newssting
BITING NEWS :
*జపాన్ టీంని ఓడించిన ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం *ప్రత్యేక హోదాపై తేల్చేసిన కేంద్రం... దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం లేదన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్*బీహార్ లో మెదడువాపు వ్యాధికి బలమయిన 152 మంది చిన్నారులు *ప్రజావేదికను కూల్చేయండి.. సీఎం జగన్ ఆదేశం*కొనసాగుతున్న ఏపీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్*అఫ్గాన్‌పై బంగ్లా ఘనవిజయం

ఈ లాజిక్‌తో జగన్ మేజిక్ చేస్తారా?

28-02-201928-02-2019 16:45:04 IST
Updated On 28-02-2019 16:57:25 ISTUpdated On 28-02-20192019-02-28T11:15:04.235Z28-02-2019 2019-02-28T11:15:00.941Z - 2019-02-28T11:27:25.943Z - 28-02-2019

ఈ లాజిక్‌తో జగన్ మేజిక్ చేస్తారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏ పార్టీ అయినా నాయకుడైనా తనకు ప్రజలు ఎందుకు ఓటెయ్యాలో ఒక లాజిక్ చెప్పాలి. చిన్న చిన్న ఎన్నికల్లో పెద్ద పెద్ద లాజిక్కులు అవసరం లేదు గానీ, పెద్ద ఎన్నికల్లో అది చాలా అవసరం. సర్పంచ్ గానో, కౌన్సిలర్‌గానో పోటీ చేసినప్పుడు పెద్ద పెద్ద లాజిక్కులు, వాగ్దానాలూ అవసరం ఉండవు. వార్డులో ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో ఉంటాననీ, పిలిస్తే పలుకుతాననీ, పిల్లిసమత్తాడినా హాజరవుతాననీ నచ్చచెప్పుకోగలిగితే, దానికి ఇంతో అంతో కులమూ, డబ్బూ, స్నేహమూ, కాస్తంత కలుపుగోలుతనమూ తోడైతే ఎలక్షన్‌లో ఒడ్డున పడిపోగలరు అభ్యర్ధులు.  

కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి ప్రజామోదాన్ని కోరుతున్నప్పుడు, దేశపాలన నాకు ఆప్పజెప్పండి అని జనం ముందుకు వచ్చినప్పుడు ఇవి సరిపోవు. రాష్ట్రానికి, దేశానికి ఏమిచెయ్యబోతున్నావు, తనను ఎన్నుకుంటే ఎటువంటి పాలన అందిస్తావు? వచ్చే పది పదిహేను సంవత్సరాలలో రాష్ట్రాన్ని, దేశాన్ని ఎటువైపుగా నడిపిస్తావు అనే విషయాలు ప్రజానీకం ముందు ఉంచడం అవసరం.

ఆ లాజిక్కు సరిగ్గా ఉంటే ఇక మిగతా విషయాలు తోడై ఎన్నికల ప్రచారం వేగం పుంజుకుంటుంది. మిగతా విషయాల వల్ల చేకూరిన వేగానికి ఈ లాజిక్కు తోడవకపోతే బండి ఎంతో దూరం నడవడం సాధ్యం కాదు. అలాగని కేవలం లాజిక్కు మాత్రమే ఉంటే సరిపోదు. లోక్ సత్తాను చూసాముగా! 

ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ పరిస్థితి చూస్తోంటే లాజిక్కు మిస్సయితే పార్టీ ఏమవుతుందో అర్ధమవుతుంది. 2014 ఓటమి నుంచి ఆ పార్టీ ఏమీ నేర్ఛుకోలేదన్నది చాలా స్పష్టంగా తెలుస్తోంది. 2012లో జరిగిన ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చాలా నియోజకవర్గాల్లో చావుదెబ్బ తిన్నది. కొన్నింటిల్లో డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఆ పార్టీ పని అయిపోయింది అని కొంతమంది రాజకీయ పండితులు తీర్మానంగా చెప్పేసారు. వైయస్సార్ కాంగ్రెస్ ఆ రోజుల్లో మాంచి ఊపు మీద ఉంది. అయ్యో తండ్రిని పోగొట్టుకున్న పిల్లాడు అని కొందరు, మా కులం అని కొందరు, యువకుడని కొందరు, పెద్దవాళ్ళందరూ వేధిస్తున్నారని మరికొందరూ జగన్ పార్టీకి ఆ ఎన్నికల్లో పట్టం కట్టారు.

2014 ఎన్నికలు సమీపించేవరకూ వైయస్సార్ పార్టీది పైచేయిగానే కనపడింది. దాదాపు అన్ని సర్వేలూ అదేమాట చెప్పాయి. పోలింగు తేదీ ఇంకో పదిహేను రోజులుందనగా గ్రాఫు మెల్లిగా పడడం ప్రారంభమయ్యింది. ముందున్న పైచేయిని చూసుకుని మురిసిపోయి పరిస్థితి చెయ్యిజారిపోతోందన్న విషయాన్ని ఆ పార్టీ నాయకత్వం గ్రహించలేకపోయింది. మద్దతు మంచులా కరిగిపోయింది. 

విభజించబడ్డ రాష్ట్రం, కష్టాల్లో ఉన్న రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని ఇక్కట్లలోనుంచి గట్టెక్కించగల శక్తి, సామర్ధ్యం, చతురత, దూరదృష్టి ఆ పార్టీ నాయకుడికి ఉన్నాయి అని అది నిరూపించలేకపోయింది. ప్రజలు ముఖ్యమంత్రి కావాలనుకున్నవాడి నుంచి ఏమి ఆశిస్తున్నారో పసిగట్టలేకపోయింది. 

2012లో ఏ కారణాలతో ఓటు వేసారో అవే కారణాలతో మళ్ళీ ఓటు వేస్తారనే భ్రమలో ఉండిపోయింది. దెబ్బతింది.చంద్రబాబుకి ‘పాపం పదేళ్ళు పదవిలేకుండా ఉన్నాడు’ అనే సానుభూతితో ఓట్లు రాలేదు. అనుభవం ఉంది, కార్యసాధకుడు, రాష్ట్రాన్ని ఇబ్బందులలోంచి గట్టెక్కిస్తాడని ఓట్లేసారు. అది నిజమా కాదా అనేది పక్కన పెడితే, ఆ వేళ ప్రజలు భావించినది అది. తెలుగుదేశం ప్రచారం చేసుకున్నది కూడా ముఖ్యంగా అదే. దాంతో జగన్ అవినీతిపరుడనీ, అరాచక శక్తులు విజృంభిస్తాయి అతను గెలిస్తే అని ఊరూవాడా టముకేసి మరీ చెప్పారు.   

రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ ను అతి దారుణంగా శిక్షించారు. కానీ ఆ విభజనకు ఒప్పుకుంటూ రాతపూర్వకంగా తన ఆమోదాన్ని తెలిపిన చంద్రబాబును, తెలుగుదేశం పార్టీనీ క్షమించి గెలిపించారు. ఈ మర్మం వైకాపా నాయకత్వం తెలుసుకున్నట్టు లేదు. వైకాపా నాయకత్వం చెపుతున్నవన్నీ కాచివడపోస్తే కాన వచ్చేదేమంటే, మా నాన్న ముఖ్యమంత్రి చేసాడు కాబట్టి నన్ను కూడా ముఖ్యమంత్రిని చెయ్యండీ అని. మా నాన్న లాగే నేనుకూడా చేస్తాను అని. అంతకు మించి వైకాపా ప్రకటనల్లో గాని, ప్రసంగాల్లో కానీ మరేమీ కనపడదు. ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపడం సరే సరి.

వైకాపాకి ఓటువేద్దామని అనుకుంటున్నామన్నవాళ్ళని ఏ జిల్లాలో కదిలించినా, వారు చెప్పే లాజిక్కు రెండు రకాలు. ఒకటి, జగన్ తండ్రి బాగా చేసాడు, ఇతగాడుకూడా అలాగే చేస్తాడు. రెండు, చంద్రబాబు ఇన్నాళ్ళూ చేసాడుగా, ఒక అవకాశం ఇతనికి ఇద్దాం. అంతే! అంతకు మించి లేదు. ఈ రెండూ అవసరమే కానీ, సరిపోవు. ఆ విషయం గ్రహించకపోతే మళ్ళీ వైకాపా ప్రతిపక్షానికే పరిమితమయ్యే పరిస్థితి వస్తుందన్నది అనేక ఎన్నికలను లోతుగా అధ్యయనం చేసినవారు అంటున్న మాట. 

గెలుపు ఓటములు ఎలా ఉన్నా, పోటీ రెండు పార్టీల మధ్యనే కాకుండా, ఇద్దరు వ్యక్తుల మధ్యనే కాకుండా,  రెండు విజన్ల మధ్య, రెండు భిన్నమైన కార్యాచరణలమధ్య, రెండు భవిష్యత్ ప్రణాళికలమధ్య ఉంటే బాగుంటుందనుకునేవారూ ఉన్నారు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle