newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

ఈసారైనా ఆ పార్టీల‌కు ఛాన్స్ ఉందా..?

03-04-201903-04-2019 12:31:44 IST
Updated On 09-07-2019 13:35:54 ISTUpdated On 09-07-20192019-04-03T07:01:44.224Z03-04-2019 2019-04-03T07:01:17.697Z - 2019-07-09T08:05:54.091Z - 09-07-2019

ఈసారైనా ఆ పార్టీల‌కు ఛాన్స్ ఉందా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గ‌త ఎన్నిక‌ల్లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజ‌లు స్పష్టంగా తీర్పునిచ్చారు. కేవ‌లం తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే వారు ఆలోచించారు. మూడో పార్టీ వైపు క‌నీసం చూడ‌లేదు. దీంతో గ‌త అసెంబ్లీలో కేవ‌లం తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉన్నాయి. భార‌తీయ జ‌న‌తా పార్టీ కూడా నాలుగు స్థానాలు గెలుచుకున్నా ఆ పార్టీ పొత్తులో భాగంగా టీడీపీతో క‌లిసి పోటీ చేసిందే. అంటే టీడీపీ - బీజేపీ కూట‌మి లేదా వైఎస్సార్ కాంగ్రెస్ మ‌ధ్యే పోటీ న‌డిచింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడూ ఇలా రెండే ప‌క్షాలు అసెంబ్లీలో ఉన్న ప‌రిస్థితి లేదు. క‌మ్యూనిస్టులు, ఎంఐఎం, త‌దిత‌ర పార్టీలు క‌చ్చితంగా ఒకటో రెండు స్థానాలు గెలిచి శాస‌న‌స‌భ‌లో అడుగుపెట్టేవి.

2014లోనే తెలంగాణ‌లో టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ, ఎంఐఎం, సీపీఐ, సీపీఎం పార్టీలు అసెంబ్లీలో అడుగుపెట్టాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రెండే ప‌క్షాలు ఉన్నాయి. ఈ రెండు ప‌క్షాల మ‌ధ్యే మాట‌ల యుద్ధాలు న‌డిచేవి. త‌ర్వాత టీడీపీతో విభేదించి బీజేపీ బ‌య‌ట‌కు వ‌చ్చేసినా అప్ప‌టికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీని బ‌హిష్కరించింది. దీంతో అప్పుడు కూడా స‌భ‌లో రెండే ప‌క్షాలు ఉన్నాయి. ప్రతిప‌క్ష పాత్రలోకి బీజేపీ చేరిపోయింది.

ఈ ఎన్నిక‌ల్లోనూ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలే బ‌లంగా క‌నిపిస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ ప‌రిస్థితి ఈసారి పూర్తిగా త‌ల‌కిందులైంది. ఆ పార్టీకి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలుపు అవ‌కాశాలు చాలా త‌క్కువ అనే విశ్లేష‌ణ‌లు ఉన్నాయి. కేవ‌లం విశాఖ ఉత్త‌ర స్థానం నుంచి విష్ణుకుమార్ రాజు మాత్రం కొంచెం పోటీ ఇస్తున్నారు. ఆయ‌న మిన‌హా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా గ‌ట్టి పోటీ ఇస్తార‌నే మ‌రో అభ్యర్థి క‌నిపించ‌డం లేదు.

ఇక‌, ఆంధ్రప్రదేశ్‌లో తామే ప్రత్యామ్నాయం అంటూ ముందుకొచ్చిన జ‌న‌సేన పార్టీ మాత్రం ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. స్వయంగా ఆ పార్టీ అధ్యక్షులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీకి బ‌లం ఉంద‌నుకున్న రెండు స్థానాల నుంచి పోటీ చేస్తుండ‌టం, గుంటూరు నుంచి పార్టీలో కీల‌క నేత‌లుగా ఉన్న నాదెండ్ల మ‌నోహ‌ర్‌, తోట చంద్రశేఖ‌ర్‌, క‌ర్నూలు జిల్లాలో ఎస్పీవై రెడ్డి కుటుంబం, గుంత‌క‌ల్లులో మ‌ధుసూద‌న్ గుప్తా వంటి వారు గ‌ట్టి పోటీ ఇస్తున్నారు. వీరితో పాటు ఉభ‌య గోదావ‌రి జిల్లాలు, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలో జ‌న‌సేన ప్రధాన పార్టీల‌కు మంచి పోటీ ఇస్తుంది. దీంతో ఈసారి మూడో పార్టీగా జ‌న‌సేన అసెంబ్లీలో అడుగుపెట్టే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి.

చ‌రిత్రలో ఎన్నడూ లేని విధంగా గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్తి నామ‌రూపాలు లేకుండా పోయింది. ఒక్క స్థానం కూడా ఆ పార్టీ గెలుచుకోలేక‌పోయింది. విభ‌జ‌న దెబ్బకు హేమాహేమీల్లాంటి నేత‌లే ప‌త్తా లేకుండా పోయారు. అయితే, ఈ ఎన్నిక‌ల్లో రాయ‌ల‌సీమ‌లో ఇద్దరు ముఖ్య నాయ‌కులు గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టవ‌చ్చనే ఊహాగానాలు ఉన్నాయి. ఇక్కడ టీడీపీ బ‌ల‌హీన అభ్యర్థుల‌ను నిల‌బెట్టి కాంగ్రెస్‌కు స‌హ‌క‌రిస్తోంద‌నే ప్రచారం సైతం జ‌రుగుతోంది.

మొద‌టిసారిగా అసెంబ్లీలో ప్రాతినిధ్యం కోల్పోయిన క‌మ్యూనిస్టులు కూడా ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉన్నాయి. ఇందుకోసం ఆ పార్టీలు జ‌న‌సేన‌తో పొత్తు కుదుర్చుకున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఛ‌రిష్మాకు త‌మ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకు క‌లిసివ‌స్తే కొన్ని స్థానాలు ద‌క్కించుకోవ‌చ్చని సీపీఐ, సీపీఎం లెక్కలు వేసుకుంటున్నాయి. అయితే, సీపీఎంకు బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉన్న భ‌ద్రాచలం నియోజ‌క‌వ‌ర్గంలోని కొన్ని మండ‌లాలు ఏపీలోని రంప‌చోడ‌వ‌రంలో క‌ల‌వ‌డంతో ఈసారి అక్కడ సీపీఎం గెల‌వ‌డానికి అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ఎన్నిక‌ల‌పై ఈసారి బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ కూడా ఆశ‌లు పెట్టుకుంది. ఆ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ప‌లు ఎన్నిక‌ల్లో కొన్ని స్థానాల‌ను గెలుచుకున్నా కేవ‌లం అభ్యర్థుల బ‌లంతోనే గెలిచారు. ప్రధాన పార్టీల్లో టిక్కెట్లు దొర‌క‌ని అభ్యర్థులు బీఎస్పీ బీఫాం తెచ్చుకొని పోటీ చేసి గెలిచి త‌ర్వాత వారికి న‌చ్చిన పార్టీల్లో చేరిపోయేవారు. ఈసారి మాత్రం త‌మ నేత‌ల‌నే గెలిపించుకోవాల‌ని ఆ పార్టీ భావిస్తోంది. జన‌సేన సైతం పొత్తుల్లో భాగంగా ఆ పార్టీకి బ‌లానికి మించి సీట్లు కేటాయించింది. పొత్తులు వారికి క‌లిసివ‌స్తాయ‌ని అంచ‌నా వేస్తోంది. ప్రచారానికి ఆ పార్టీ అధినేత్రి మాయావ‌తి కూడా వ‌చ్చారు.

ఇలా గ‌త ఎన్నిక‌ల‌కు భిన్నంగా ఈసారైనా త‌మ స‌త్తా చాటి క‌నీసం అసెంబ్లీలో అడుగుపెట్టాల‌ని ఐదారు పార్టీలు త‌హ‌త‌హ‌లాడుతున్నాయి. ఇప్పుడు కూడా ప్రధాన పోటీ మాత్రం టీడీపీ, వైసీపీ మ‌ధ్యే ఉంది. మ‌రి అసెంబ్లీలో అడుగుపెట్టాల‌ని ఈ పార్టీల ఫ్యూచ‌ర్ ఎలా ఉంటుందో చూడాలి. అయితే, క‌చ్చితంగా జ‌న‌సేన ఎంట్రీతో మూడో పార్టీ ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం మాత్రం ఖాయంగా క‌నిపిస్తోంది. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle