newssting
BITING NEWS :
*ఢిల్లీలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్... పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం*ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి రానున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్..రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న చీఫ్ జస్టిస్ *జగన్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ని సూసైడ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసారు-లోకేష్ * బస్సు రోకోకి ఆర్టీసీ జేఏసీ పిలుపు.. అనుమతిలేదన్న పోలీసులు..బస్ డిపోల దగ్గర 144 సెక్షన్ విధింపు* ఇవాళ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం.. పార్టీ అధ్యక్షత బాధ్యతలు తీసుకున్న తర్వాత సోనియా గాంధీ నేతృత్వంలో తొలిసారి కీలక భేటీ*టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవిపై ప్రివిలేజ్ పిటిషన్ ఇచ్చిన వైసీపీ..స్పీకర్ తమ్మినేనిని పరుష పదజాలంతో దూషించారని ఫిర్యాదు *ఎన్నికలు నాకు కొత్తేమీ కాదు.. దమ్ముంటే గన్నవరంలో చంద్రబాబు, లోకేష్ పోటీచేయాలి-వంశీ సవాల్

ఈరోజే సీఎం వద్ద నెల్లూరు రెడ్డిగారి పంచాయతీ

09-10-201909-10-2019 11:29:06 IST
Updated On 09-10-2019 12:42:58 ISTUpdated On 09-10-20192019-10-09T05:59:06.568Z09-10-2019 2019-10-09T05:59:00.103Z - 2019-10-09T07:12:58.126Z - 09-10-2019

ఈరోజే సీఎం వద్ద నెల్లూరు రెడ్డిగారి పంచాయతీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తొలి నుండి కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉన్న ప్రాంతాలలో ఏపీకి తమిళనాడులో బోర్డర్ గా నెల్లూరు ప్రాంతం కూడా ఒకటి. అయితే వైఎస్ మరణాంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిస్థితులు.. రాష్ట్ర విభజన.. వైఎస్ కుమారుడైన జగన్మోహన్ రెడ్డి సొంతపార్టీతో జిల్లా క్యాడర్ కూడా జగన్మోహన్ రెడ్డి వైపే తరలివెళ్లారు. దీంతో 2014  ఎన్నికలలోనే జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలకు గాను ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఇక 2019 మొన్నటి సాధారణ ఎన్నికలలో రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలలో నెల్లూరు జిల్లా కూడా ఒకటి.

వైసీపీకి జిల్లాలో బలమెంత అన్నదానికి ఈ ఫలితాలే ఉదాహరణ. అయితే ఇప్పుడు ఆ జిల్లా పార్టీలో ముఠా తగాదాలు రాజ్యమేలుతున్నాయి. గ్రూపు తగాదాలు కూడా ఒకనాటి కాంగ్రెస్ పార్టీ నుండి ఈనాడు వైసీపీకి తరలివచ్చినవే. అసలే గ్రూపు తగాదాలకు తోడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కనుక సహజంగానే ఆధిపత్య పోరు కూడా మొదలైంది. అందుకు ఉదాహరణే తాజాగా జరిగిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఎంపీడీఓ సరళ మధ్య జరిగిన సంఘటన. ఆ అంశం చివరికి ప్రభుత్వానికి చుట్టుకొనే వరకు వెళ్లడంతో ప్రభుత్వం కూడా తప్పక పోలీసుకి పవర్ ఇచ్చేసింది.

మొన్న ఢిల్లీ నుండి ఏపీకి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన డీజీపీతో మీటింగ్ పెట్టి ఆ వ్యవహారం మీద చర్చలు జరిపి ప్రొసీడ్ అనడంతో తెల్లవారుజామున కోటంరెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే ఆదివారం అయనకు బెయిల్ దొరికింది. కానీ విడుదలైన సమయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి, ఆయన వర్గంపై తీవ్ర ఆరోపణలు చేశారు. జిల్లాలో అందరి అధికారాలను కాకాణి చెలాయిస్తున్నాడని, ఆయన అనుచరులే ఎంపీడీఓ ఇంటి వద్ద గొడవ చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేసిన కోటంరెడ్డి తన తప్పు ఉందని తెలిస్తే ఎంపీడీఓకు బహిరంగ క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమని కాస్త సెంటిమెంట్ మసాలాను దట్టించి చెప్పారు.

నిజానికి కోటంరెడ్డి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలంలో తన సమీప బంధువైన కృష్ణారెడ్డి అనే వ్యక్తి లే అవుట్ వేశాడు. దానికి వాటర్ కనెక్షన్ ఇవ్వాలని ఎంపీడీఓ సరళను ఎమ్మెల్యే కోటంరెడ్డి పలుమార్లు కోరినా పట్టించుకోలేదు. గొడవ జరిగిన రోజు ఫోన్ చేసిన కోటంరెడ్డి ఈరోజు తప్పక కనెక్షన్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టినా కాకాణి గోవర్ధన్ వద్దంటున్నారని ఎంపీడీఓ చెప్పడంతో కోటం రెడ్డి కోపం నషాళానికి అంటి గొడవకు దిగాడన్నది జిల్లా రాజకీయాలలో వినిపించిన మాట. అంతేకాదు ఈ విషయం మీద కోటం రెడ్డి కాకాణికి ఫోన్ చేసినా నీకు తెలియదు ఊరుకో అనే సమాధానం కూడా వచ్చిందని జిల్లా నేతల మాట. దీంతోనే కోటం రెడ్డి ఉగ్రుడయ్యాడని చెప్పుకొస్తున్నారు.

ఇదంతా వారం క్రితం వ్యవహారం. ఢిల్లీ నుండి రాష్టానికి వచ్చిన సీఎం వ్యవహారం ఉద్యోగులతో కూడిన అంశం కావడంతో వెంటనే అరెస్టులు.. సంప్రదాయంగా బెయిల్లు అన్నీ జరిగిపోయాయి. కానీ సీఎం మాత్రం జిల్లా రాజకీయాలపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఇంత జరిగినా జిల్లా మంత్రులు, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, ఆత్మకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు తావిస్తుండగా ఇంకొన్నాళ్ళు జిల్లాను పట్టించుకోకపోతే వ్యవహారం చెడే క్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి  ఈరోజు నెల్లూరు రాజకీయం.. మరీ ముఖ్యంగా ఈ రెడ్డి గారి పంచాయతీని తేల్చనున్నట్లుగా తెలుస్తుంది. మరి రెడ్డి గారు శాంతపడతారా? శాంతిపజేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ!


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle