newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

ఈసారి అక్కడ ఏకపక్షం కాదట..!

14-04-201914-04-2019 07:52:37 IST
2019-04-14T02:22:37.138Z14-04-2019 2019-04-14T02:22:33.082Z - - 25-02-2020

ఈసారి అక్కడ ఏకపక్షం కాదట..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్‌‌లో గత కొన్ని ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఉభయ గోదావరి జిల్లాల పాత్ర కీలకంగా ఉంటుంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు సాధించిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఉభయ గోదావరి జిల్లాల ప్రజల తీర్పే రాష్ట్రం మొత్తం ఉంటుంది.

గత ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ హవా వీచింది. ఆ పార్టీ అధికారం దక్కించుకోవడానికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరం కావడానికి ఈ జిల్లాలే కారణం. తూర్పు గోదావరిలో మొత్తం 19 సీట్లలో ఏకంగా 12 సీట్లను టీడీపీ గెలుచుకోగా, టీడీపీ పొత్తుతో రాజమండ్రి సిటీ స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. పిఠాపురం స్థానాన్ని టీడీపీ రెబల్ వర్మ గెలుచుకొని మళ్లీటీడీపీలో చేరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 5 స్థానాలను మాత్రమే గెలుచుకుంది.

పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 స్థానాలలో టీడీపీ ఏకంగా 14 సీట్లు, బీజేపీ 1 సీటు గెలుచుకుని ఈ జిల్లాను కూటమి స్వీప్ చేసింది. మొత్తం ఉభయ గోదావరి లోని34 స్థానాల్లో టీడీపీ కూటమి 28 సీట్లు గెలవడం తో టీడీపీ సులువుగా అధికారం లోకి వచ్చింది. ఈ ఎన్నికల్లోనూ ఉభయ గోదావరి జిల్లాలపైనే రాష్ట్రంలో అధికారం ఈ పార్టీ చేపడుతుందో ఆధారపడి ఉంటుంది.

గత ఎన్నికల్లో జనసేన, బీజేపీతో పొత్తు టీడీపీకి ఇక్కడ బాగా మేలు చేసింది. ఈ జిల్లాల్లో కాపులు ఎక్కువ. జనసేనతో పొత్తు, కాపులకు రిజర్వేషన్ల హామీతో ఎప్పుడూ కాంగ్రెస్ వైపు ఉండే కాపులు టీడీపీ వైపు మొగ్గు చూపారు. దీంతో పాటు నరేంద్ర మోడీ హవా కూడా ఉండటం, బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో సానుకూలత ఉండటం కూడా టీడీపీకి పూర్తిగా కలిసి వచ్చింది. దీంతో ఈ రెండు జిల్లాల్లో ఫలితం వన్ సైడ్ అయ్యింది. 

ఈసారి ఇక్కడ త్రిముఖ పోరు జరిగింది. కాపుల్లో పట్టున్న జనసేన బరిలో దిగడంతో ఆ పార్టీ ప్రభావం ఎవరిపై పడుతుందో అనే ఆందోళన టీడీపీ, వైసీపీలో ఉంది. అయితే, పోలింగ్ సరళి బట్టి చూస్తే వైసీపీ ఈ రెండు జిల్లాల్లో గతంతో పోల్చితే బాగా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాపుల్లో యువత ఈసారి ఎక్కువగా జనసేన వైపు ఉంది. కాపుల్లో మిగతావారి ఓట్లు వైసీపీ, జనసేన, టీడీపీ చీల్చుకునే అవకాశం ఉంది. 

గత ఎన్నికల్లో గంపగుత్తగా వీరి ఓట్లు దక్కించుకున్న టీడీపీకి ఈసారి చాలా తక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది. వారికి ఇచ్చిన రిజర్వేషన్ హామీ అమలు కాకపోవడం, కాపు ఉద్యమంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం, వారి ప్రతినిధిగా ఉండే ముద్రగడ పద్మనాభాన్ని ఇబ్బంది పెట్టడం వంటి అంశాలు కాపుల్లో టీడీపీపై వ్యతిరేకత తీసుకువచ్చాయి.

ఇక్కడ దళిత, క్రిస్టియన్ ఓట్లు కూడా ఎక్కువ. వీరిలో వైసీపీకి ఎక్కువ మొగ్గు ఉంది. టీడీపీ వైపు బీసీలు ఉండే అవకాశం ఉంది. మొత్తానికి ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ చాలా సిట్టింగ్ స్థానాలను కోల్పోయే అవకాశం ఉంది. పలు నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ ఉండటంతో టీడీపీ మూడో స్థానానికి వెళ్లినా ఆశ్చర్యం లేదు. అయితే, జనసేన ఉన్నా ఎక్కువ స్థానాల్లో అయితే టీడీపీ, వైసీపీ మధ్యే పోటీ ఉంది. మొత్తానికి గత ఎన్నికల మాదిరిగా ఈసారి ఏకపక్షంగా అయితే ఉభయ గోదావరి జిల్లాల తీర్పు ఉండబోదని మాత్రం స్పష్టంగా అర్ధమవుతుంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle