newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

ఈ ఘటనలకు ఎవరు బాధ్యులు?

09-03-201909-03-2019 15:08:36 IST
Updated On 09-03-2019 15:22:52 ISTUpdated On 09-03-20192019-03-09T09:38:36.222Z09-03-2019 2019-03-09T09:23:01.482Z - 2019-03-09T09:52:52.888Z - 09-03-2019

ఈ ఘటనలకు ఎవరు బాధ్యులు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐదేళ్ల చంద్రబాబు పాలనలో జరిగిన కొన్ని సంఘటనలకు ఎవరు బాధ్యులు. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీల్లో ఎవరి బాధ్యత ఎంత ఉంది. ప్రతి దానికీ వైసీపీ మీద ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలు... తమ పాలనలో జరిగిన వాటి మీద ఎందుకు చర్చకు రావడం లేదు. ఇదే ఇప్పుడు సగటు ఆంధ్రుడు అడుగుతున్న ప్రశ్న. తొమ్మిదేళ్లుగా జగన్ ఏం చేశారనేది ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించిన ప్రధాన ప్రశ్న. దీనికి జగన్ పార్టీ చెబుతోంది ఒక్కటే. రాష్ట్ర విభజనకు ముందు, కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏనాడూ జగన్ ఇంట్లో లేరట. ఏదో ఒక అంశంతో ఎప్పుడూ జనం మధ్యే ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. 

ప్రజాసంకల్ప యాత్ర ద్వారా జగన్ జనానికి మరింత దగ్గర అయ్యారనేది వారి వాదన. ఇక రాజధానిలో పొలాలను కొందరు తగలబెట్టారు. ఈ ఘటన జరిగిన వెంటనే వైసీపీ మీద, జగన్ మీద ఆరోపణలు చేశారు టీడీపీ నేతలు. చంద్రబాబు కూడా వారిని అడ్డుకోలేదు. కానీ మూడేళ్ల విచారణ తర్వాత కేసు మూసేశారు ఏపీ పోలీసులు. నిజంగా ఈ కేసులో జగన్ పార్టీ ప్రమేయం ఉంటే ఎందుకు పట్టుకోలేదనేది వైసీపీ నేతల ప్రశ్న.

ఇక కాల్ మనీ కేసులో కూడా పులివెందులకు చెందిన వైసీపీ నేతలే దోషులంటూ ఏపీ మంత్రులతో పాటు చాలా మంది టీడీపీ నేతలు ఆరోపించారు. కానీ ఆ కేసులో ఎక్కువ శాతం బయట పడింది టీడీపీ నేతలు, ఆ పార్టీకి చెందిన ఎంఎల్ఏలు. ఈ కేసులో కూడా వైసీపీ నేతల ప్రమేయం లేదన్నది తేలిపోయింది. 

ఇక తుని రైలు దహనం చేసిన కేసులో కూడా పులివెందుల గూండాలు అంటూ ప్రచారం చేశారు. స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ ఆరోపణ చేశారు. కానీ ఇప్పటి దాకా అరెస్ట్ అయిన వారిలో ఒక్కరు కూడా పులివెందులకు సంబంధించిన వారు లేరు. అంటే టీడీపీ నేతలు, చంద్రబాబు చేసిన ఆరోపణల్లో నిజం లేదని తేలిపోయిందని వైసీపీ చెబుతోన్న మాట. ఇక అసెంబ్లీ తాత్కాలిక భవన నిర్మాణంలో పగుళ్లు వచ్చాయి. నీరు కారింది. అది కూడా వైసీపీ కుట్రే అని కొందరు టీడీపీ ఎంఎల్ఏలు ఆరోపించారు. 

కానీ అదంతా పచ్చి అబద్దాలని తేలిపోయాయని వైసీపీ చెబుతోంది. ఇక జగన్ మీద విశాఖలో జరిగిన హత్యాయత్నం కూడా సీఎం చంద్రబాబుతో సహా మంత్రులు, టీడీపీ ఎంఎల్ఏలు వక్రీకరించారనేది వైసీపీ ఆరోపణ. ఇమేజ్ కోసమే జగన్ తన మీద తానే హత్యయత్నం చేయించుకున్నారని సీఎం, మంత్రులు, టీడీపీ ఎంఎల్ఏలు వాదించారు. కానీ హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

ఇదే వారి ఆరోపణలు తప్పని తేల్చిందని వైసీపీ చెబుతున్న మాట. ఇప్పుడు డేటా చోరీలో కూడా వైసీపీ, టీడీపీలు ఒకరి మీద మరొకరు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఎవరిది తప్పన్నది తేల్చాల్సింది పోలీసులే. మొత్తానికీ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధంలో ఎవరిది కరెక్ట్ అన్నది జనమే తేల్చాలి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle