newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

ఈ రంగులేంటి? వైసీపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

13-12-201913-12-2019 13:55:06 IST
Updated On 13-12-2019 14:18:22 ISTUpdated On 13-12-20192019-12-13T08:25:06.559Z13-12-2019 2019-12-13T08:25:04.470Z - 2019-12-13T08:48:22.487Z - 13-12-2019

ఈ రంగులేంటి? వైసీపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.  ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం, పల్లపాడు పంచాయతీ కార్యాలయానికి వైసీపీ రంగులు వేయడంపై దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది.

ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు ఎలా వేశారంటూ ప్రశ్నించింది.  పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది.పిటిషన్ ను విచారించిన చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ పై కీలక వ్యాఖ్యలు చేసింది.

ప్రభుత్వం ఇలాంటి రంగులేయడం సమంజసం కాదని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా... ఇలాంటి వాటికి పాల్పడకూడదని అభిప్రాయపడింది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అనేక పంచాయతీ, ప్రభుత్వ కార్యాలయానికి వైసీపీ రంగులు వేశారని కొద్దిరోజులుగా టీడీపీ ఆరోపిస్తోంది. జాతీయ జెండా రంగులను కూడా చెరిపేసి వైసీపీ రంగులు వేస్తోందని టీడీపీ నేతలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. 

వైసీపీ నేతల తీరుపై చంద్రబాబుతో పాటు పవన్ కూడా స్పందించారు. మంత్రి బొత్స సత్యనారాయణ నియోజకవర్గంలో గాంధీ బొమ్మ దిమ్మెకు వైసీపీ మూడు రంగులు వేయడం దుమారం రేపింది.

దీనిపై పవన్ ట్వీట్ చేశారు. ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అన్న క్యాంటీన్ భవనాలకు కూడా వైసీపీ పార్టీ రంగులు వేయడంతో విశాఖలో నిరసన వ్యక్తం చేశారు టీడీపీ నేతలు. అనంతపురం జిల్లాలో జాతీయ జెండాలకు కూడా వైసీపీ రంగులు వేయడంతో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అమరాపురం మండలం తమ్మడపల్లి గ్రామంలో పంచాయతీ భవనానికి ఉన్న జాతీయ జెండా రంగును తొలగించి.. వైసీపీకి సంబంధించిన గుర్తులను పెయింటింగ్ చేయించడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా హైకోర్ట్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

జనం అభివృద్ధి కోరుతున్నారు.. రంగులు కాదు: టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ

Image may contain: 1 person, sitting

జనం ఐదేళ్ళపాటు అభివృద్ధి కావాలని వైసీపీకి ఓటేశారని, కానీ వైసీపీ రంగులు మారుస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని  టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ అన్నారు. హైకోర్టు వ్యాఖ్యలను ఆమె స్వాగతించారు. పంచాయితీ ఎన్నికలు, ఇతర స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు పంచాయితీలకు వేసిన రంగుల్ని ఎలా కప్పేస్తారని ఆమె ప్రశ్నించారు. 

రంగులు మార్చడానికి వందల కోట్లు ఖర్చుపెడుతున్నారని, రాష్ట్రాన్ని అధోగతి పాలుచేశారని ‘న్యూస్ స్టింగ్’తో మాట్లాడుతూ విమర్శించారు. ఒక్క జాబ్ కూడా సృష్టించలేదని, అమరావతి, పోలవరం ప్రాజెక్టులు ఆగిపోయాయన్నారు. లక్షలాది మంది వలస బాట పడుతున్నారని ఆమె అన్నారు. చంద్రబాబు హయాంలో తీసుకొచ్చిన పరిశ్రమలు కూడా వెనక్కి వెళ్లిపోయాయని, ఒక్క రూపాయి సంపద కూడా సృష్టించలేదన్నారు. ప్రజలు జగన్ ఏదో చేస్తారని ఓటేశారని, కానీ వారి అంచనాలు తారుమారయ్యాయన్నారు.

వైసీపీ నేతలు తమ పార్టీ రంగులు వేయడానికి పెడుతున్న శ్రద్ధ ప్రజాసమస్యల పరిష్కారంపై పెడితే బాగుంటుందన్నారు. ఆరునెలల జగన్ పాలన లోపభూయిష్టంగా ఉందని, విపక్షాలు చేస్తున్న విమర్శలను పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. పంచాయితీలకు రంగుల విషయంలో హైకోర్టు చేసిన అభిప్రాయాలు వైసీపీ నేతలకు చెంపపెట్టులాంటివన్నారు. ఇప్పటికైనా రంగుల రాజకీయాలు మానాలని ఆమె హితవు పలికారు. 

ఇసుక తవ్వకాలపై ఏపీ సర్కార్ గైడ్ లైన్స్

ఇసుక తవ్వకాలపై ఏపీ సర్కార్ గైడ్ లైన్స్

   4 minutes ago


కరోనా కట్టడికి తెలంగాణ సర్కార్ చర్యలు భేష్

కరోనా కట్టడికి తెలంగాణ సర్కార్ చర్యలు భేష్

   13 minutes ago


రామ మందిర నిర్మాణ భూమి పూజపై మాయావతి ఫైర్

రామ మందిర నిర్మాణ భూమి పూజపై మాయావతి ఫైర్

   17 minutes ago


పారిశ్రామికీకరణపై సీఎం జగన్ మార్కు నిర్ణయం.. జగన్ కి ఆ లోటు తీరినట్టేనా…!!

పారిశ్రామికీకరణపై సీఎం జగన్ మార్కు నిర్ణయం.. జగన్ కి ఆ లోటు తీరినట్టేనా…!!

   2 hours ago


‘పర్ఫెక్ట్’ స్కెచ్.. 16మంది ప్రాణాలు గాల్లోకి... శానిటైజర్ కంపెనీ కథాకమామీషు

‘పర్ఫెక్ట్’ స్కెచ్.. 16మంది ప్రాణాలు గాల్లోకి... శానిటైజర్ కంపెనీ కథాకమామీషు

   2 hours ago


14 నెలల్లో మీరేం చేశారు? జగన్ సర్కార్‌‌పై బాబు ప్రశ్నాస్త్రాలు

14 నెలల్లో మీరేం చేశారు? జగన్ సర్కార్‌‌పై బాబు ప్రశ్నాస్త్రాలు

   2 hours ago


సచిన్ పైలట్ పయనం ఎటువైపు? స్వంత గూటికి చేరేనా?

సచిన్ పైలట్ పయనం ఎటువైపు? స్వంత గూటికి చేరేనా?

   2 hours ago


తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు

తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు

   3 hours ago


ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

   3 hours ago


హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

   4 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle