newssting
BITING NEWS :
*సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం *ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు *సింగరేణి కార్మికులకు బోనస్-ముఖ్యమంత్రి కేసీఆర్‌*నల్లగొండలో భారీవర్షం... ఆరుగంటల్లో 200 మిల్లీలీటర్ల వర్షపాతం *కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు *బోటు ప్రమాద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలి-మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ * జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి* ఈనెల 26 నుంచి బ్యాంకులు బంద్*న్యూఢిల్లి : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

ఈ ధిక్కారం దేనికి సంకేతం?

21-04-201921-04-2019 08:59:37 IST
2019-04-21T03:29:37.837Z21-04-2019 2019-04-21T03:29:34.080Z - - 20-09-2019

ఈ ధిక్కారం దేనికి సంకేతం?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స్వయంగా పార్టీ అధినేతకే ఝలక్ ఇచ్చారు. ఏపీ ఆపధర్మ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు టీడీపీ నేతకే దిమ్మతిరిగేలా చేశారు.. కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్తున్న బాబు ఎన్నికల సరళిపై సమీక్ష నిర్వహించాలని భావించారు. అందులో భాగంగా పార్టీ కార్యాలయం నుంచి కర్నూలు జిల్లాకు చెందిన అభ్యర్థులకు సమాచారం కూడా ఇచ్చారు. 

అంతా పద్థతి ప్రకారం జరగాలనుకునే బాబు అనుకున్నషెడ్యూల్ ప్రకారం కర్నూలు జిల్లా చేరుకున్నారు. తాను అక్కడికే చేరుకునే లోపే నేతలంతా క్యూ కట్టుకుని నిలబడతారని చంద్రబాబు భావించారు. ఎన్నికల సరళిపై అంచనా వేసేందుకు, ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల్లో ఉత్సాహం నింపేందుకు చంద్రబాబు రివ్యూ నిర్వహించారు. అయితే ఆ రివ్యూకు కీలక నేతలు డుమ్మా కొట్టడం చర్చకు దారితీస్తోంది.

జిల్లాకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి హాజరైతే అత్యధిక సంఖ్యలో నేతలు గైర్హాజరుకావడం హాట్ టాపిక్ అయింది. అభ్యర్థులంతా ఎన్నికల్లో పోటీ చేసి రిలాక్స్ అవుతున్న సమయంలో కూడా ముఖ్యమంత్రి వస్తే రాకపోవడంపై పెద్ద ఎత్తున గుసగుసలు వినిపిస్తున్నాయి.

జిల్లాలో ఉండి కావాలని వారంతా హాజరు కాలేదా లేక ఎన్నికల ఫలితాలలో టీడీపీకి ఓటర్లు మొండిచెయ్యి చూపించబోతున్నారన్న సర్వేల ఆధారంగా వెనక్కి తగ్గారా అన్నది తెలియడం లేదు. కర్నూలు నేతలు బాబు నిర్వహించిన సమీక్షా సమావేశానికి హాజరుకాకపోవడంతో పార్టీకి పెద్ద తలనొప్పే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాయలసీమలో ముఖ్యంగా టీడీపీకి అనుకున్న ఫలితాలు రాకపోవచ్చని, అందుకే ఈ ధిక్కారం అనే చర్చ నడుస్తోంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle