newssting
BITING NEWS :
*అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం... మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అసెంబ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన *మూడురాజధానులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ *అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారు.. స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. నాలుగు జిల్లాలకు కలిపి జోనల్ డెవలప్‌మెంట్ బోర్డు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే బిల్లు ఉద్దేశం-మంత్రి బుగ్గన*సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స, మూడు రాజధానుల ప్రతిపాదలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం*రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చిరుత కలకలం.. ఓ ఇంటిపై చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు*ఛలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపు.. మద్దతు ప్రకటించిన టీడీపీ, సీపీఐ.. టీడీపీ ఎమ్మెల్యేలు*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

ఈ ధిక్కారమున్ సైతునే.. రఘురాముడికి జగన్ వార్నింగ్?

23-11-201923-11-2019 12:41:00 IST
Updated On 23-11-2019 17:36:46 ISTUpdated On 23-11-20192019-11-23T07:11:00.206Z23-11-2019 2019-11-23T07:10:57.464Z - 2019-11-23T12:06:46.968Z - 23-11-2019

ఈ ధిక్కారమున్ సైతునే.. రఘురాముడికి జగన్ వార్నింగ్?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సీఎం జగన్మోహన్ రెడ్డికి తమ పార్టీ ఎంపీలపై అనుమానం పెరుగుతోందా?

నర్సాపురం ఎంపీ వివరణ జగన్ ని సంతృప్తి పరచలేదా?

అందరు ఎంపీలపై అసహనం పెరిగిందా?

పార్లమెంట్ ఆవరణలో ఈ ప్రశ్నలపైన బహిరంగ చర్చ జరుగుతోంది. వైసీపీలో ముఖ్యులైన విజయసాయి రెడ్డి, మిధున్ రెడ్డిలకు సమాచారం లేకుండా ఎంపీలెవరూ ప్రధాని మోడీని లేదా కేంద్రమంత్రులను కలవడానికి వీలులేదని హుకుం జారీచేశారట. దీంతో ఎంపీలందరూ ఇదెక్కడి చోద్యం అంటూ అసహనానికి లోనవుతున్నారు. .

తమ నియోజకవర్గ సమస్యలను కూడా కేంద్ర మంత్రులకు కూడా చెప్పుకోలేని ఎంపీలం దేశం మొత్తం మీద తామేనేమో అని విజయసాయి ముందు బహిరంగంగానే తమ అసహనం కక్కేశారట. సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశ్యంతో ఆంక్షలు విధించినా ఒక్క ఎంపీ మాత్రం ఏకంగా పార్టీ సిద్ధాంతాలను పార్లమెంటులోనే ప్రశ్నించడంతో పాటు ఏకంగా ప్రధాని మోడీతోనే ముచ్చట్లు పెట్టేశారు. మోడీ కూడా ఏంటి రాజుగారు ఎలా ఉన్నారు అన్న పలకరింపులు వైసీపీలో ప్రకంపనలు రేపాయి.

ఈ దృశ్యం కనిపించిన సమయంలో రాజకీయ వర్గాలలో అందరూ సీఎం జగన్మోహన్ రెడ్డి వైపు చూపు తిప్పగా బీజేపీ ఎంపీ సుజనాచౌదరి లాంటి వాళ్ళు చేసిన 'వైసీపీ ఎంపీలు కొందరు తమ టచ్ లో ఉన్నారన్న' ప్రకటనలు అగ్గిమీద ఆయిల్ పోసిన చందంగా మారింది. దీంతో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుని సీఎం జగన్ హుటాహుటిన అమరావతికి పిలిపించేశారట. విజయసాయి, మిధున్ రెడ్డి దగ్గరుండి మరీ ఢిల్లీ నుండి తీసుకొచ్చారట.

తాడేపల్లిలో ఎంపీ రాజుగారితో సమావేశమైన ముగ్గురు నేతలు ఎందుకు పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా మాట్లాడాల్సి వచ్చిందని ప్రశ్నించినట్లుగా అమరావతి వర్గాల నుండి వినిపిస్తుంది. పార్లమెంట్ సాక్షిగా గొంతెత్తిన వ్యక్తి నుండి ఏం సమాధానం వస్తుందో కూడా ముందే గ్రహించారు. తానెక్కడా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రవర్తించలేదన్న ఎంపీ తన చర్యలలో ఎలాంటి ఉద్దేశ్యాలు లేవని చెప్పారట.

అంతేకాదు తనకంటూ ఎలాంటి వ్యక్తిగత పనులు లేవని, కేవలం ప్రధానితో సన్నిహితంగా ఉంటే రాష్ట్రానికి సంబంధించిన అంశాలను, సమస్యలను అయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం మాత్రమేనని వివరణ ఇచ్చారట. ఇక తెలుగు మీడియంపై పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశమని, కానీ తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారట.

అయితే పూర్తిస్థాయిలో ఎంపీలను కట్టడి చేసే ఉద్దేశ్యంతో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంపీ రాజుగారి వద్ద నుండి లిఖిత పూర్వక వివరణ తీసుకున్నారని పార్టీ వర్గాల నుండి తెలుస్తుంది. ఇక ముందు కూడా ఎంపీలెవరూ పార్టీ గీత దాటే ప్రయత్నం చేయకూడదని మరోసారి పెద్దలు స్పష్టమైన హెచ్చరికలు కూడా చేసినట్లుగా తెలుస్తుంది. మరి ఎంపీలు కట్టుబడి ఉంటారా? లేక మరో రాజుగారో.. రెడ్డిగారో బయల్దేరతారా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

   3 hours ago


పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

   5 hours ago


కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

   5 hours ago


రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

   7 hours ago


స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

   9 hours ago


అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

   9 hours ago


హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

   9 hours ago


టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

   9 hours ago


జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

   10 hours ago


'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

   11 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle