newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

ఈ సంక్రాంతి వాళ్ళకు చీకటిమయమే !

19-12-201819-12-2018 19:01:48 IST
2018-12-19T13:31:48.146Z19-12-2018 2018-12-19T13:31:45.928Z - - 17-07-2019

ఈ సంక్రాంతి వాళ్ళకు చీకటిమయమే !
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

సంబరాల సంక్రాంతి వారికి ఈసారి రైతుల ఇళ్ళల్లో కనిపించదు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కళ్లారా చూసుకోవాల్సిన రైతులు కళ్ళ నీళ్ల పర్యంతం అవుతున్నారు. మొన్నటి తిత్లీ తుఫాను దెబ్బకు కుదేలైన రైతు ఇప్పుడు పెథాయ్ దెబ్బతో పూర్తిగా కృంగిపోయాడు. కోలుకోలేక సాయం కోసం చూస్తున్నాడు అన్నదాత. శ్రీకాకుళానికి చెందిన 69 ఏళ్ళ చిన్న రావు అనే రైతు తన పొలంలో నీళ్లు నిలిచిపోకుండా కట్టల్ని తెంపి సరిచేద్దామనుకుని అక్కడకు వెళ్ళాడు. వేసిన పైరు మొత్తం నీట మునిగిపోవడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. శ్రీకాకుళం జిల్లాలోని మెళియాపుట్టి మండలం కొసమాలలో ఈ సంఘటన జరిగింది. చేతికి అందాల్సిన పంట నీళ్లపాలు కావడంతో ఇప్పుడక్కడ అందరి పరిస్థితి ఇంచుమించు ఇంతే. తుఫాను బాధ తప్పినా ఎడతెగని భారీ వర్షాలతో పరిస్థితి అతలాకుతలమైంది. 

పెథాయ్ తుపాను రైతులకు భారీ నష్టాన్ని కలిగించింది. ఈ దెబ్బతో  రైతులు కోలుకోవడం కష్టమే అంటున్నారు. వరితో పాటు మొక్కజొన్న. చెరకు, మిరప, పత్తి, పొగాకు, పత్తి, కూరగాయలు, అపరాల పంటలు తీవ్రంగా నష్టపోయాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాల వల్ల ధాన్యం చాలా వరకు తడిసిపోయింది. తడిసిన బస్తాలను వేరే బస్తాల్లోకి మార్చి రవాణా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు రైతులు. పంట నష్టం 240 కోట్లు ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఏరియల్ సర్వే తరువాత ప్రకటించారు. కోస్తా రైతు కడగండ్లను కళ్లారా చూస్తున్నవారికి ఈ దృశ్యాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇదే ప్రాంతానికి చెందిన మరో రైతుకు ముగ్గురు పిల్లలు. వ్యవసాయం గిట్టుబాటుకాదంటూ ఊరును వదిలి సుదూర ప్రాంతాలకు వెళ్లిపోయారు. కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే 60 వేలకు పైగా పంట నష్టం జరిగింది. ఆ అన్నదాతల ఇళ్లలో సంక్రాంతి చీకటిమయమే. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle