యేల్లో అసంతృప్తి.

జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక ఆయ‌న పాల‌న‌పై ప్ర‌జ‌ల్లొ విద్యుత్ కోత‌ల ప‌ట్ల ఎక్కువ‌గా అసంతృప్తి ఉంద‌ని ఉండ‌వ‌ల్లి చెప్పారు. విద్యుత్ కోత‌ల‌కు కార‌ణం చంద్ర‌బాబు లేదా ఇంకెవ‌రో అని చెబితే ప్ర‌జ‌లు ప‌ట్టించుకోర‌ని, అంతిమంగా త‌మ‌కు విద్యుత్ కొత‌ల‌కు ప్ర‌స్తుత స‌ర్కార్‌నే బాధ్యులుగా ప్ర‌జ‌లు చూస్తార‌ని చెప్పారు.

నిజంగా కూడా విద్యుత్ కోత‌ల ప‌ట్ల ఏపీ ప్ర‌జ‌ల్లో కొంత అసంతృప్తి ఉంది. చంద్ర‌బాబు హ‌యాంలో ఏ ర‌కంగానో విద్యుత్ కోత‌లు లేకుండా చూసుకున్నారు. జ‌గ‌న్ మాత్రం ఆ ప‌ని చేయ‌లేక‌పోతున్నారు.

ఇక‌, ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఇప్ప‌టివ‌ర‌కు ఎక్క‌డా క‌నిపించ‌క‌పోయినా ఉండ‌వ‌ల్లి ఈ అంశాన్ని లేవ‌నెత్తారు. గ‌తంలో పీవీ న‌ర‌సింహ‌రావు, ఎన్టీఆర్ భారీ మెజారిటీల‌తో అధికారంలోకి వ‌చ్చినా స్వంత వారే దింపేసిన విష‌యాన్ని గుర్తు చేశారు. కాబ‌ట్టి, ఎమ్మెల్యేల్లో అసంతృప్తి లేకుండా చూసుకోవాల‌ని జ‌గ‌న్‌కు సూచించారు. 151 మంది ఎమ్మెల్యేల‌తో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చారు.

అయితే, ఎమ్మెల్యేల‌కు ప్రాధాన్య‌త త‌గ్గింద‌ని, అధికారులు చెప్పిందే న‌డుస్తోంద‌నే భావ‌న ఏపీ రాజ‌కీయాల్లో నెల‌కొంది. ఇక‌, జ‌గ‌న్ సైతం ఎమ్మెల్యేల‌కు వారి నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్ధి విష‌యంలో చెప్పుకోవ‌డానికి ఇంత‌వ‌ర‌కూ స‌మ‌యం ఇవ్వ‌లేదు.

అయినా, ఎమ్మెల్యేలు ఎక్క‌డా అసంతృప్తిని వ్య‌క్తం చేయ‌డం లేదు. కానీ, ఈ విష‌య‌మై ఉండ‌వ‌ల్లికి ఏదో ఉప్పు అంది ఉంటుంద‌ని, అందుకే ఆయ‌న ఈ హెచ్చ‌రిక‌లు చేశార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

అంత లేద‌ని, కాద‌ని చెప్పుకున్నా ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ మాత్రం క‌చ్చితంగా వైఎస్ కుటుంబానికి, జ‌గ‌న్‌కు శ్రేయోభిలాషి. ఆయ‌న జ‌గ‌న్ మంచి కోరే వ్య‌క్తి అని ఆయ‌న వ్యాఖ్య‌లే చెబుతాయి. మ‌రి, ఉండ‌వ‌ల్లి వ్యాఖ్య‌ల‌ను జ‌గ‌న్ సీరియ‌స్‌గా తీసుకుంటారా లేదా అనేది చూడాలి.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle