newssting
BITING NEWS :
*విజయవాడలో ప్రజావేదిక కూల్చివేత *అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతాం: సీఎం జగన్ *పార్టీ మారడం ఖాయం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి *పార్టీ అంటే కుల సంఘం కాదని, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి: పవన్ కళ్యాణ్ *హోదా బాధ్యత జగన్‌దే: ఎంపీ గల్లా జయదేవ్‌*‘నెహ్రూ-గాంధీ’ కుటుంబంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు *ప్రపంచకప్‌ సెమీస్‌లోకి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా

ఈసీ కోడై కూస్తున్నా పట్టించుకోని బాబు

19-04-201919-04-2019 15:13:51 IST
Updated On 19-04-2019 18:37:54 ISTUpdated On 19-04-20192019-04-19T09:43:51.724Z19-04-2019 2019-04-19T09:43:47.621Z - 2019-04-19T13:07:54.289Z - 19-04-2019

ఈసీ కోడై కూస్తున్నా పట్టించుకోని బాబు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నికల కోడ్ అమలులో వుండగా ఏ ప్రభుత్వాధినేత పాలనా వ్యవహారాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోకూడదు. కానీ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాత్రం తనకు ఏ కోడ్ వర్తించదు అన్నట్టుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. సచివాలయం సాక్షిగా నియమావళికి బాబు తూట్లు పొడుస్తున్నారు. వివిధ శాఖల పనితీరుని ఆయన ఎడాపెడా సమీక్షించేస్తున్నారు. ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులైంది. మే 23 వరకూ ఫలితాలు వెల్లడి కావు. అయితే చంద్రబాబు మాత్రం ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ను పక్కన పెట్టేస్తున్నారు. ఈ వ్యవహారమే ఈసీకి ఆగ్రహం తెప్పిస్తోంది. అధికారులను ఇరుకున పెడుతోంది. 

ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడు కేవలం ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితిలోనే సమీక్షలు చేయాలి. ఏపీకి సుదీర్ఘకాలం సీఎంగా ఉన్న చంద్రబాబుకి ఆ సంగతి తెలీదని అనుకోవడానికి లేదు. సీఎస్ ను కూడా సమీక్షలకు పిలిచారు. అసలు సీఎస్ అలాంటి సమీక్షలకు హాజరుకాకూడదు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చంద్రబాబు ఆహ్వానాన్ని సున్నితంగా పక్కన పెట్టారు. అయితే చంద్రబాబుకి ఇవేం పట్టడంలేదు.

నిబంధనలను తోసిరాజని పోలవరం, సీఆర్‌డీఏపై సమీక్షలు చేసేశారు. ముఖ్యమంత్రి వైఖరితో అధికారులు సతమతం అవుతున్నారు. ఈసీ నిర్దేశించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి వచ్చే నెల 27వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. అప్పటి వరకు ముఖ్యమంత్రి, మంత్రులు రోజువారీ అధికారిక సమీక్షలు నిర్వహించరాదు. గతంలో ఏ సీఎం వ్యవహరించని విధంగా చంద్రబాబు ఇప్పుడు నియమావళిని తుంగలో తొక్కుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే కొందరు అధికారులు సమీక్షలకు గైర్హాజరు అవుతున్నారు. 

ఎన్నికలు ముగిశాక.. కొత్తప్రభుత్వం వచ్చేవరకూ సీఎం సమీక్షలకు అధికారులు హాజరు కాకూడదు. అలాగే సీఎం కూడా అధికారులను ఆహ్వానించరాదు. అయితే చంద్రబాబు అధికారులను ఇరకాటంలో పెడుతూ తనకు కావల్సిన వారికి ఖజానా నుంచి బిల్లులు చెల్లించాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇందులో భాగంగానే సమీక్షల పేరుతో హడావిడి చేస్తున్నారని ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు.

గురువారం సీఆర్‌డీఏ పనులపై చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి నారాయణతో పాటు సీఎం కార్యాలయ అధికారి రాజమౌళి, ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్, అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సీఎండీ లక్ష్మీపార్థసారథి హాజరయ్యారు. ఇందులో రహదారులతో పాటు ఇతర ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించారు. మొక్కలు నాటడం పేరుతో ఇప్పటికే వందల కోట్లు వ్యయం చేసిన సీఆర్‌డీఏ, అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌.. ఇప్పుడు చంద్రబాబు ఆదేశాలతో మరింత ప్రజాధనం వృధా చేసేందుకు సిద్ధమయ్యారు.  

ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సీఆర్‌డీఏతో పాటు శాంతి భద్రతలపై సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిసిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి జీకె ద్వివేది మీడియాకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని విడుదల చేశారు. ఒక పక్క సీఎస్‌ 15వ ఆర్థిక సంఘం సభ్యునితో సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తుండగా మరో పక్క చంద్రబాబు సీఆర్‌డీఏతో సమీక్ష నిర్వహించడం గమనార్హం. శాంతిభద్రతల సమీక్షకు రావాలని సీఎం కోరితే.. డీజీపీతో పాటు శాంతిభద్రతల పోలీసు ఉన్నతాధికారులు వారంతా ససేమిరా అన్నారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో హోం శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ సీఎం సమీక్ష వ్యవహారాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎస్‌ స్పందిస్తూ ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున సమీక్షలు నిర్వహించరాదనే విషయాన్ని సీఎంకు తెలియజేయాలన్నారు. ఒకవేళ ఏదైనా సమాచారం కావాలంటే అందచేయాలని అనురాధకు సూచించారు. ఆమె ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా, సమీక్ష రద్దు చేసుకుని ఒంటిమిట్ట వెళ్ళిపోయారు. ఇదిలా ఉంటే సీఎం రివ్యూలపై నివేదిక కోరినట్టు సీఈవో గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. మొత్తం మీద చంద్రబాబు వ్యవహారం అధికారులకు ఇరకాటంగా మారింది. చంద్రబాబు తీరు పట్ల సీనియర్ ఐఎఎస్ అధికారులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle