newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

ఈ ప్రశ్నలకు బదులేది శివాజీ...!

09-03-201909-03-2019 17:03:03 IST
2019-03-09T11:33:03.417Z09-03-2019 2019-03-09T11:08:03.198Z - - 25-02-2020

ఈ ప్రశ్నలకు బదులేది శివాజీ...!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్ర విభజన తర్వాత బీజేపీలో చేరారు నటుడు శివాజీ. ఆ తర్వాత ప్రత్యేక హోదా కోసం దీక్ష చేపట్టారు. దీని మీద కూడా అప్పట్లో కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత బీజేపీని వదిలేసిన శివాజీ... గరుడ పురాణం పేరుతో జనంలోకి వచ్చారు. ఆ తర్వాత విశాఖలో జగన్ మీద దాడి జరగడం... అది కూడా శివాజీ చెప్పినట్లుగా ఉందని ఏకంగా సీఎం చంద్రబాబు అనడం... అప్పట్లో ఆ ఎపిసోడ్‌ను బాగా పండించింది. ఎన్నికల వేళ ఏపీలో ఏం జరుగుతుందో కొన్ని సందర్భాల్లో, కొన్ని సంఘటనలు కాకతాళీయంగా శివాజీ చెప్పినట్లే జరిగాయి.

అయితే డేటా చోరీ అంశంలో ఎందుకో శివాజీ ముందుగా చెప్పలేకపోయారు. కాకపోతే ఐటీ గ్రిడ్ రచ్చ అయిన తర్వాత మాత్రం... మరోసారి ఏపీ ప్రభుత్వాన్ని వెనకేసుకొనే ప్రయత్నం చేశారు. డేటా చోరీలో ఎవరు దొంగలో ఇంకా పోలీసులు తేల్చక ముందే, శివాజీ తేల్చేశారు. తాను తెలుగుదేశం పార్టీ వాడిన కాదంటూనే... చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడారు శివాజీ. మరో విషయం ఏంటంటే... ఓట్ల తొలగింపు పేరుతో ప్రత్యేక హోదా, విభజన హామీలపై కేంద్రంతో చేస్తున్న పోరాటాన్ని పక్కదారి పట్టిస్తున్నారని కూడా శివాజీ ఆరోపించారు.

అయితే ఇక్కడ ఆయనో విషయాన్ని మర్చిపోతున్నారు. ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని తెర మీదకు తెచ్చింది వైసీపీ అయితే... దానిపై ఎదురు దాడి చేసి విషయాన్ని రచ్చ చేసింది టీడీపీ. ఈ పాయింట్ తెలీకుండా శివాజీ మాట్లాడారంటే ఎవరూ నమ్మరు. డేటా చౌర్యం చేసింది తెలంగాణ ప్రభుత్వమే అన్న శివాజీ... కేసీఆర్‌ను చూసి ఎందుకు భయపడాలని ప్రశ్నించారు. హైదరాబాద్ బ్రాండ్ వేల్యూను చంపేశారని కూడా ఆరోపించారు శివాజీ. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం గ్రహించాలని కూడా శివాజీ అన్నారు. ఈ మాటలు కూడా చాలా కామెడీగా ఉన్నాయి. ఎందుకంటే... ఐటీ గ్రిడ్ అనేది హైదరాబాద్ కంపెనీ. దాంతో టైఅప్ పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం.

ఇక తనను చూసి భయపడాలని ఏనాడూ కేసీఆర్ చెప్పలేదు. ఇప్పుడు శివాజీ మాటలతో హైదరాబాద్ లోని ఏపీ జనంలో లేనిపోని భయాలు మొదలు అయ్యేటట్లు ఉన్నాయి. ఇక హైదరాబాద్ బ్రాండ్ వేల్యూ చంపేశారని చెబుతున్నారు శివాజీ. ఇంతకీ హైదరాబాద్ బ్రాండ్ వేల్యూ అంటే ఏంటి? అది తెచ్చింది ఎవరు? ఇప్పుడు పోగొట్టింది ఎవరు?  అంటే కేసీఆర్ మీదే శివాజీ ఈ ఆరోపణ చేశారా అన్నది కూడా ఆయనే క్లారిటీ ఇవ్వాలి.

ఇక హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని అని శివాజీ చెప్పారు. ఈ విషయం తెలియకుండానే ఏపీ సీఎం చంద్రబాబు హడావుడిగా అమరావతి వెళ్లిపోయారా? ఇప్పుడు ఈ ప్రశ్నలే అడుగుతున్నారు ఏపీ ప్రజలు. అందుకే వీటన్నింటికీ సమాధానం చెప్పాల్సింది శివాజీ మాత్రమే. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle