newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

ఈసీతో ఢీ అంటే ఢీ: చంద్రబాబు ఘాటు లేఖ

26-04-201926-04-2019 16:33:51 IST
2019-04-26T11:03:51.293Z26-04-2019 2019-04-26T11:03:47.499Z - - 22-07-2019

ఈసీతో ఢీ అంటే ఢీ: చంద్రబాబు ఘాటు లేఖ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈసీని చంద్రబాబు వదలడం లేదు. నిను వీడని నీడను నేనే అన్న చందంగా చంద్రబాబు దూకుడు మీదున్నారు. ఎన్నికల సంఘంతో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ స్థాయిలో పోరాటం చేయడంలేదు. కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 9పేజీల లేఖ రాశారు. ఏపీలో అమలవుతున్న వివిధ ప్రాజెక్టులపై సమీక్షలను అడ్డుకోవద్దంటూ చంద్రబాబు లేఖలో కోరారు. 

ఈసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పేరుతో తీసుకుంటున్న పలు నిర్ణయాలు ఏకపక్షమని లేఖలో ఆరోపించారు. ప్రజాప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఈ ఆదేశాలు ఉన్నాయంటూ లేఖలో పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల రివ్యూలపై ఈసీ అభ్యంతరాలు సరికాదని.. ఈ విషయంలో పునసమీక్ష అవసరం అన్నారు.  ప్రజలు తనకు ఐదేళ్ళపాటు పాలించే అవకాశం ఇచ్చారని, శాఖలపై సమీక్ష చేసే హక్కు తనకు ఉందన్నారు.

సీఎం భద్రత చూస్తున్న ఇంటెలిజెన్స్ డీజీ, ఎస్పీ బదిలీలు ఏకపక్ష నిర్ణయమన్నారు. విపక్షం వైసీపీ ఏం ఫిర్యాదుచేసినా పట్టించుకుంటున్నారని, తాము ఫిర్యాదుచేస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఏప్రిల్ 11న జరిగిన పోలింగ్ నిధి నిర్వహణలో ఈసీ దారుణంగా విఫలమైందన్నారు. ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకోవడంలో ఇబ్బందులు పడ్డారన్నారు. మరోవైపు టీడీపీ మంత్రులు, పార్టీ నేతలు సైతం ఈసీ, సీఎస్ తీరుపై మండిపడుతున్నారు.

ఇంతకుముందే ఈసీ కార్యాలయానికి వెళ్ళి సీఈవో గోపాలకృష్ణ ద్వివేదికి లేఖ ఇచ్చి, అక్కడే ధర్నా చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం రాజ్యాంగేతరశక్తిగా వ్యవహరిస్తున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. కుట్ర రాజకీయాలను సీఎస్‌ మానుకోవాలని.. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పాటు రాష్ట్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించే అధికారం సీఎస్‌కు లేదని విమర్శించారు. 

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle