newssting
BITING NEWS :
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై అన్నాడీఎంకేలో అసంతృప్తులు. సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం ఎవరికివారు నేనంటే నేనే అంటూ వాదులాడుకునే స్థాయికి చేరిన వివాదం. వివాదానికి తెరదించేలా అక్టోబరు 7న అధికారిక ప్రకటిన చేయనున్నట్లు స్పష్టం చేసిన పార్టీ * కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టం బిల్లు ఆమోదాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన కేరళకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ టీఎన్‌ ప్రతాపన్‌. వ్యవసాయ రంగం అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని, కేం‍ద్రప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తోందని సుప్రీం పిటిషన్ లో పేర్కొన్న ఎంపీ. కేం‍ద్రప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మూడు చట్టాలు రాజ్యాంగ విరుద్దమని, చెల్లదని రద్దుచేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరిన ఎంపీ * అసోం మాజీ మహిళా ముఖ్యమంత్రి సైదా అన్వర తైమూర్ (84) అనారోగ్యంతో ఆస్ట్రేలియాలో కన్నుమూత. అసోం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా 4 దశాబ్దాల పాటు పనిచేసిన సైదా అన్వర తైమూర్. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సైదా అన్వర అసోం మొట్టమొదటి మహిళా సీఎం. గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో ఉన్న తన కుమారుడి వద్ద ఉంటున్న సైదా అన్వర తీవ్ర అనారోగ్యానికి గురై కన్నుమూత * బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి(61)కి కరోనా సోకిన సంగతి తెలిసిందే. హిమాలయాల పర్యటనలో ఉండగా స్వల్ప జ్వరం రావడంతో పరీక్షలు చేయగా పాజిటివ్‌ ఫలితాలు. రిషికేశ్‌ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరినట్లుగా ట్వీట్. తన డ్రైవర్‌కు పాజిటివ్‌ వచ్చిందని, అతడి ద్వారా వ్యాపించి ఉంటుందని ట్వీట్ లో వెల్లడించిన ఉమా భారతి * రైలు ప్రయాణికుల నెత్తిన చార్జీల భారం మోపేందుకు రైల్వే శాఖ కసరత్తులు. అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన రైల్వే స్టేషన్ల ప్రయాణికులపై చార్జీల మోత. ప్రయాణికుడు కొనుగోలు చేసే టికెట్ ధరను బట్టి పెరుగుదలకు అవకాశం. గరిష్ఠంగా రూ.35 నుండి కనిష్ఠంగా పది రూపాయల వరకు వసూలు చేయనున్న వినియోగ రుసుము* దేశవ్యాప్తంగా మొత్తం 7 వేల రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటిలో రద్దీగా ఉండే స్టేషన్లలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి వినియోగ రుసుమును వసూలు చేస్తామని రైల్వే శాఖ ఇది వరకే ప్రకటించింది. ఇలా అభివృద్ధి చేసిన స్టేషన్లు దాదాపు 1000 వరకు ఉన్నాయి. రైల్వే శాఖ ప్రతిపాదనకు కేంద్రం కనుక ఆమోద ముద్ర వేస్తే ఈ స్టేషన్లలోని ప్రయాణికుల జేబులకు చిల్లులు పడడం ఖాయం * నిర్మాణంలో ఉన్న ఓ భవనం ఆకస్మాత్తుగా కుప్పకూలడంతో ముగ్గురు దుర్మరణం. గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరంలో సోమవారం రాత్రి జరిగిన ఘటన. బావామాన్ పురా ప్రాంతంలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం. ఈ ఘటనలో అక్కడికక్కడే మరణించిన ముగ్గురు వ్యక్తులు. కరోనా బారిన పడ్డ ఒడిశా డిప్యూటీ స్పీకర్ రజనీకాంత్ సింగ్‌తోపాటు 11 మంది ఎమ్మెల్యేలు. నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, పాత్రికేయులకు ప్రత్యేకంగా కరోనా పరీక్షలు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్, 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకినట్టు నిర్ధారణ * ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి అధికంగా సాగుతున్న వరద నీటి ప్రవాహం. జలాశయం 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల చేస్తున్న అధికారులు. జలాశయం ఇన్ ఫ్లో 2,05,017 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 3,06,819 క్యూసెక్కులు. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. 883.90 అడుగులకు చేరిన ప్రస్తుతం నీటి మట్టం * తమ భూములకు సరైన నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు కృష్ణంరాజు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ విస్తరణలో తమ భూమికి సరైన నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్ దాఖలు. పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు * దేశంలో సోమవారం నుండి ప్రారంభమైన వాయువ్య భారతం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌, బికనీర్‌ల నుంచి ఈనెల 17నే ఉపసంహరణ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈసారి 11 రోజులు ఆలస్యం. ఏపీ నుంచి అక్టోబరు 15న రుతుపవనాలు నిష్క్రమిస్తాయని అంచనా. కాగా, దక్షిణ ఏపీలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. దీని ప్రభావంతో రాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం * నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం. 18 క్రస్టు గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 3,10,631 క్యూసెక్కులు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 309.6546 టీఎంసీలుగా నమోదు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుత నీటిమట్టం 589.20 అడుగులకు చేరిక * మూసీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం అధికంగా ఉండటంతో 2 గేట్ల నుంచి నీటి విడుదల చేస్తున్న అధికారులు. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 645 అడుగులు(4.46టీఎంసీలు) కాగా 644 అడుగుల(4.20టీఎంసీలు)కు చేరిన ప్రస్తుత నీటి మట్టం. అలాగే ఇన్ ఫ్లో 4,505 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3,978 క్యూసెక్కులుగా నమోదు * కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు లంచం కేసులో అరెస్టయిన ముగ్గురు సహనిందితులకు ఏసీపీ ప్రత్యేక కోర్టు బెయిల్‌ మంజూరు. చేసింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి శ్రీనాథ్‌యాదవ్‌, మధ్యవర్తి అంజిరెడ్డి, వీఆర్‌ఏ సాయిరాజ్‌కు బెయిల్‌

ఈ 3 లక్షణాలు ఉంటే ఆసుపత్రికి పోవలసిందే.. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

10-08-202010-08-2020 16:55:04 IST
2020-08-10T11:25:04.766Z10-08-2020 2020-08-10T11:25:01.676Z - - 30-09-2020

ఈ 3 లక్షణాలు ఉంటే ఆసుపత్రికి పోవలసిందే.. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత కంటే మరణాల రేటు తగ్గింపుమీదే ప్రస్తుతం ఎక్కువగా దృష్టి పెడుతున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా.కేఎస్‌ జవహర్‌రెడ్డి అన్నారు. మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చేయాల్సిన అన్ని చర్యలూ చేపట్టిందని.. ఇక ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలే ఎక్కువగా ఉన్నాయని ఆయన మీడియాతో అన్నారు.

అంతేకాకుండా, కరోనా లక్షణాలున్నాయని అనుమానం వచ్చిన వెంటనే అందరూ ఆసుపత్రులకు రావలసిన అవసరం లేదని కొన్ని లక్షణాలు బయటపడినవారు మాత్రమే తప్పకుండా ఆసుపత్రులకు రావాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన సెక్రటరీ సూచించారు.

వరుసగా మూడు లేదా నాలుగు రోజుల పాటు జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తంలో ఆక్సిజన్‌ శాతం 94 కంటే తగ్గిపోతే నేరుగా ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందొచ్చు. ఇలాంటి లక్షణాలున్న వారికి పరీక్షలు లేకుండానే ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించినట్లు జవహర్ రెడ్డి చెప్పారు.

కరోనా వైరస్‌కు సంబంధించిన ఈ మూడు ప్రధాన లక్షణాలుంటే నిర్ధారణ పరీక్షలు కూడా అవసరంలేదని, నేరుగా ఆస్పత్రికి వెళ్తే చేర్చుకుంటారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా.కేఎస్‌ జవహర్‌రెడ్డి అన్నారు. మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చేయాల్సిన అన్ని చర్యలూ చేపట్టిందని.. ఇక ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలే ఎక్కువగా ఉన్నాయని శనివారం ఆయన మీడియాతో అన్నారు.

అన్‌లాక్‌ తర్వాత పాజిటివిటీ రేటు పెరిగింది. ఇప్పుడు కేసులు కాదు మరణాల నియంత్రణే మనముందున్న కర్తవ్యం. ప్రస్తుతం నాలుగు జిల్లాల్లో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉంది. మరికొన్ని జిల్లాల్లో ఈ స్థాయికి రాబోతోంది. ప్రజలు రక్షణ చర్యలు విధిగా పాటించాలన్నారు.

మరణాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. కనీసం ఆరు రోజులు ఆస్పత్రిలో ఉండాలి. రెమ్‌డెసివిర్, తోసిజుమాంబ్‌ వంటి మందులు వాడాలి. బెడ్‌ మీద మరణాలు సంభవించకూడదని కలెక్టర్లకు ఆదేశాలిచ్చామన్నారు.

ఈనెల 12 వరకూ నాలుగు జిల్లాల్లో సీరో–సర్వైలెన్స్‌ జరుగుతోంది. దీన్నిబట్టి ఏపీలో యాంటీబాడీస్‌ స్థాయి ఎంత పెరిగాయి.. ఎంతమందికి వైరస్‌ వచ్చి పోయిందో తెలుస్తుంది. ఈ ఫలితాలను బట్టి తదుపరి వ్యూహం అమలుచేస్తాం. 104, 14410, జిల్లాల్లో ఉన్న కాల్‌సెంటర్‌ నంబర్లను ఉపయోగించుకోవాలని జవహర్ రెడ్డి చెప్పారు.

బీజేపీదీ విస్తరణ కాంక్షే!

బీజేపీదీ విస్తరణ కాంక్షే!

   7 hours ago


దంచి కొడుతున్న వానలతో నిండు కుండలా తెలంగాణ.. పదేళ్ల రికార్డు బద్దలు

దంచి కొడుతున్న వానలతో నిండు కుండలా తెలంగాణ.. పదేళ్ల రికార్డు బద్దలు

   8 hours ago


ఏడాదిలో పీజీ, డిగ్రీ త‌ర్వాత పీహెచ్‌డీ... జ‌గ‌న్ దిశా నిర్దేశం

ఏడాదిలో పీజీ, డిగ్రీ త‌ర్వాత పీహెచ్‌డీ... జ‌గ‌న్ దిశా నిర్దేశం

   8 hours ago


ఏపీ బీజేపీ మౌన‌మెందుకు?.. వైసీపీ నేత‌ల‌కు అలుసైపోయారా?

ఏపీ బీజేపీ మౌన‌మెందుకు?.. వైసీపీ నేత‌ల‌కు అలుసైపోయారా?

   9 hours ago


ఏపీలో పాఠశాలలు తెరవడం.. ఇప్పట్లో లేనట్లేనా..!

ఏపీలో పాఠశాలలు తెరవడం.. ఇప్పట్లో లేనట్లేనా..!

   9 hours ago


దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల..!

దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల..!

   10 hours ago


శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గొన్న మ‌రో మంత్రికి క‌రోనా పాజిటివ్‌!

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గొన్న మ‌రో మంత్రికి క‌రోనా పాజిటివ్‌!

   10 hours ago


రూ. 70 కోట్ల బకాయిలు కట్టకపోతే ఆయిల్ బంద్.. టీఎస్ఆర్టీసీకి కొత్త చిక్కులు

రూ. 70 కోట్ల బకాయిలు కట్టకపోతే ఆయిల్ బంద్.. టీఎస్ఆర్టీసీకి కొత్త చిక్కులు

   11 hours ago


అశ్వ‌నీదత్‌, కృష్ణంరాజు ఏపీ ప్రభుత్వం పై న్యాయ పోరాటం...

అశ్వ‌నీదత్‌, కృష్ణంరాజు ఏపీ ప్రభుత్వం పై న్యాయ పోరాటం...

   11 hours ago


కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇష్టంలేదా?!

కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇష్టంలేదా?!

   12 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle