newssting
BITING NEWS :
*ఏపీలో ఆన్‌లైన్ క్లాస్‌ల‌పై వెన‌క్కి త‌గ్గుతున్న కార్పొరేట్ స్కూళ్లు.. నేటి నుంచి ఆన్‌లైన్ క్లాసులు లేవ‌ంటూ స్కూళ్ల నుంచి విద్యార్థుల‌కు మెసేజ్‌లు *దేశంలో కరోనా వీరవిహారం... దేశ‌వ్యాప్తంగా 24,850 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 613 మంది మృతి, 6,73,165కు చేరిన పాజిటివ్ కేసులు, 19,268కు పెరిగిన మృతుల సంఖ్య..యాక్టీవ్ కేసులు 2,44,814, డిశ్చార్జ్ *నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై నేడు ఎన్నిక‌ల క‌మిష‌న్ నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం *నెల్లూరు జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 1008... యాక్టివ్ కేసులు 462.. మృతుల సంఖ్య 19*హైద‌రాబాద్‌: నేటి నుంచి బేగంబ‌జార్ మార్కెట్ ఓపెన్*హైదరాబాద్‌లో ప్రైవేట్ ఆస్పత్రుల కరోనా దందా..గచ్చిబౌలి కేర్ ఆస్పత్రిలో కరోనాతో నాగరాజు అనే వ్యక్తి మృతి..డబ్బు కడితేనే మృతదేహం ఇస్తామంటూ బెదిరింపులు..ఆస్పత్రి తీరుపై బంధువుల ఆందోళన *డీజీపీ సవాంగ్ విశాఖ పర్యటనలో ఉండగా డ్రగ్స్ కలకలం..డ్రగ్స్ అమ్ముతూ టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డ నలుగురు నిందితులు అరెస్ట్..నిందితుల నుంచి భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం *ఏపీలో 10 లక్షలు దాటిన కరోనా టెస్టులు..మొత్తం 10,17,123 కరోనా టెస్టులు *ఏపీలో కొత్తగా 99 8 కరోనా కేసులు. 14 మరణాలు. ఏపీలో మొత్తం 18,697కి చేరిన కరోనా కేసులు. ఇప్పటి వరకు మొత్తం 232 కరోనా మరణాలు. 10043 యాక్టివ్ కేసులు ఉండగా, 8422 మంది కోలుకొని డిశ్చార్జ్

ఈసీ తీరుపై బాబు ఫైర్.. బాబుది డ్రామా అంటున్నవైసీపీ

10-04-201910-04-2019 15:00:54 IST
Updated On 11-04-2019 14:57:52 ISTUpdated On 11-04-20192019-04-10T09:30:54.410Z10-04-2019 2019-04-10T09:30:52.853Z - 2019-04-11T09:27:52.166Z - 11-04-2019

ఈసీ తీరుపై బాబు ఫైర్.. బాబుది డ్రామా అంటున్నవైసీపీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నికల సంఘం అధికారుల ఏకపక్ష బదిలీలపై సీఎం చంద్రబాబునాయుడు అభ్యంతరం తెలిపారు. అమరావతిలోని ఏపీ ఎన్నికల కమిషన్‌ కార్యాలయం వద్ద ఆయన ఇవాళ ధర్నాకు దిగారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ చంద్రబాబు నిరసన తెలిపారు. పార్టీ నాయకులతో కలిసి చంద్రబాబు సెక్రటేరియట్‌లోని 5వ బ్లాక్‌ వద్ద ధర్నాకు కూర్చున్నారు.ఎన్నికల్లో అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలన్న ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఎన్నికల సంఘం ఎందుకు విస్మరిస్తోంది? అన్నారు. 

అంతకు ముందు సీఎం చంద్రబాబు ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీతో సమావేశమయ్యారు.  8 పేజీల లేఖను చంద్రబాబు ఆయనకు అందచేశారు. టీడీపీ నేతల ఇళ్లపై ఐటీ దాడులను, పోలీసు ఉన్నతాధికారుల బదిలీల విషయమై చంద్రబాబు ప్రస్తావించారు. వైసీపీ నేతలు విజయసాయి రెడ్డి, అనిల్ యాదవ్.. జగన్‌ సతీమణి భారతిరెడ్డి అసిస్టెంట్ అనితా రెడ్డిలకు సంబంధించిన ఆడియో టేపులను సీఈఓకు చంద్రబాబు అందజేశారు.

ఎన్నికలకు ముందు ఒక ముఖ్యమంత్రి సీఈవోను కలవడం ఇదే తొలిసారి అని చంద్రబాబు అన్నారు. తమకు ఈవీఎంలపై నమ్మకం లేదని ద్వివేదీకి చెప్పామన్నారు. వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలని కోరామని చెప్పారు. దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈసీకి ఉందని అన్నారు. ఈసీ పరిధిలో లేకున్నా అధికారులను బదిలీ చేశారని, అకారణంగా సీఎస్‌ను, కడప ఎస్పీని బదిలీ చేశారని దుయ్యబట్టారు. టీడీపీ నేతలు, అభ్యర్ధులపై ఐటీ దాడులు చేయడం వల్ల తమ పార్టీ క్యాడర్లో ఆత్మస్థయిర్యం దెబ్బతింటోందన్నారు.

వైసీపీలో అవినీతిపరులపై ఎందుకు ఐటీ దాడులు జరగడం లేదని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ నేతలు డబ్బులు వెదజల్లుతున్నా ఈసీ పట్టించుకోవడం లేదన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ చెందిన వ్యక్తి  ఏకంగా రూ .8 కోట్ల రూపాయిలు డ్రా చేసి పోలీసులకు చిక్కిన ఎటువంటి చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై వైసీపీ తీవ్రంగా మండిపడింది. ఎన్నికల ఫలితాలపై చంద్రబాబుకు భయం ఉందన్నారు. ఫలితాలు ఏం వచ్చినా అన్ని పార్టీలు వ్యవహరించాలని వైసీపీ నేత నాగిరెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యం గురించి గతంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈసీకి ఇచ్చిన లేఖను సీఎం హోదాలో ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం అన్నారు నాగిరెడ్డి. ఒకపార్టీ అధ్యక్షుడిగా లేఖ రాయవచ్చన్నారు. కానీ అధికార దుర్వినియోగం చేయడంపై ఈసీ సుమోటోగా తీసుకుని చర్యలు తీసుకోవాలని నాగిరెడ్డి కోరారు. 

ఏపీలో 10 లక్షలు దాటిన  కరోనా పరీక్షలు.. దేశంలోనే గుర్తింపు

ఏపీలో 10 లక్షలు దాటిన కరోనా పరీక్షలు.. దేశంలోనే గుర్తింపు

   36 minutes ago


సీఎం జగన్‌కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ

సీఎం జగన్‌కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ

   an hour ago


కోవిడ్ బారిన పడకుండా వుండాలంటే..

కోవిడ్ బారిన పడకుండా వుండాలంటే..

   2 hours ago


తెలంగాణలో 1590 కరోనా కేసులు, ఆంధ్రలో 961 కేసులు.. తగ్గని పోటీ

తెలంగాణలో 1590 కరోనా కేసులు, ఆంధ్రలో 961 కేసులు.. తగ్గని పోటీ

   2 hours ago


అల్లాడుతున్న ఇచ్చాపురం... 14 రోజుల లాక్ డౌన్

అల్లాడుతున్న ఇచ్చాపురం... 14 రోజుల లాక్ డౌన్

   3 hours ago


అంత్యక్రియలకు పదివేలమంది... తల పట్టుకున్న అధికారులు

అంత్యక్రియలకు పదివేలమంది... తల పట్టుకున్న అధికారులు

   3 hours ago


కేసీయార్ సార్...కరోనాపై కంట్రోల్ ఏదీ? ట్రెండ్ అవుతున్న #WhereIsKCR హ్యాష్ ట్యాగ్

కేసీయార్ సార్...కరోనాపై కంట్రోల్ ఏదీ? ట్రెండ్ అవుతున్న #WhereIsKCR హ్యాష్ ట్యాగ్

   4 hours ago


ప్రపంచంలో అతిపెద్ద కోవిడ్‌ కేంద్రం ఢిల్లీలో ప్రారంభం.. 10 వేల పడకల సామర్థ్యం

ప్రపంచంలో అతిపెద్ద కోవిడ్‌ కేంద్రం ఢిల్లీలో ప్రారంభం.. 10 వేల పడకల సామర్థ్యం

   4 hours ago


కోవిడ్ మరణాలపై కేంద్రం ఆందోళన .. పరీక్షలు పెంచాలని సూచన

కోవిడ్ మరణాలపై కేంద్రం ఆందోళన .. పరీక్షలు పెంచాలని సూచన

   17 hours ago


సీఎం జగన్‌కు బీజేపీ నేత కన్నా ఘాటు లేఖ

సీఎం జగన్‌కు బీజేపీ నేత కన్నా ఘాటు లేఖ

   17 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle