newssting
BITING NEWS :
* ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన.. గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్ గరం గరం *సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన శివసేన.. ఇవాళ విచారణ *సమ్మెపై హైకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటాం: అశ్వథ్థామరెడ్డి.*ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ అగ్రస్థానంలో కోహ్లీ, బుమ్రా *గురుగ్రామ్ లో తైక్వాండో క్రీడాకారిణి సరిత దారుణ హత్య *మిషన్ భగీరథ అవినీతిపై సీబీఐతో విచారణ జరపాలి : భట్టి విక్రమార్క*నా పెళ్లిళ్ల వల్లే జగన్ జైలుకెళ్లారా ? : పవన్*ఆర్టీసీ సమ్మెపై ఇవాళ హైకోర్టులో విచారణ *ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ

ఈ సలహాదారులు కాస్ట్లీ గురూ!!-2

29-10-201929-10-2019 16:02:59 IST
Updated On 29-10-2019 16:12:18 ISTUpdated On 29-10-20192019-10-29T10:32:59.507Z29-10-2019 2019-10-29T10:32:46.611Z - 2019-10-29T10:42:18.182Z - 29-10-2019

ఈ సలహాదారులు కాస్ట్లీ గురూ!!-2
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈ సలహాదారులు కాస్ట్లీ గురూ!!!

(మొదటి భాగం తరువాయి)

సలహాదారులుగా నియమిస్తే సరిపోదు. వారికి సకల సౌకర్యాలు కల్పించాలి. వీరి నియామకం వల్ల వ్యయం తడిసిమోపెడు అవుతుంది. ప్రభుత్వ సలహాదారుల్లో కొందరికి కేబినెట్ హోదా కల్పిస్తే వారికి ఎన్నో సదుపాయాలు కల్పించాలి. సరాసరి ఒక సలహాదారు వల్ల  ప్రభుత్వానికి 5 లక్షల వరకూ వ్యయం అవుతుంది. సలహాదారులకు జీతభత్యాలతో పాటు వివిధ రాయితీలు ఉంటాయి. సలహాదారుతో పాటు కుటుంబసభ్యులకు కూడా వైద్యసదుపాయం కల్పించాలి. ఇద్దరు పీఏలు, ఒక పర్సనల్ సెక్రటరీ ఉంటారు. 

కారు అలవెన్స్, డ్రైవర్ అలవెన్స్, అటెండర్లు, ఇంటి అద్దె అలవెన్స్ వంటి సదుపాయాలు ఉంటాయి. ఇవి కాకుండా రైల్వేలో ప్రయాణం చేస్తే సలహాదారుతో పాటు ఆయనతో పాటు మరో ఇద్దరికి సెకండ్ ఏసీ సదుపాయం ఉంటుంది. అదే రైలులో ఆయనతో పాటు ఒక వ్యక్తికి ఫస్ట్ క్లాస్ టికెట్ అందచేస్తారు. విమానాల్లో ప్రయాణం చేస్తే ఆరుగంటలకు లోపు ప్రయాణ సమయానికి ఎకానమీ టికెట్, ఆరుగంటలు దాటితే బిజినెస్ క్లాస్ టికెట్ అందచేస్తారు. ఇలా తడిసిమోసెడు  ఖర్చులుంటాయి. అసలే రివర్స్ టెండరింగ్ ల వల్ల వందల కోట్లు ఆదా అవుతున్నాయని చెబుతున్న ప్రభుత్వం .. ఇలా సలహాదారుల పేరుతో వందల కోట్లు ప్రజాధనం ఖర్చుచేయడం పట్ల  ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు. 

జగన్ ఈ సలహాదారుల నుంచి  ఏం సలహాలు తీసుకుంటున్నారు. వీరివల్ల ప్రజలకు కలుగుతున్న ప్రయోజనం ఏమిటనేది తేలాల్చి వుంది. మొహమాటానికి పోయి, గతంలో తనకు ఉపకారం చేశారని వీరికి ఉదారంగా, చేతికి ఎముకలు లేనట్టుగా పదవులు ఇచ్చుకుంటూ పోవడం ఎంతవరకూ సమంజసం. అడిగేవాడు లేడు కదాని తన మీడియా సంస్థలనుంచి వందలమందిని తీసుకువచ్చి.. ప్రభుత్వంలో పదవులు ఇచ్చుకుంటే పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

వీరివల్ల జగన్ కు, జగన్ వల్ల వీరికి పరస్పరం ప్రయోజనం కలగవచ్చు. కానీ దీర్ఘకాలంలో వీరివల్ల అదనపు ఖర్చుల భారం మోయాల్సింది ఆయనకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించిన ఏపీ జనానిదే. అసలే ఆర్థిక భారంతో కుంగిపోతున్న ఖజానాపై భారం మోపడమే అవుతుంది. సలహాదారుల విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరుని విపక్షాలు సైతం విమర్శిస్తున్నాయి. 

మూలిగే నక్కమీద తాటిపండు చందమే: బీజేపీ నేత లంకా దినకర్

ఏపీ ప్రభుత్వ సలహాదారులపై ఏపీ బీజేపీ తీవ్రంగా స్పందించింది. రూపాయి జీతం తీసుకుంటున్నానని చెప్పే సీఎం జగన్ ..తన హయాంలో రూ.3 నుంచి 4 లక్షలు సలహాదారులకు ఇవ్వడం అనుమానాలకు తావిస్తోందన్నారు ‘న్యూస్ స్టింగ్’ తో బీజేపీ నేత లంకా దినకర్. అతి ఎక్కువమంది సలహాదారులను వారి కుటుంబ మీడియా సంస్థ సాక్షి కట్టబెట్టడం ఈ అనుమానాలకు మరింత ఊతం ఇస్తోందన్నారు. ఇప్పటికే సివిల్ సర్వీసుల్లో నిష్ణాతులైన వారు శాఖలవారీగా సేవలు అందిస్తుంటే.. అదనపు సలహాదారుల పేరుతో  రాష్ట్ర ఆర్థికవనరులను స్వంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారనే సంకేతం ప్రజల్లోకి వెళుతోందన్నారు. 

ప్రాంతీయ పార్టీల్లో ఇటువంటి పోకడలు ఎక్కువగా ఉన్నాయని, గత ప్రభుత్వంలో కొంతవరకు అది కనిపిస్తే.. ఇప్పుడు ప్రస్తుతం పూర్తిస్థాయిలో ప్రభుత్వ వ్యవహారాలకు వారి స్వంత కుటుంబ కార్యకలాపాలుగా మార్చుకునే దుస్థితికి ఈ సంప్రదాయం దర్పణం పడుతోందన్నారు.

ఈ విధమయిన పోకడలు రాష్ట్ర ఖజానాపై మూలిగేనక్కమీద తాటిపండు పడిన చందమే అన్నారు. దీనికి తోడు, రాష్ట్రానికి సంబంధం లేని అనేకమందికి లక్షలాది రూపాయల జీతభత్యాలతో సలహాదారుల రూపంలో అవకాశం కల్పించడం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దెబ్బతీసే ప్రమాదం స్పష్టంగా ఉందన్నారు. సలహాదారులిచ్చే సలహాలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు శరాఘాతం అవుతాయనే ఆందోళన వ్యక్తంచేశారు లంకా దినకర్.  

పదవులతో మీడియాకు సంకెళ్ళు: సీనియర్ జర్నలిస్ట్, మాజీ ఎడిటర్ కందుల రమేష్ 

ఏపీలో ఎన్నడూ లేనంతగా మీడియాకి చెందినవారిని సలహాదారులుగా నియమించారని, అది కూడా తన స్వంత మీడియా సంస్థ సాక్షి నుంచే తీసుకున్నారని ...మీడియాపై ఆంక్షలు కూడా ఇదే టైంలో పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు సీనియర్ పాత్రికేయులు, మాజీ ఎడిటర్ కందుల రమేష్. ఏపీలో ప్రభుత్వ సలహాదారుల వ్యవస్థపై ‘న్యూస్ స్టింగ్’తో ఆయన తన అభిప్రాయాలు పంచుకున్నారు.

జర్నలిస్టు సంఘాలకు చెందిన కీలక నాయకుడికి సలహాదారు పదవి ఇచ్చారని, అదే టైంలో ఏపీలో రెండు ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలపై ఆంక్షలు పెరిగినా దానిపై స్పందించడంలేదని, మునుపెన్నడూ లేని విధంగా మీడియాను నియంత్రించే పని సాగుతోందన్నారు రమేష్ కందుల. కేవలం మీడియాను తన చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు జగన్ ఈ పనిచేశారనిపిస్తోందన్నారు. 

నిజానికి తాను నియమించిన సలహాదారుల నుంచి జగన్ ఎలాంటి సలహాలు తీసుకుంటున్నారు, కీలకాంశాలపై వారితో చర్చిస్తున్నారా అనేది ఎవ్వరికీ తెలియదు. కేవలం పదవులు ఇవ్వడానికే వారిని ఎంపికచేసినట్టు అనిపిస్తోందన్నారు. అసలు సలహాదారులకు తెలియకుండానే ఆంక్షలు విధిస్తున్నట్టు ఉందన్నారు.

స్వంతమీడియా వారికే పదవులు ఇవ్వడం, వారిని గౌరవించడానికే అనే సంకేతం పంపారని, కానీ అంతర్లీనంగా మీడియాను నియంత్రించడానికి, జర్నలిస్టు సంఘాల నేతలను తమ అదుపులో ఉంచుకోవడానికే ఇలాంటివి జరుగుతున్నాయన్నారు. ఒక్కోసారి ఏపీ ప్రభుత్వం చర్యలను ఈ సలహాదారులు సమర్ధించడం దేనికి సంకేతమన్నారు. రాజకీయపార్టీలకు మీడియా వుండడం, మీడియా ప్రముఖులనే ప్రభుత్వం కీలక బాధ్యతల్లో నియమించడం వల్ల వారిని కాంప్రమైజ్ చేసినట్టే అన్నారు రమేష్ కందుల. సలహాదారులు పెరిగిపోవడం రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు అదనపు భారమే అన్నారు రమేష్ కందుల.  

ఇది కూడా చదవండి

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

   11 hours ago


చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

   12 hours ago


ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

   13 hours ago


ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

   13 hours ago


మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

   14 hours ago


పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

   14 hours ago


జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

   14 hours ago


న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

   15 hours ago


జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

   15 hours ago


అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

   16 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle