newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

ఈ సలహాదారులు కాస్ట్లీ గురూ!!!

29-10-201929-10-2019 16:02:57 IST
Updated On 29-10-2019 16:13:47 ISTUpdated On 29-10-20192019-10-29T10:32:57.311Z29-10-2019 2019-10-29T10:29:45.503Z - 2019-10-29T10:43:47.414Z - 29-10-2019

ఈ సలహాదారులు కాస్ట్లీ గురూ!!!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో అధికార పార్టీలో ఎమ్మెల్యేలూ ఎక్కువే... మంత్రులూ ఎక్కువే. అంతేకాదు సలహాదారులు కూడా ఎక్కువే. గతప్రభుత్వంతో పోలిస్తే సలహాదారులు చాలామంది ఉన్నారు. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక ఇంచుమించు ప్రతిరోజూ ఏదో ఒక నియామక ప్రకటనలే. అందులో ఖచ్చితంగా సలహాదారుల గురించిన ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుంది. 

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సలహాదారుల సంఖ్య డజనుకి పైగానే. వీరి నియామకం వల్ల ప్రజలకు ఒరిగే, కలిగే ప్రయోజనం ఏంటో జగన్ కే తెలియాలంటున్నారు విశ్లేషకులు. అభిమానం, విధేయత.. తాను ప్రతిపక్షనేతస్థాయినుంచి ప్రభుత్వాధినేత అయ్యేవరకూ తనకు సహకరించిన వారికి టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనుకోవాలేమో. 

రాష్ట్రంలో ఉన్న సలహాదారుల సంఖ్యను ఒకసారి పరిశీలిస్తే... జగన్ ఎంత ‘ఉదారంగా’ వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పరిపాలనరంగంలో పదవీ విరమణ చేసినవారు, వివిధ రంగాల్లో నిష్ణాతులు, పత్రికారంగానికి ముఖ్యంగా తన స్వంత మీడియా సంస్థల్లో పనిచేసిన వారికి ఉచితరీతిన పదవులు ఇచ్చేశారు.  ముఖ్యంగా సాక్షి ప్రింట్ మీడియా, టీవీలకు చెందినవారికి సలహాదారులు పదవులు ఇచ్చేశారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే జీవీడీ కృష్ణమోహన్ కు కీలక పదవి ఇచ్చారు. అడ్వైజర్ కమ్యూనికేషన్ గా నియమించారు. ఆయన జగన్ పాదయాత్రల్లో వెన్నంటి వున్నారు. ప్రముఖ దినపత్రిక ఈనాడునుంచి ఆయన సాక్షి మీడియా ప్రారంభమయ్యాక అక్కడికి వచ్చారు. 2011 మార్చి 12న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచే వైఎస్సార్ కుటుంబంలో జీవీడి కీలక భూమిక నిర్వహించారు. వైసీపీ  గొంతుకను మీడియాలో సూటిగా, ధైర్యంగా, నిక్కచ్చిగా వినిపించే వారు. ఆయన నియామాకాన్ని ఎవరూ ప్రశ్నించలేదు కానీ..తర్వాతర్వాత వివిధ విభాగాల్లో సలహాదారుల సంఖ్య పెరిగిపోయింది. 

ప్రస్తుతం ముఖ్యమంత్రి సలహాదారులుగా ఇద్దరు వ్యవహరిస్తున్నారు. గతంలో పదవీ విరమణ చేసిన అజేయకల్లాం సీఎం సలహాదారుగా తనదైన ముద్ర వేస్తున్నారు. అలాగే ఎం. శామ్యూల్ సీఎం సలహాదారుగా ఉన్నారు. అలాగే అడ్వైజర్ టు గవర్నమెంట్ (పబ్లిక్ వ్యవహారాలు)గా సాక్షి మీడియా వ్యవస్థాపకుల్లో ఒకరైన సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నారు. 

అడ్వైజర్ టు గవర్నమెంట్ (ఆర్థిక వనరుల సమీకరణ)కు వెంకట రమణి భాస్కర్, అడ్వైజర్ టు ఐటి, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ విభాగాలకు ఏకంగా ముగ్గురు సలహాదారులు ఉన్నారు. కె.రాజశేఖర్ రెడ్డి, శ్రీనాథ్  దేవిరెడ్డి,  జె.విద్యాసాగర్ రెడ్డిలను జగన్ నియమించుకున్నారు. వీరితో పాటు అడ్వైజర్ టు గవర్నమెంట్ (పారిశ్రామిక ప్రగతి) కి సలహాదారుగా కృష్ణ జివి.గిరి వ్యవహరిస్తున్నారు. అడ్వైజర్ టు గవర్నమెంట్ (పెట్టుబడుల ప్రోత్సాహం వ్యవహారాలు) పీటర్ టి హసన్ ను నియమించారు. 

ఇటీవల సాక్షి మీడియాలో కీలకంగా వ్యవహరించిన సీనియర్ పాత్రికేయులు, ప్రెస్ అకాడమీ మాజీ ఛైర్మన్, ఐజేయూ కీలక నేత దేవులపల్లి అమర్ కు కీలక పదవి అప్పగించారు. దేవులపల్లి అమర్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారుగా నియమించారు. అమర్ సీనియర్ పాత్రికేయుడిగా అందరికీ చిరపరిచితం.

1975 నుంచి ఆయన మీడియా రంగంలో ఉన్నారు.  సాక్షి మీడియాలో ఆయనది కీలక భూమిక. అలాగే సాక్షి దినపత్రికకు చెందిన కె.రామచంద్రమూర్తికి కూడా జగన్ కీలక పదవి అప్పగించారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పబ్లిక్ పాలసీ సలహాదారుగా నియమించారు. రామచంద్రమూర్తి నాలుగు దశాబ్దాలకు పైగా మీడియా రంగంలో ఉన్నారు. రామచంద్రమూర్తి, అమర్ తెలంగాణ ప్రాంతానికి చెందినవారు. వారికి ఏపీ గురించి అవగాహన ఉంది కాని. వీరి నియామకంపై విమర్శలు వస్తున్నాయి. వీరిద్దరు హైదరాబాద్ లోనే ఉండి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

మరో సీనియర్ జర్నలిస్ట్ అయిన అరవింద్ యాదవ్ ను ఢిల్లీలో ఏపీ భవన్ మీడియా వ్యవహారాల ఓఎస్డీగా నియమించింది ఏపీ ప్రభుత్వం. మీడియా రంగంలో 24 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న అరవింద్ యాదవ్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు మీడియా సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. జాతీయ మీడియా సంస్థలు ఆజ్ తక్, ఐబిఎన్ 7లో వివిధ హోదాల్లో పనిచేశారు. తెలుగులో రెండు ప్రముఖ ఛానల్స్ లో బాధ్యతలు నిర్వర్తించారు. (ఇంకా ఉంది)

ఈ సలహాదారులు కాస్ట్లీ గురూ!!-2

టీడీపీ కొత్త సవాల్.. సీఎంకు ఆ దేశాలకు వెళ్లే దమ్ముందా?

టీడీపీ కొత్త సవాల్.. సీఎంకు ఆ దేశాలకు వెళ్లే దమ్ముందా?

   10 hours ago


చంద్రబాబు భద్రతపై డీజీపీ వివరణ

చంద్రబాబు భద్రతపై డీజీపీ వివరణ

   12 hours ago


ఏపీలో ఠారెత్తిస్తున్న ఏసీబీ దాడులు..అధికారుల్లో వణుకు

ఏపీలో ఠారెత్తిస్తున్న ఏసీబీ దాడులు..అధికారుల్లో వణుకు

   12 hours ago


సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కేంద్ర-రాష్ట్ర మంత్రుల మాటల యుద్ధం!

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కేంద్ర-రాష్ట్ర మంత్రుల మాటల యుద్ధం!

   13 hours ago


నాదెండ్లదీ అదే దారా? పీకేకి షాక్ తప్పదా?

నాదెండ్లదీ అదే దారా? పీకేకి షాక్ తప్పదా?

   13 hours ago


కర్నూలుకు వెళ్లి చేసిందేంటి జగన్ గారూ!.. లోకేష్ రియాక్షన్

కర్నూలుకు వెళ్లి చేసిందేంటి జగన్ గారూ!.. లోకేష్ రియాక్షన్

   13 hours ago


‘‘ఇది రద్దులు, వేధింపుల ప్రభుత్వం’’

‘‘ఇది రద్దులు, వేధింపుల ప్రభుత్వం’’

   13 hours ago


తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉండటమే వివక్షా..  పీయూష్ గోయల్‌ ప్రశ్న

తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉండటమే వివక్షా.. పీయూష్ గోయల్‌ ప్రశ్న

   15 hours ago


నితీష్-బీజేపీ మైత్రిపై పీకే ఘాటు వ్యాఖ్యలు

నితీష్-బీజేపీ మైత్రిపై పీకే ఘాటు వ్యాఖ్యలు

   17 hours ago


జేడీ అవుతారా ఏపీ కేజ్రీవాల్‌..?

జేడీ అవుతారా ఏపీ కేజ్రీవాల్‌..?

   17 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle