newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

ఈ ముగ్గురూ వెయిటింగ్..? ఎందుకలా?

09-06-201909-06-2019 09:26:12 IST
Updated On 24-06-2019 13:14:52 ISTUpdated On 24-06-20192019-06-09T03:56:12.778Z09-06-2019 2019-06-09T03:56:09.838Z - 2019-06-24T07:44:52.674Z - 24-06-2019

ఈ ముగ్గురూ వెయిటింగ్..? ఎందుకలా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జగన్ మంత్రివర్గం కూర్పు కొందరికి షాకిచ్చిందనే చెప్పాలి. జగన్ తో తిరుగుతూ, చేదోడువాదోడుగా ఉంటున్న వారికి చివరికి మొండిచెయ్యి చూపించారనే భావన కొంతమందిలో ఉంది. ముఖ్యంగా ముగ్గురి విషయంలో జగన్ మాట తప్పారని అంటున్నారు.

జగన్ గెలిచాక ముగ్గురు తమకు మంత్రి యోగం ఉందని తెగ సంబరపడిపోయారు. అందులోనూ వారు ఓడించింది కూడా హేమాహేమీలనే. ఆ ముగ్గురిలో ఒకరు అంబటి రాంబాబు. . ఒకవైపు కాపు సామాజికవర్గం కూడా కలిసొస్తుంది అనుకున్న వేళ ఆయనకు మంత్రిగా అవకాశం రాకపోవడం కొంత ఆశ్చర్యం కలిగించిందనే చెప్పాలి. 

పార్టీ అధికారప్రతినిధిగా, కాపు సామాజిక వర్గానికి చెందిన రాంబాబు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో వెన్నంటి ఉన్నారు. పార్టీ కష్టకాలంలో పార్టీ వాణిని మీడియాలో వినిపించారు. ఎన్నికల్లో చివరివరకూ టెన్షన్ పడినా, సాక్షాత్తూ అసెంబ్లీ స్పీకర్ నే అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా మట్టి కరిపించారు. కోడెల విజయం కోసం టీడీపీ ఎంతగానే ప్రయాస పడింది. 

కానీ చివరాఖరికి కోడెల ఎత్తులు పారలేదు. అంబటిని విజయం వరించింది. ఎన్నికల్లో గెలిచినా, అంబటి మంత్రిపదవి రేసులో మాత్రం ఓడిపోయారు. చివరి వరకూ పోరాడినా మళ్ళీ మంత్రియోగం పట్టాలంటే రెండున్నరేళ్ళు ఆగాల్సిందే. జగన్ రైలు బోగీలో అంబటిది వెయిటింగ్ లిస్ట్ అన్నమాట.

జగన్ కేబినెట్లో మంత్రి పదవి గ్యారంటీ అనుకున్నవారిలో ముఖ్యమంత్రి సామాజిక వర్గం నేత ఆళ్ళ రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కె.  మంత్రి వర్గంలోనూ రెడ్లకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారని అయితే అందుకు భిన్నంగా జగన్ అడుగులు వేశారు. రెడ్డి వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్న ముద్ర పడకూడదని మంత్రివర్గ కూర్పులో సామాజిక అంశాలకు పెద్ద పీఠ వేశారు. 40కి పైగా సీట్లు గెలుచుకున్న రెడ్డి వర్గానికి మంత్రి వర్గంలో కేవలం నాలుగు బెర్తులే దక్కాయి. దీంతో మంత్రివర్గంలో స్థానం దక్కుతుంది అనే ప్రచారం బాగా జరిగిన వారికి అవకాశం దక్కకుండా పోయింది.

రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించిన నియోజకవర్గం మంగళగిరి. అక్కడ సాక్షాత్తూ ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్ ని ఓడించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి ఎన్నికల ప్రచారంలోనే జగన్ మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. మరి ఏమయిందో ఏమో గానీ ఆర్కెకి ఆ పదవి దక్కలేదు. ఒకానొక సందర్భంలో ఆర్కెకి వ్యవసాయ శాఖ దక్కుతుందనే ప్రచారం జరిగింది. చివరాఖరికి ఆ పదవి కన్నబాబుకి దక్కింది. 

మహిళా కోటా, జగన్ చెల్లెమ్మగా పేరుగాంచిన నగరి ఎమ్మెల్యే రోజా పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి రెండో సారి గెలుపొందిన ఆర్కే. రోజాకు స్పీకర్ పదవి మొదలకుని మహిళా మంత్రిత్వ శాఖ, హోంమంత్రి వరకు అనేక పదవులు రాబోతున్నట్లు రోజా గురించి విస్తృత ప్రచారమే జరిగింది.

కానీ మంత్రి పదవి రాలేదు. దీంతో రోజా తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఆశల పల్లకీలో ఊరేగిన వీరందరికీ ఆశించిన మంత్రి పదవి ఊరించి ఉస్సూరుమనిపించింది. వీరికి మళ్లీ అవకాశం దక్కాలంటే 2021 వరకూ ఆగాల్సిందే. అప్పటివరకూ వీరంతా వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులే. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle